బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌.. ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా | Chevella Mp Ranjith Reddy Resigns From Brs | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌.. ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా

Published Sun, Mar 17 2024 12:02 PM | Last Updated on Sun, Mar 17 2024 1:51 PM

Chevella Mp Ranjith Reddy Resigns From Brs - Sakshi

సాక్షి,రంగారెడ్డి జిల్లా: బీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కేసీఆర్‌కు లేఖ పంపించిన రజింత్‌రెడ్డి.. చేవెళ్ల ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు  ధన్యవాదాలు తెలిపారు.

కాగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేయడమే టార్గెట్‌గా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. బీఆర్‌ఎస్‌కి  చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గుడ్ బై చెప్పగా, ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లోని ముగ్గురు జెడ్పీ చైర్మన్లు కాంగ్రెస్‌లో చేరారు.

రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, యాదయ్య  కలిశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. చేవెళ్ల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పట్నం సునీతా రెడ్డిని బరిలో దింపాలని కాంగ్రెస్‌ యోచిస్తున్నట్లు సమాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement