షాద్ నగర్ నియోజకవర్గం
షాద్‌నగర్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పక్షాన పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే సి.ప్రతాప్ రెడ్డిపై 20556 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. అంజయ్యకు 72180 ఓట్లు రాగా, ప్రతాపరెడ్డికి 51624 ఓట్లు వచ్చాయి. వరసగా రెండోసారి గెలిచిన అంజయ్య యాదవ్ సామాజికపరంగా యాదవ వర్గానికి చెందినవారు. ఇక్కడ బిఎస్పి తరపున పోటీచేసిన వి.శంకర్‌కు 27750 ఓట్లు రావడం విశేషం.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జనరల్ సీటుగా మారిన షాద్‌నగర్ నుంచి 2009 లో కాంగ్రెస్ ఐ అభ్యర్ధి ప్రతాప్‌రెడ్డి పోటీచేసి గెలుపొందినా, 2014లో ఓడిపోయారు. టిఆర్‌ఎస్ నేత అంజయ్యయాదవ్ తన ప్రత్యర్ధి ప్రతాపరెడ్డిని 17328 మెజార్టీతో ఓడిరచారు. హైదరాబాద్‌లోరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేరళ మాజీ గవర్నర్ బూర్గుల రామకృష్ణారావు 1952లో గెలుపొందారు. 1952 నుంచి 1962 వరకు జనరల్‌గా ఉన్న ఈ నియోజకవర్గం 1967 నుంచి 2004 వరకు రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉండేది. తిరిగి 2009లో జనరల్ స్థానంగా మారింది.
కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి 11 సార్లు, టిడిపి రెండుసార్లు,టిఆర్‌ఎస్ రెండుసార్లు గెలిచాయి, షాద్‌నగర్‌లో అత్యధికంగా డాక్టర్ పి. శంకరరావు నాలుగుసార్లు గెలిచారు.ఈయన 2009లో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో పోటీచేసి ఐదోసారి గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన కె.నాగన్న ఇతర చోట్ల మరో మూడుసార్లు విజయం సాధించారు. ఇక్కడ నుండి 1957లో గెలుపొందిన షాజహాన్ బేగం అంతకుముందు పరిగిలో ఏకగ్రీవంగా గెలవడం విశేషం.
షాద్ నగర్ జనరల్ గా ఉన్నప్పుడు రెండుసార్లు రెడ్డి, రెండుసార్లు బిసి,ఒకసారి ముస్లిం నేతలు ఎన్నికయ్యారు. ఇక్కడ గెలిచిన శంకరరావు గతంలో విజయబాస్కరరెడ్డి క్యాబినెట్ లోను ఆ తర్వాత కిరణ్ క్యాబినెట్‌లోను మంత్రి అయ్యారు. కాని కిరణ్ తో వచ్చిన విబేధాల కారణంగా పదవి పోగొట్టుకున్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ ఆస్తులపై శంకరరావు హైకోర్టుకు లేఖ రాయడం, ఆ తర్వాత కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడం,జగన్ ను అరెస్టు చేయడం వంటి కీలక ఘట్టాలకు శంకరరావు పాత్రధారి అవడం విశేషం.
షాద్‌నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment