తాండూరు నియోజకవర్గంలో విజయం సాధించేది ఎవరు..? | Tandur Constituency Political History | Sakshi
Sakshi News home page

తాండూరు నియోజకవర్గంలో విజయం సాధించేది ఎవరు..?

Published Thu, Aug 3 2023 1:48 PM | Last Updated on Thu, Aug 17 2023 1:02 PM

Tandur Constituency Political History - Sakshi

తాండూరు నియోజకవర్గం

తెలంగాణ అంతటా టిర్‌ఎస్‌ గాలివీస్తే తాండూరులో మాత్రం 2018 ఎన్నికల సమయం వరకు మంత్రిగా ఉన్న మహేందర్‌ రెడ్డి ఓటమి పాలవడం విశేషం. రంగారెడ్డి జిల్లాలో బలమైన నేతగా తయారైన ఆయన ఈ ఎన్నికలో ఓటమి చెందారు. ఆయనపై కాంగ్రెస్‌ ఐ అభ్యర్ది పైలట్‌ రోహిత్‌ రెడ్డి విజయం సాదించారు. రోహిత్‌కు  2875 ఓట్ల ఆధిక్యత లభించింది. తదుపరి రోహిత్‌ కూడా టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. గతంలో మహేందర్‌ రెడ్డి మూడుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి టిఆర్‌ఎస్‌ తరపున గెలిచారు. రోహిత్‌ రెడ్డికి 70428 ఓట్లు, మహేందర్‌ రెడ్డికి 67553 ఓట్లు వచ్చాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందిన రోహిత్‌ రెడ్డి మొదటి సారి గెలుపొందారు. కాగా బిజెపి పక్షాన పోటీచేసిన పటేల్‌ రవిశంకర్‌కు పదివేలకు పైగా ఓట్లు వచ్చాయి.

2014లో మహేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్ది, మాజీ ఎమ్మెల్యే నారాయణరావుపై  15982 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. అంతకుముందు మూడుసార్లు టిడిపి పక్షాన గెలుపొందగా 2014లో  టిఆర్‌ఎస్‌లోకి వెళ్లి గెలిచారు. తదుపరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంత్రివర్గంలో మహేంద్రరెడ్డికి స్థానం లభించింది. కాని 2018లో మహేందర్‌ రెడ్డి ఓటమిపాలయ్యారు. తాండూరులో ఏడుసార్లు రెడ్లు గెలుపొందారు. ఏడుసార్లు బిసి నేతలు విజయం సాధించారు. ఒకసారి బ్రాహ్మణవర్గం నేత విజయం సాధించారు. తాండూరు నియోజకవర్గంలో డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి రెండుసార్లు గెలిచారు.

ఈయన వికారాబాద్‌, మేడ్చల్‌, సనత్‌నగర్‌లలో మరోనాలుగుసార్లు గెలుపొందారు. చెన్నారెడ్డి గతంలో నీలం, కాసు మంత్రివర్గాలలో పనిచేసారు. కేంద్రంలో కొంతకాలం మంత్రిగా ఉన్నారు. 1967లో గెలిచాక ఈయన ప్రత్యర్ధిగా ఉన్న వందేమాతం రామచంద్రరావు ఎన్నికల పిటీషన్‌ వేయగా, కోర్టు ఈయనను అనర్హుడిగా ప్రకటించింది. దాంతో కేంద్రంలో పదవికి చెన్నారెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే సమయంలో వచ్చిన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆ తరువాత కాలంలో రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని, నాలుగు రాష్ట్రాలకు గవర్నరు పదవినిచేపట్టారు.

మధ్యలో కొంతకాలం నేషనల్‌ డెమొక్రాటిక్‌ పార్టీని నెలకొల్పి 1984లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి టిడిపి మద్దతుతో పోటీచేసి ఓడిపోవడం విశేషం. తిరిగి 1989 నాటికి కాంగ్రెస్‌ ఐలో చేరి మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 1969లో ఉప ఎన్నికద్వారా శాసనసభకు ఎన్నికైన ఎమ్‌.మాణిక్యరావు 1972లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత మరో రెండుసార్లు గెలిచిన మాణిక్యరావు కొంతకాలం పి.వి.అంజయ్య భవనం కోట్ల మంత్రివర్గాలలో సభ్యులయ్యారు. మాణిక్యరావు సోదరుడు ఎమ్‌.చంద్రశేఖర్‌ రెండుసార్లు ఇక్కడ నుంచి గెలిచి మంత్రి పదవిని కూడా నిర్వహించారు. 2004లో వీరి మరో సోదరుడు నారాయణరావు కూడా ఇక్కడ నుంచి గెలిచారు. 2009లో మాణిక్‌రావు కుమారుడు రమేష్‌ పోటీచేసి ఓడిపోయారు.

తాండూరు నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement