anjaiahyadav
-
ఎమ్మెల్యేను కొట్టిన మంత్రి..
-
ఈసారి షాద్‌నగర్ నియోజకవర్గంలో తొలి హ్యాట్రిక్ సాధ్యమా?
షాద్ నగర్ నియోజకవర్గం షాద్‌నగర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే సి.ప్రతాప్ రెడ్డిపై 20556 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. అంజయ్యకు 72180 ఓట్లు రాగా, ప్రతాపరెడ్డికి 51624 ఓట్లు వచ్చాయి. వరసగా రెండోసారి గెలిచిన అంజయ్య యాదవ్ సామాజికపరంగా యాదవ వర్గానికి చెందినవారు. ఇక్కడ బిఎస్పి తరపున పోటీచేసిన వి.శంకర్‌కు 27750 ఓట్లు రావడం విశేషం. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జనరల్ సీటుగా మారిన షాద్‌నగర్ నుంచి 2009 లో కాంగ్రెస్ ఐ అభ్యర్ధి ప్రతాప్‌రెడ్డి పోటీచేసి గెలుపొందినా, 2014లో ఓడిపోయారు. టిఆర్ఎస్ నేత అంజయ్యయాదవ్ తన ప్రత్యర్ధి ప్రతాపరెడ్డిని 17328 మెజార్టీతో ఓడిరచారు. హైదరాబాద్లోరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేరళ మాజీ గవర్నర్ బూర్గుల రామకృష్ణారావు 1952లో గెలుపొందారు. 1952 నుంచి 1962 వరకు జనరల్‌గా ఉన్న ఈ నియోజకవర్గం 1967 నుంచి 2004 వరకు రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉండేది. తిరిగి 2009లో జనరల్ స్థానంగా మారింది. కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి 11 సార్లు, టిడిపి రెండుసార్లు,టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి, షాద్‌నగర్‌లో అత్యధికంగా డాక్టర్ పి. శంకరరావు నాలుగుసార్లు గెలిచారు.ఈయన 2009లో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పోటీచేసి ఐదోసారి గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన కె.నాగన్న ఇతర చోట్ల మరో మూడుసార్లు విజయం సాధించారు. ఇక్కడ నుండి 1957లో గెలుపొందిన షాజహాన్ బేగం అంతకుముందు పరిగిలో ఏకగ్రీవంగా గెలవడం విశేషం. షాద్ నగర్ జనరల్ గా ఉన్నప్పుడు రెండుసార్లు రెడ్డి, రెండుసార్లు బిసి,ఒకసారి ముస్లిం నేతలు ఎన్నికయ్యారు. ఇక్కడ గెలిచిన శంకరరావు గతంలో విజయబాస్కరరెడ్డి క్యాబినెట్ లోను ఆ తర్వాత కిరణ్ క్యాబినెట్‌లోను మంత్రి అయ్యారు. కాని కిరణ్ తో వచ్చిన విబేధాల కారణంగా పదవి పోగొట్టుకున్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ ఆస్తులపై శంకరరావు హైకోర్టుకు లేఖ రాయడం, ఆ తర్వాత కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడం,జగన్ ను అరెస్టు చేయడం వంటి కీలక ఘట్టాలకు శంకరరావు పాత్రధారి అవడం విశేషం. షాద్‌నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
వ్యవసాయమంటే ప్రాణం
‘నాటకం ఉందంటే చాలు మిత్రులతో కలిసి సైకిల్ మీద సవారీ చేస్తూ ఎంత దూరమైనా వెళ్లి చూసేవాళ్లం. పౌరాణిక సినిమాలంటే ప్రాణం.. పద్యాలు భలే ఇష్టం.. రంగ స్థల కళాకారుడిగా బహుమతులు అందుకున్న క్షణాలు మరిచిపోలేనివి. ఎనిమిదో తరగతిలోనే నాగలి పట్టా.. వ్యవసాయం అంటే ప్రాణం.. రాజకీయాల ద్వారా ప్రజల్లో ఉండటం నా అదృష్టం’ అని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. పర్సనల్ టైమ్‌లో భాగంగా తన జ్ఞాపకాలు, అభిరుచులను ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాట్లాలోనే.. సాక్షి, షాద్‌నగర్ టౌన్: నేను వ్యవసాయ కుటుంబంలో జన్మించా. భార్య, ఇద్దరు పిల్లలు.. పెద్ద కుమారుడు ఎల్గనమోని రవీందర్ యాదవ్ ప్రస్తుతం కేశంపేట ఎంపీపీగా ఉన్నారు. రెండో కుమారుడు మురళీకృష్ణ యాదవ్ సాఫ్ట్వేర్ రంగంలో పని చేస్తున్నారు. నేను ఎక్కువగా రాజకీయాలకే పరిమితం కుటుంబ సరదాలు తక్కువే. ఐదో తరగతి వరకు మా స్వగ్రామమైన ఎక్లాస్‌ఖాన్‌పేటలో చదివా. కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హైస్కూల్ చదువు కొనసాగింది. 1967– 68 సంవత్సరంలో షాద్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎస్సీ పూర్తి చేశా. హైదరాబాద్ కోఠి వివేకానంద కళాశాలలో పీయూసీ చదివా. పత్తర్‌ఘాట్‌లోని ఎంబీ సైన్స్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశా. మాల్ పటేల్‌గా పని చేశా.. రెవెన్యూశాఖలో ఆనాటి మాల్ పటేల్ అంటే ఇప్పటి వీఆర్ఓగా, పట్వారీగా, పోలీస్ పటేల్‌గా పనిచేశా. ఆ కాలంలో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. నాదగ్గరికి పని కోసం వచ్చే రైతులకు, ప్రజలకు బస్సుచార్జీలు నేనే ఇచ్చేవాడిని. వారికి ఏ కార్యాలయంలో పని ఉన్నా నా డబ్బులు ఖర్చు పెట్టి తీసుకెళ్లి పని చేసిపెట్టేవాణ్నిను. పేదవాళ్ల కోసం నా జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పేదలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఎంతో కృషి చేశా. సేవ చేయాలనే సంకల్పంతోనే... కుటుంబ బాధ్యతల కోసం ఉద్యోగినయ్యా. నా సంతోషం కోసం కళాకారుడినయ్యా. నాకిష్టమైన పాత్ర రాజకీయ నాయకుడే.. ఎందుకంటే ప్రజలకు సేవ చేసే అవకాశం ఇక్కడే దొరుకుతుంది. రెవెన్యూ శాఖలో మంచి ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం చిన్నతనం నుంచే ఉంది. రాజకీయాల్లోకి వస్తేనే అది సాధ్యమని నమ్మిన వ్యక్తిని. 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన కాల్పుల్లో విద్యార్థులు చనిపోయారు. ఇది నన్ను ఎంతో బాధించింది. కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నన్ను రాజకీయాల వైపు నడిపించింది. అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా. వ్యవసాయం అంటే ఇష్టం.. నాకు వ్యవసాయ అంటే చాలా ఇష్టం. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు నాగలి పట్టా. చిన్నపిల్ల వాడిని నాగలి కొట్టొద్దని చెప్పారు. అయినా నేను నాగలి కొట్టడం నేర్చుకున్నా. నాపని తనం చూసి పొలంలో సాళ్లు కొట్టాలన్నా, సాగు పనులు చేయాలంటే ముందు వరుసలో నా నాగలే ఉండాలని అందరూ పట్టుబట్టేవారు. వ్యవసాయం నాకు వ్యసనంగా మారడంతో పొలానికి వెళ్లి పనుల్లో లీనమై పోయేవాన్ని. మామిడికాయ కారం.. నెయ్యి భలే ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి మామిడికాయ కారం, నెయ్యి అంటే భలే ఇష్టం. ఆ రెండు ఉంటే చాలా కడుపునిండా భోజనం చేస్తా. మాంసాహారం తినడం జీవహింస అని భావించి.. శాకాహారిగా మారా. నాటకం, పద్యాలు నాకు ప్రాణం. కళాకారుడిగా మారి రామాయణ, మహాభారతం నాటకాల్లో ప్రదర్శించా. అభిమన్యుడు, ఉత్తర కుమారుడు, అర్జునుడు, మార్కాండేయుడి వంటి పాత్రలు వేసి బహుమతులు కూడా అందుకున్నా. శ్రీరాముడు నాకు ఆదర్శం. సరదాలు.. సంతోషాలు పౌరాణిక సినిమాలు ఎంతో ఇష్టంగా చూసే వాడిని. ఇప్పటీకీ టీవీల్లో అలాంటి సినిమాలు వస్తే చూస్తాను. ఇప్పటి సినిమాల మీద నాకు అంతగా ఆసక్తి లేదు. మిత్రులతో కలిసి కబడ్డీ బాగా ఆడేవాళ్లం. ఇప్పటికీ చిన్ననాటి స్నేహితులను కలుస్తుంటా. -
పాలమూరుపై కక్షసాధింపు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేపడుతున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆపేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, అంజయ్యయాదవ్ విమర్శించారు. జిల్లాపై ఆ పార్టీ కక్షసాధిస్తోందని వారు ఆరోపించారు. శనివారం మహబూబ్‌నగర్‌లో విలేకరులతో వారు మాట్లాడుతూ 60ఏళ్లలో వలసల జిల్లాగా మార్చారన్నారు. అపెక్స్ కమిటీ సమావేశంలో ‘పాలమూరు’ను అడ్డుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వాదించగా సీఎం కేసీఆర్ తిప్పికొట్టారన్నారు. దీంతో వారి నిజస్వరూపం బయటపడిందని, ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ నాయకులు జిల్లా ప్రజలవైపా.. ఆంధ్ర వైపా అని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో సాగు, తాగు నీటిలో జిల్లాకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలను ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. వచ్చే ఏడాది మార్చినాటికి మన్యంకొండ సంప్‌హౌస్‌ను పూర్తి చేసి మహబూబ్‌నగర్ పట్టణానికి తాగునీరందిస్తామన్నారు. శంషాబాద్‌వైపు ప్రజల మొగ్గు షాద్‌నగర్ నియోజకర్గ ప్రజలు శంషాబాద్ జిల్లాలోనే కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. జిల్లా కేంద్రం అతి సమీపంలోకి రావడంతో అక్కడి ప్రజలు మహబూబ్‌నగర్ నుంచి విడిపోయేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. కుట్రలకు పెట్టింది పేరు ఆంధ్ర పాలకులని విమర్శించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, శివకుమార్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.