చేవెళ్ల (ఎస్సి ) నియోజకవర్గం
చేవెళ్ల రిజర్వుడు నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్ధి కాలె యాదయ్య మరోసారి గెలిచారు. ఆయ తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి కె.ఎస్. రత్నంపై 33747 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014లో యాదయ్య కాంగ్రెస్ ఐ టిక్కెట్ పై గెలిచి, ఆ తర్వాత కాలంలో టిఆర్‌ఎస్ లో చేరారు.తిరిగి టిఆర్‌ఎస్ పార్టీ తరపున 2018లో పోటీచేసి విజయం సాదించారు. కాగా ఇక్కడ టిఆర్‌ఎస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే రత్నం టిక్కెట్ రానందుకు నిరసనగా పార్టీని వీడి కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసినా ఫలితం దక్కలేదు. కాలె యాదయ్యకు 98701 ఓట్లు రాగా,కె.ఎస్ రత్నంకు 64954 ఓట్లు వచ్చాయి.
బిజెపి పక్షాన పోటీచేసి కంజర్ల ప్రకాశ్ కు 5400 ఓట్లు వచ్చాయి. రత్నం గతంలో టిడిపి ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆయన 2014 ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్‌లోకి వెళ్లి ఆ పార్టీ తరపున పోటీచేసినా విజయం సాదించలేకపోయారు.కాంగ్రెస్ ఐఅభ్యర్దిగా పోటీచేసిన కె.యాదయ్య 781 ఓట్ల ఆదిక్యతతో రత్నంపై విజయం సాధించారు. 2009 నుంచి చేవెళ్ల రిజర్వుడ్ నియోకవర్గంగా ఉంది. ఇక్కడ ఏడుసార్లు రెడ్లు, మూడుసార్లు ఇతరవర్గాలవారు గెలుపొదగా, మూడుసార్లుగా ఎస్.సి నేతలు విజయం సాధిస్తున్నారు.
1962లో ఏర్పడిన చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐలు కలిసి ఏడుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్‌ఎస్ ఒకసారి, జనతాపార్టీ ఒకసారి, ఇండిపెండెంటు ఒకరు నెగ్గారు చేవెళ్లలో నాలుగుసార్లు గెలిచిన పి.ఇంద్రారెడ్డి, రెండుసార్లు చేవెళ్లలోను, రెండుసార్లు మహేశ్వరంలోను గెలిచిన సబిత భార్యభర్తలు. ఇంద్రారెడ్డి గతంలో ఎన్‌టిఆర్ క్యాబినెట్‌లో హోం శాఖతోపాటు వివిధ మంత్రిత్వ శాఖలకు బాధ్యత వహించగా, సబిత డాక్టర్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో 2004లో గనుల శాఖను,2009లో మహేశ్వరం లో గెలిచాక హోంశాఖను పర్యవేక్షించే మంత్రి కావడం విశేషం.
సబిత ఉమ్మడి ఏపీలో తొలి మహిళా హోం మంత్రికాగా, దంపతులు ఇద్దరూ ఒకే శాఖను చూసిన అరుదైన గౌరవాన్ని కూడా పొందారు. కాని తర్వాత సబిత జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కుని రాజీనామా చేయవలసి వచ్చింది. 1999లో గెలిచాక ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జరిగిన ఉప ఎన్నిక ద్వారా సబితరాజకీయ ప్రవేశంచేశారు. 2014లో ఆమె పోటీలో లేరు. ఇంద్రారెడ్డి 1983లో లోక్‌దళ్ పక్షాన పోటీచేసి ఓడిపోయి, 1985 నుంచి మూడుసార్లు టిడిపి పక్షాన గెలిచారు. 1995లో టిడిపి చీలిక సమయంలో ఎన్‌టిఆర్ పక్షాన ఉన్నారు. ఆ తరువాత కొంతకాలం ఎన్‌టిఆర్ టిడిపి (లక్ష్మీపార్వతి) పార్టీలో కొనసాగి, తరువాత కాంగ్రెస్ ఐలో చేరి మరోసారి గెలిచారు.
చేవెళ్ల (ఎస్సి ) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment