yadaiah
-
నెత్తురోడుతున్నా.. బెదరకుండా..
సాక్షి, హైదరాబాద్: ఛాతి, మెడ, కడుపు, చేతుల మీద విచక్షణారహితంగా కత్తిపోట్లు.. రక్తం ఏరులై పారుతున్నా ఏమాత్రం బెదరకుండా కరుడుగట్టిన అంతర్రాష్ట్ర చెయిన్ స్నాచర్ ఇషాన్ నిరంజన్ నీలంనల్లి ఆటకట్టించారు హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్య. అతని ధైర్య సాహసాలను గుర్తించిన కేంద్ర హోం శాఖ అత్యున్నత శౌర్య పతకం రాష్ట్రపతి గ్యాలంటరీ పురస్కారానికి ఎంపిక చేసింది. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యాదయ్య ఈ అవార్డును అందుకోనున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఈ పతకానికి ఎంపికైన ఏకైక పోలీసు యాదయ్యే కావడం విశేషం. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని మాదాపూర్ సీసీఎస్‌లో యాదయ్య హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. యాదయ్య అవార్డుకు ఎంపికవడంతో ఆయన కుటుంబ సభ్యులు, స్వగ్రామమైన చేవెళ్లలోని మీర్జాగూడలో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.నాడు ఏం జరిగిందంటే..2022 జూలై 25న చెయిన్ స్నాచింగ్, అక్రమ ఆయుధాల సరఫరాదారులైన ఇషాన్ నిరంజన్ నీలంనల్లి, రాహుల్ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో స్నాచింగ్‌లకు తెగబడ్డారు. కూకట్పల్లి, గచ్చిబౌలి, ఆర్సీపురం, మియాపూర్‌లలో వరుస చెయిన్ స్నాచింగ్‌లతో హడలెత్తించారు. దీంతో స్నాచర్లను పట్టుకునేందుకు వెంటనే అప్పటి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. స్నాచర్ల కోసం కమిషనరేట్ పరిధిలోని అన్ని సీసీటీవీ ఫుటేజ్‌లను జల్లెడ పట్టారు. స్నాచింగ్ సమయంలో నిందితులు వినియోగించిన ద్విచక్ర వాహనం, వారు ధరించిన దుస్తులను గుర్తించారు. వీటి ఆధారంగా నిందితుల జాడ కోసం వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో స్నాచర్లు మియాపూర్‌లో మరో స్నాచింగ్ చేసి, బైక్ మీద వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో మాదాపూర్ సీసీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న యాదయ్య, దేబేష్లు బైక్ మీద ఆర్సీపురం నుంచి మియాపూర్ వైపు వస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇరువురు స్నాచర్లను పట్టుకునేందుకు బయలుదేరారు.రక్తం కారుతున్నా...నిందితులు అశోక్‌నగర్ హెచ్ఐజీ గేట్ నుంచి బీహెచ్ఈఎల్ వైపు మళ్లారు. దీంతో కాలనీలోనే స్నాచర్లను పట్టుకోవాలని నిర్ణయించుకున్న యాదయ్య బైక్‌ను హెచ్ఐజీ గేట్ లోపలికి మళ్లించారు. కాలనీలో నుంచి బైక్ మీద ఎదురుగా వస్తున్న నిందితులు ఇషాన్, రాహుల్ వీరిని దాటి వెళ్లేందుకు యత్నించారు. దీంతో బైక్ వెనకాల కూర్చున్న కానిస్టేబుల్ దేబేష్ స్నాచర్ రాహుల్‌ను, బైక్ నడుపుతూనే యాదయ్య మరో స్నాచర్ ఇషాన్‌ను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఇషాన్ జేబులో నుంచి కత్తి తీసి యాదయ్య ఛాతి, మెడ, చేతులు, కడుపు, శరీరం వెనక భాగంలో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావమవుతున్నా యాదయ్య ఏమాత్రం బెదరకుండా ఇషాన్‌ను అదిమి పట్టుకున్నాడు. ఇంతలో సమీపంలో ఉన్న మరో కానిస్టేబుల్ రవి ఘటనా స్థలానికి రావడంతో ఇరువురు స్నాచర్లను అదుపులోకి తీసుకున్నారు. యాదయ్యను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఏడు కత్తిపోట్లతో ప్రాణాప్రాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన యాదయ్య 18 రోజులపాటు చావుతో పోరాడాడు. ఆఖరికి శరీరం లోపల, బయట మూడు సర్జరీలు, వందకు పైగా కుట్లు పడటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. రెండు నెలల విశ్రాంతి తర్వాత మళ్లీ విధుల్లో చేరాడు. గతంలో లాగా శరీరం సహకరించకపోవడంతో అధికారులు యాదయ్యను ఆఫీసు విధులకు పరిమితం చేశారు.సహచరుల సహకారంతోనే..తోటి కానిస్టేబుళ్లు దేబేష్, రవి సహకారంతోనే స్నాచర్లను పట్టుకోగలిగాం. ప్రజలకు రక్షణ కల్పించడం పోలీసుగా మా విధి. పై అధికారుల ప్రోత్సాహంతో వారిని ఆదర్శంగా తీసుకొని విధులు నిర్వర్తిస్తాను. –చదువు యాదయ్య, హెడ్ కానిస్టేబుల్ -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
నాంపల్లి (హైదరాబాద్): సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాలక, ప్రతిపక్షాలు నోరు మెదపకపోవడం బాధాకరమని తెలంగాణ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య ధ్వజమెత్తారు. గురువారం నాంపల్లిలోని గన్‌పార్కు వద్ద తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన తాజా మాజీ సర్పంచ్‌లు ముందుగా పబ్లిక్‌గార్డెన్స్‌కు చేరుకున్నా రు. అక్కడి నుంచి ర్యాలీగా గన్‌పార్కుకు వచ్చారు. నిరసన సభ ఉద్రిక్తతకు దారితీయకుండా పోలీసులు భారీగా మోహరించారు. గన్‌పార్కు వద్ద మాజీ సర్పంచ్‌లు నిరసన వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడికక్కడే అరెస్టు చేసి, నాంపల్లి పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా సుర్వి యాదయ్య విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం సర్పంచ్‌లను మోసం చేస్తే...అధికారంలోకి రాగానే సర్పంచ్‌లను ఆదుకుంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని రెండు పర్యాయాలు కలిసి వినతిపత్రం అందజేశామని చెప్పా రు. పార్లమెంట్ ఎన్నికలలోపు సర్పంచ్‌లకు అందాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశా రు. లేకపోతే ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో వందకు పైగా నామినేషన్లు దాఖలు చేసి ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్ల సంఘం నేతలు కొలను శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
చేవెళ్ల (SC) నియోజకవర్గం తదుపరి అభ్యర్థి..?
చేవెళ్ల (ఎస్సి ) నియోజకవర్గం చేవెళ్ల రిజర్వుడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి కాలె యాదయ్య మరోసారి గెలిచారు. ఆయ తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి కె.ఎస్. రత్నంపై 33747 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014లో యాదయ్య కాంగ్రెస్ ఐ టిక్కెట్ పై గెలిచి, ఆ తర్వాత కాలంలో టిఆర్ఎస్ లో చేరారు.తిరిగి టిఆర్ఎస్ పార్టీ తరపున 2018లో పోటీచేసి విజయం సాదించారు. కాగా ఇక్కడ టిఆర్ఎస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే రత్నం టిక్కెట్ రానందుకు నిరసనగా పార్టీని వీడి కాంగ్రెస్ ఐలో చేరి పోటీచేసినా ఫలితం దక్కలేదు. కాలె యాదయ్యకు 98701 ఓట్లు రాగా,కె.ఎస్ రత్నంకు 64954 ఓట్లు వచ్చాయి. బిజెపి పక్షాన పోటీచేసి కంజర్ల ప్రకాశ్ కు 5400 ఓట్లు వచ్చాయి. రత్నం గతంలో టిడిపి ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆయన 2014 ఎన్నికలకు ముందు టిఆర్ఎస్లోకి వెళ్లి ఆ పార్టీ తరపున పోటీచేసినా విజయం సాదించలేకపోయారు.కాంగ్రెస్ ఐఅభ్యర్దిగా పోటీచేసిన కె.యాదయ్య 781 ఓట్ల ఆదిక్యతతో రత్నంపై విజయం సాధించారు. 2009 నుంచి చేవెళ్ల రిజర్వుడ్ నియోకవర్గంగా ఉంది. ఇక్కడ ఏడుసార్లు రెడ్లు, మూడుసార్లు ఇతరవర్గాలవారు గెలుపొదగా, మూడుసార్లుగా ఎస్.సి నేతలు విజయం సాధిస్తున్నారు. 1962లో ఏర్పడిన చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐలు కలిసి ఏడుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి, జనతాపార్టీ ఒకసారి, ఇండిపెండెంటు ఒకరు నెగ్గారు చేవెళ్లలో నాలుగుసార్లు గెలిచిన పి.ఇంద్రారెడ్డి, రెండుసార్లు చేవెళ్లలోను, రెండుసార్లు మహేశ్వరంలోను గెలిచిన సబిత భార్యభర్తలు. ఇంద్రారెడ్డి గతంలో ఎన్టిఆర్ క్యాబినెట్లో హోం శాఖతోపాటు వివిధ మంత్రిత్వ శాఖలకు బాధ్యత వహించగా, సబిత డాక్టర్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో 2004లో గనుల శాఖను,2009లో మహేశ్వరం లో గెలిచాక హోంశాఖను పర్యవేక్షించే మంత్రి కావడం విశేషం. సబిత ఉమ్మడి ఏపీలో తొలి మహిళా హోం మంత్రికాగా, దంపతులు ఇద్దరూ ఒకే శాఖను చూసిన అరుదైన గౌరవాన్ని కూడా పొందారు. కాని తర్వాత సబిత జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కుని రాజీనామా చేయవలసి వచ్చింది. 1999లో గెలిచాక ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జరిగిన ఉప ఎన్నిక ద్వారా సబితరాజకీయ ప్రవేశంచేశారు. 2014లో ఆమె పోటీలో లేరు. ఇంద్రారెడ్డి 1983లో లోక్‌దళ్ పక్షాన పోటీచేసి ఓడిపోయి, 1985 నుంచి మూడుసార్లు టిడిపి పక్షాన గెలిచారు. 1995లో టిడిపి చీలిక సమయంలో ఎన్టిఆర్ పక్షాన ఉన్నారు. ఆ తరువాత కొంతకాలం ఎన్టిఆర్ టిడిపి (లక్ష్మీపార్వతి) పార్టీలో కొనసాగి, తరువాత కాంగ్రెస్ ఐలో చేరి మరోసారి గెలిచారు. చేవెళ్ల (ఎస్సి ) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
అర్థరాత్రి క్యాబ్ డ్రైవర్ బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : ఓ క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.... అర్థరాత్రి సమయంలో శంషాబాద్ విమానాశ్రయం దగ్గర క్యాబ్‌లో ప్రయాణికులను ఎక్కించుకుంటుండగా పోలీసులు రావడంతో డ్రైవర్ హడావిడిగా అక్కడి నుంచి కారును పోనిచ్చాడు. అయితే క్యాబ్ ఎక్కేందుకు ప్రయత్నించిన యాదయ్య అనే ప్రయాణికుడి షర్టు కారులోపల ఇరుక్కోంది. ఇది గమనించని క్యాబ్ డ్రైవర్ ఎనిమిది కిలోమీటర్లపాటు కారు పోనిచ్చాడు. యాదయ్యను కారు లాక్కెడంతో అతడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. కారు బయట మృతదేహం వేలాడుతుండటంతో... శంషాబాద్ టోల్గేట్ వద్ద వాహనదారులు గమనించి..కేకేలు వేయడంతో క్యాబ్ వదిలి డ్రైవర్ అక్కడ నుంచి పరారైయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతుడి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. -
కుల బహిష్కరణపై టవరెక్కి నిరసన
-
కుల బహిష్కరణపై టవరెక్కి నిరసన
వలిగొండ(యాదాద్రి భువనగిరి): కుల బహిష్కరణపై ఆవేదన చెందిన ఇద్దరు యువకులు సెల్ టవరెక్కి నిరసన తెలిపారు. వలిగొండ మండలం దుప్పలి గ్రామంలో అరూర్ యాదయ్య, సండ్ర యాదయ్య అనే వారు కుల పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో కులపెద్దలు వారిపై కుల బహిష్కరణ శిక్ష విధించారు. దీనిపై బాధితులు తహశీల్దారుకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం కనిపించకపోవటంతో శుక్రవారం ఉదయం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కారు. తమకు న్యాయం జరిగితేనే కిందికి దిగుతామంటూ అక్కడే కూర్చున్నారు. -
కుటుంబ కలహాలతో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
చిన్నశంకరంపేట: కుటుంబ కలహాలతో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి యాదయ్య(50) రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వికారాబాద్‌లో మేస్త్రీ దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అత్వేల్లి గ్రామానికి చెందిన మేస్త్రీ యాదయ్య(35)ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న అనంతరామ్ బ్రాందీ షాపులో ఆదివారం రాత్రి మద్యం సేవించినపుడు గొడవ జరిగి దుండగులు రాళ్లతో కొట్టి హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాళ్లు చేతులు కట్టి..మెడకు తాడు బిగించి..
లారీ డ్రైవర్ దారుణ హత్య ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి జిల్లా) గుర్తు తెలియని దుండగుల చేతుల్లో లారి డ్రైవర్ దారుణహత్యకు గురైయ్యాడు. హత్యకుగురైన వ్యక్తి వ్యవసాయక్షేత్రం వద్దనే కాళ్ళుచేతులు కట్టివేసి మెడకు తాడు బిగించి, చెట్టుకు ఊరివేసినట్లుగా మృతదేహన్ని వదలివెళ్లారు. గ్రామ సమీపంలోనే ఈ బావి వుండటంతో ఆదివారం ఉదయం వ్యవసాయక్షేత్రలకు వెళుతున్న రైతులు చూసి సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోచారం గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ జగదీశ్వర్ కథనం ప్రకారం వివరాలు.... పోచారం గ్రామానికి చెందిన కాసుల యాదయ్య(50) లారి డ్రైవర్‌గా పనిచేస్తుంటాడని తెలిపారు. శనివారం ఇంట్లో నుంచి యాదయ్య వెళ్లాడు. అతను ఎక్కడికి వెళ్లిందో తెలియదని అయితే యాదయ్య కాళ్ళు చేతులు తాళ్లతో కట్టిపడవేసి, మెడకు తాడుతో గట్టిగా భిగించి హత్యచేసి,అతని వ్యవసాయబావి వద్దనే గల సర్కార్ ముళ్ల చెట్టుకు తాడుతోకట్టి మృతదేహన్ని వదలివెళ్లినట్లు తెలిపారు. మృతుని గొంతును బ్లేడ్‌తో కోసిన గాయాలున్నాట్లు తెలిపారు. సంఘటన స్థలంలో ఒక చెప్పు, క్రిమిసంహారక మందు బాటిల్, గ్లాసు లభించగా మరో చెప్పు గ్రామంలో దొరికినట్లు చెప్పారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లను రప్పించారు. జగిలాలు మృతదేహం చుట్టు తిరిగి ఉప్పరిగూడ రోడ్డువైపు వెళ్లి తిరిగి వచ్చి అక్కడనే ఆగాయి. ఈ హత్యకు ఆక్రమ సంబంధమా లేక ఇంకేమైన కారణాల అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నాట్లు తెలిపారు. మృతునికి భార్య భాగ్యమ్మతోపాటు ముగ్గురు కుమారులున్నారు. అనుమానితులను విచారిస్తున్నాట్లు తెలిసింది. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా అస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు జరుపుతున్నాట్లు సీఐ చెప్పారు. -
కోడల్ని వేధిస్తున్నాడని కొట్టి చంపారు..
కోడలిని వేధిస్తున్న మామపై బాధితురాలి కుటుంబ సభ్యులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జిన్నారం మండలం బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గండిగూడెం గ్రామంలో జరిగింది. బొల్లారం ఎస్ఐ ప్రశాంత్ కథనం ప్రకారం.. గండిగూడెం గ్రామానికి చెందిన రాజంగారి యాదయ్య (65) కుమారుడు ఏడాది క్రితం ప్రమాదవశాత్తు చనిపోయాడు. దీంతో యాదయ్య, అతని భార్య పోచమ్మ, కోడలు అరుణ ఒకే ఇంట్లో ఉంటున్నారు. కొన్ని రోజులుగా కోడలు అరుణ పట్ల యాదయ్య అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె అభ్యంతరం చెప్పినా అతడు మానలేదు. విసుగుచెందిన అరుణ తన పుట్టింటి వారికి ఈ విషయాన్ని చెప్పింది. ఆదివారం రాత్రి యాదయ్యను అరుణ కుటుంబీకులు తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయాలపాలైన యాదయ్య అక్కడికక్కడే చనిపోయాడు. పోచమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య
ధరూరు: రంగారెడ్డి జిల్లా ధరూరు మండలం కారెల్లి గ్రామంలో అప్పుల బాధకు తాళలేక యాదయ్య(28) అనే రైతు శనివారం వేకువజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న రెండెకరాల పొలంలో రూ. 2 లక్షలు అప్పుచేసి పంట పెట్టగా వర్షాభావంతో పంటలు ఎండిపోవడంతో అప్పు తీర్చే మార్గంలేక కలత చెంది పురుగుల మందు తాగాడని కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య
చందంపేట: నల్గొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగుమ్ము గ్రామంలో ఓ పత్తిరైతు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన యాదయ్య(40) అనే రైతు తనకున్న 3 ఎకరాల పొలంలో పత్తి పంట వేశాడు. వర్షాభావంతో పంట ఎండిపోవడంతో అప్పుల బాధ ఎక్కువైంది. దీంతో మనస్థాపం చెందిన యాదయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు -
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
-
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కోటి ఆశలున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఒక పద్ధతి ప్రకారం ఆ కలలను నెరవేర్చుకుందామని చెప్పారు. ఆదివారం చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్య కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. చేవెళ్ల ఎమ్మెల్యే కోరిన కోర్కెలన్నీ త్వరలో నెరవేరుస్తానని అన్నారు. 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేస్తామని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ప్రజలందరూ అండగా నిలవాలని కేసీఆర్ కోరారు. 3 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడద కరెంట్ పోకుండా చూస్తానని అన్నారు. ప్రతి ఇంటికి తాగునీటి నల్లా అందిస్తామని, దళిత రైతులకు దళితులకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతర కులాలకు 80 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేవిధంగా కృషిచేస్తామని కేసీఆర్ అన్నారు. -
రెడ్యా, యాదయ్య, కవితలకు షోకాజ్ నోటీస్
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కవితలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని టీపీసీసీ కోరింది. గతంలో జారీ చేసిన షోకాజ్ నోటీసుపై మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు ఇచ్చిన వివరణపై టీపీసీసీ సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై శుక్రవారం గాంధీ భవన్ లో టీపీసీసీ సమావేశం కానుంది. -
కేసీఆర్‌ను కలిసిన చేవెళ్ళ ఎమ్మెల్యే
-
కాలక్షేపానికి వస్తున్నారా?
షాబాద్: పేదలకు వైద్యం చేయకుండా టైంపాస్ చేస్తున్నారా.. ఏమడిగినా సమాధానం చెప్పడం లేదు.. ఇంతకూ మీరు డాక్టర్లేనా .. మీ పనితీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానంటూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పీహెచ్సీ వైద్యురాలు కరీమున్నిసా బేగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన షాబాద్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణ అంతా అపరిశుభ్రంగా ఉండడం, దుర్వాసన వెదజల్లుతుండడంతో ఎమ్మెల్యే మండిపడ్డారు. మీ ఇల్లయితే ఇలాగే ఉంచుకుంటారా.. ఆస్పత్రిని శుభ్రం చేయించడం తె లియదా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో స్టాఫ్ సక్రమంగా లేరని.. తాను ఒక్కదాన్నే ఏం చేయాలని వైద్యురాలు కరీమున్నిసా బేగం సమాధానమిచ్చారు. దీంతో ఆయన మీపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వైద్యులు సమయపాలన పాటించడం లేదని రోగులు ఆయనకు మొరపెట్టుకున్నారు. వారానికి నాలుగు రోజులు మాత్రమే వస్తారని, 11 గంటలకు వచ్చి ఒంటిగంటకే వెళ్లిపోతారని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ఆస్పత్రిలో సిబ్బందిని నియమించేలా చూస్తానని తెలిపారు. గ్రామాల్లో సబ్‌సెంటర్లు సక్రమంగా నడుస్తున్నాయా అని సూపర్వైజర్ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి మెయింటెనెన్స్ డబ్బులను ఏం చేశారని ప్రశ్నించారు. ఎవరైనా ప్రమాదంలో చనిపోతే పోస్టుమార్టం కోసం చేవెళ్ల ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉందని, షాబాద్‌లోనే పోస్టుమార్టం చేసేలా చూడాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. ఏడేళ్ల క్రితం లక్షలాది రూపాయాలతో నిర్మించిన ఆస్పత్రి భవనం ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే భవనం అసంపూర్తిగా పడి ఉందన్నారు. రాత్రిపూట రోడ్డు ప్రమాదాలు జరిగితే ఆస్పత్రికి వస్తే ఒక్కరు కూడా ఉండడంలేదని, 24గంటలు ఆస్పత్రిలో వైద్యసిబ్బంది ఉండేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. ఆయన వెంట బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్, వైస్ ఎంపీపీ శివకుమార్, నాయకులు జంగయ్య, సత్యనారాయణ తది తరులున్నారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
పరిగి: ఓ వ్యక్తి మద్యం తాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బెల్టు షాపు నిర్వాహకులు మద్యంలో ఏదో కలిపి ఉంటారని మృతుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని చిట్యాల్‌లో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి యాదయ్య(39)వ్యవసాయ కూలీ. ఇటీవల మద్యానికి బానిసైన ఆయన కూలీడబ్బులు మొత్తం తాగుడుకే వెచ్చించేవాడు. ఈక్రమంలో బుధవారం గ్రామంలోని ఓ బెల్టు షాపులో మద్యం తాగిన ఆయన సాయంత్రం అదే దుకాణం వెనకాల అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు. బెల్టు దుకాణం నిర్వాహకుల సమాచారంతో యాదయ్య కుటుంబీకులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అప్పటికే యాదయ్య మృతిచెందాడు. గురువారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడికి భార్య మంగమ్మ, కుమారుడు రామకృష్ణ(10), కూతురు కీర్తన(8) ఉన్నారు. కాగా బెల్టుషాపు నిర్వాహకులు మద్యంలో ఏదో కలిపి ఉంటారని, అందుకే తన భర్త మృతిచెందాడని యాదయ్య భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ షేక్ శంషొద్దీన్ తెలిపారు. పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి గురువారం మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నస్కల్ అశోక్ ఉన్నారు. మరో ఘటనలో యువకుడు.. కీసర: మండల పరిధిలోని నాగారం గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన రామకృష్ణ(23)తన తండ్రి కేశవులతో కలిసి గత రెండు నెలల వరకు నాగారంలోని అరవింద్‌నగర్ కాలనీలో అద్దెకు ఉండేవాడు. అనంతరం తండ్రీకొడుకులు స్వగ్రామానికి వెళ్లారు. రామకృష్ణ ఇంట్లో చెప్పకుండా రెండు రోజుల క్రితం తిరిగి నాగారం వచ్చాడు. రామకృష్ణ నివాసముండే ఇంటికి సమీపంలో గురువారం అతడు అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణకిషోర్ తెలిపారు. -
మూఢవిశ్వాసంతోనే హత్య
మొయినాబాద్, న్యూస్‌లైన్: మూఢ విశ్వాసమే వృద్ధుడి హత్యకు దారితీసింది. వృద్ధుడు బాలయ్య తన కుటుంబానికి బాణామతి చేసి భార్య, తల్లి మృతికి కారణమయ్యాడని అనుమానించి ఆయనను చంపేసినట్లు నిందితుడు యాదయ్య అంగీకరించాడని సీఐ రవిచంద్ర తెలి పారు. మండల పరిధిలోని బాకారంలో ఈనెల 15న జరిగిన బాలయ్య హత్య మిస్టరీని పోలీసులు ఛేదించి శనివారం నిందితుడిని రిమాండుకు తరలించారు. సీఐ రవిచంద్ర విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. నిందితుడు ఎలా చిక్కాడు..? బాకారం గ్రామానికి చెందిన మాల బాలయ్య(70)ను అదే గ్రామానికి చెందిన కాశ యాదయ్య(42) ఈనెల 15న సాయంత్రం దారుణంగా కొట్టిచంపాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యాదయ్య శంషాబాద్ పరిసర ప్రాంతాలకు పారిపోయాడనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు నిఘా వేశారు. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం యాదయ్య శంషాబాద్ బస్టాండు సమీపంలో తిరుగుతుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి మొయినాబాద్ ఠాణాకు తరలించి విచారించారు. ఎందుకు చంపేశాడు..? బాలయ్య బాణామతి చేస్తాడని గ్రామస్తులు విశ్వసించేవారు. యాదయ్య 11 ఏళ్ల వయసులో ఉన్నపుడు వారి పూరి గుడిసె తగులబడిపోయింది. దానికి బాలయ్యే కారణమని యాదయ్య బలం గా విశ్వసించాడు. పదిహేడేళ్ల క్రితం యాదయ్య చేవెళ్ల మండలం మల్కాపూర్‌కు చెందిన అరుణను వివాహం చేసుకున్నాడు. రెండేళ్ల తర్వాత ఆమె గర్భవతిగా ఉండగా మృతిచెందింది. బాలయ్య బాణామతి చేయడంతోనే తన భార్య మృతిచెందిందని యాదయ్య నమ్మి పగ పెంచుకున్నాడు. అనంతరం ఆయన మంజులను రెండో వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఏడాది క్రితం యాదయ్య తల్లి ముత్తమ్మ మరణించింది. ఆమెను సైతం బాలయ్యే బలిగొన్నాడని విశ్వసించాడు. తన కుటుంబాన్ని బాలయ్య పొట్టనబెట్టుకున్నాడని భావించాడు. ఈక్రమంలో బాలయ్య హత్యకు గురయ్యేకంటే వారం రోజుల ముందు యాదయ్య అతడిపై దాడి చేశాడు. గ్రామస్తులు అడ్డుకుని అతణ్ని పోలీసులకు అప్పగించా రు. యాదయ్యను పోలీసులు నగరంలో ని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు. సంక్రాం తి పండుగ నేపథ్యం లో ఆయనను కుటుంబీకులు ఇటీవల ఇంటికి తీసుకొచ్చారు. ఇదే అదనుగా భావించిన ఆయన ఈనెల 15న సాయంత్రం బాలయ్య మేకలు మేపుతుండగా అతడి దగ్గరకు వెళ్లాడు. ‘నా కుటుంబాన్ని ఎందుకు నాశనం చేశావ’ని గొడవపడ్డాడు. యాదయ్య తన చేతిలో ఉన్న కర్రతో వృద్ధుడి తలపై బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కటాకటాల్లోకి యాదయ్య.. యాదయ్యను శనివారం మొయినాబాద్ పోలీసులు రిమాండుకు తరలిం చారు. మూడు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్న ఎస్సై సైదులు, కానిస్టేబుళ్లు రమేష్, కృష్ణ, చంద్రయ్య, రాజమల్లేష్, పండరి, నర్సింలును ఈ సందర్భంగా సీఐ రవిచంద్ర అభినందించారు. సమావేశంలో ఏఎస్సై అంతిరెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
నలుగురు ఉపాధ్యాయుుులపై క్రిమినల్ కేసులు
బెజ్జూర్, న్యూస్‌లైన్ : అక్రమాలకు పాల్పడిన ఉపాధ్యాయులపై పంచ్ పడింది. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పాఠశాల నిధులు స్వాహా’ కథనంపై ఆర్వీఎం పీవో యాదయ్య స్పందించారు. బెజ్జూర్ మండలంలోని పర్దాన్‌గూడ, బారెగూడ, తొర్రంగూడ, అందుగూలగూడ గిరిజన పాఠశాలలకు చెందిన నలుగురు ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఎంఈవో సోమయ్యకు శనివారం ఆదేశాలు అందాయి. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రొసిడింగ్ నంబర్ ఎ2/2616/2/201314 ఆర్డర్‌ను ఎంఈవోకు పంపించారు. దీంతో బారెగూడ ఉపాధ్యాయుడు తుకారాం, పర్దాన్‌గూడ ఉపాధ్యాయుడు లక్ష్మణ్, తొర్రంగూడ ఉపాధ్యాయుడు ధర్మయ్య, అందులగూడ ఉపాధ్యాయుడు గోపాల్ నుంచి డబ్బులు రికవరీ చేయడమే కాకుండా వేతనాలు నిలిపివేయాలని అందులో ఆదేశాలు జారీ చేశారు. నలుగు రు ఉపాధ్యాయులపై రెండ్రోజుల్లో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామ ని ఎంఈవో సోమయ్య తెలిపారు. తొర్రంగూడ పాఠశాల ఉపాధ్యాయు ని నుంచి రూ.7 లక్షల 73 వేలు, అందులగూడ నుంచి రూ.3 లక్షల 36 వేలు, పర్దాన్‌గూడ నుంచి రూ.2 లక్షల 38 వేల 750, బారెగూడ ఉపాధ్యాయుని నుంచి రూ.2 లక్షల 86 వేల 500 రికవరీ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు చెప్పారు. కాగా.. పర్దాన్‌గూడ పాఠశాల ఉపాధ్యాయు డు లక్ష్మణ్ ఇప్పటికే రూ.2.38 లక్షల డీడీ అందించినట్లు సమాచారం. -
నాలుగేళ్ల కూతురిపై తండ్రి లైంగిక దాడి
మునుగోడు : కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ తండ్రి కన్న కూతురుపైనే లైంగికదాడికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం తన కుమార్తెను ఎవరో అపహరించుకు వెళ్లారంటూ నాటకం ఆడాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించటంతో అసలు విషయం బయటపడింది. మునుగోడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందినకొండ యాదయ్య బతుకుదెరువు కోసం 20 రోజుల క్రితం మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి వచ్చి బొంతలు కుట్టుకుంటూ అక్కడే బస్‌షెల్టర్‌లో జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున తన నాలుగు సంవత్సరాల పెద్ద కుమార్తెను గ్రామానికి రెండు కి.మీ దూరంలోని వ్యవసాయ భూమి వద్దకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు తిరిగి బస్‌షెల్టర్‌కు వచ్చి తన కూతురును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుక పోయారని గ్రామస్తులు, పోలీసులను నమ్మించాడు. తప్పిపోయిన తన కుమార్తెను వెతికి అప్పగించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ గ్రామంలోని చుట్టుపక్కల ప్రాంతాలలో వెతకగా మంగళవారం ఒంటిగంటకు పత్తి చేలో బాలిక కనిపించింది. ఆ బాలికకు తీవ్ర గాయాలు, రక్తస్రావం కావడంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. అమ్మాయిపై లైంగిక దాడి జరిగినట్టు వైద్యులు తెలపడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బాలిక తండ్రే లైంగికదాడి చేసినట్లు అనుమానించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తానే లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ కొండల్‌రెడ్డి తెలిపారు. -
అనుమానం పెనుభూతమై..
మర్రిగూడ, న్యూస్‌లైన్: అనుమానం పెనుభూతమైంది .. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని దారుణంగా హతమార్చాడు. ఈఘటన మర్రిగూడ మండలం అంతంపేట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కట్టెల యాదయ్య (38) ఉదయం తన మోటార్‌సైకిల్‌పై బీసీ కాలనీకి వెళ్లాడు. కాలనీకి చెందిన గుర్రాల సోమమ్మ ఇంటిముందు బైక్‌ను ఆపి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన గొడ్డటి రాములు గొడ్డలితో వెనుకనుంచి యాదయ్యపై దాడి చేశాడు. ఒక్కసారిగా ఎంజరుగుతుందో అని తెలుసుకునేలోపే యాదయ్య మెడపై గొడ్డలితో వేటు వేశాడు. దీంతో అతడు కిందపడడం తో పలుమార్లు విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో యాదయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాతే రాము లు అక్కడి నుంచి పరారయ్యాడు. మూడు మాసాల క్రితమే.. మాజీ సర్పంచ్ యాదయ్య, బీసీ కా లనీకి చెందిన రాములు మధ్య ఉన్న తగాదాలు మూడు మాసాల క్రితమే బయటపడినట్టు తెలిసింది. గతంలో యాదయ్య సర్పంచ్‌గా పోటీచేసినప్పుడు రాములు పూర్తి మద్దతు ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాలకు మంచి సఖ్యత ఉంది. దీంతో యాదయ్య తరచు రాములు ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే యాదయ్య తన భార్య తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం రాములుకు కలి గింది. దీంతో అతడు యాదయ్యను ఇకపై బీసీ కాలనీకి రావొద్దని పలుమార్లు హెచ్చరించినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. రాములు మాటలను యాదయ్య పెడచెవిన పెటక బీసీ కాలనీకి వచ్చిపోతున్న నేపథ్యంలోనే పథకం ప్రకారం హత్య చేసినట్టు తెలుస్తోంది. వీధిన పడిన కుటుంబం మాజీ సర్పంచ్ యాదయ్య దారుణ హత్యకు గురవడంతో ఆయన కుటుం బం వీధిన పడింది. ఈయనకు భా ర్య, ఇద్దరు చిన్న వయస్సు కలిగిన కుమారులు ఉన్నారు. యాదయ్య ప్రస్తుతం కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈయన సర్పంచ్ పదవీ కాలం అయిపోయినప్పటి నుంచి పదేళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు నెలల కిత్రం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానంలో పోటీ చేసి ఓడిపోయాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యాద య్య దారుణ హత్యకు గురయ్యాడనే విషయాన్ని తెలుసుకుని దేవరకొండ డీఎస్పీ సోమశేఖర్, నాంపల్లి సీఐ శివరాంరెడ్డి, మర్రిగూడ, గుర్రంపోడ్, చింతపల్లి, నాంపల్లి మండలాల ఎస్ఐలు శంకర్‌రెడ్డి, గౌరినాయుడు, ధనుంజయ్‌గౌడ్, దీపన్నలు ఘటన స్థలానికి వచ్చారు. హత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తీయమని మృతుడి బంధువులు తేల్చిచెప్పారు. నింది తుడు రాములును శిక్షించాలని డిమా ండ్ చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని న్యాయం చేస్తామని డీఎస్పీ హామీమేరకు వారు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గ్రామంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
యాదయ్య కుటుంబానికి విజయమ్మ పరామర్శ
-
శంషాబాద్ చేరుకొన్న యాదయ్య మృతదేహం