కుటుంబ కలహాలతో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
Published Wed, Oct 19 2016 4:31 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
చిన్నశంకరంపేట: కుటుంబ కలహాలతో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి యాదయ్య(50) రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement