
లక్నో : కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో ఓ వ్యక్తి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్ని రోజులుగా క్వారంటైన్‌లోనే ఉన్న ఆయనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ అని తేలింది. దీంతో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్‌లోని తుండ్లా నివాసి అయిన రైల్వే ఉగ్యోగి (55) ఎఫ్‌హెచ్ మెడికల్ కాలేజీలో క్వారంటైన్‌లో ఉంచారు.
ఇదే కాలనీకి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలడంతో కాలనీ లోని మిగితా ఉద్యోగులను కూడా క్వారంటైన్‌లో ఉంచారు. మంగళవారం నిర్వహించిన పరీక్షలో సదరు ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో మెడికల్ కాలేజీలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బందువులకు అందిస్తామని తుండ్లా ఎస్సై కెపి సింగ్ టోమర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment