అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య
Published Wed, Jan 13 2016 9:35 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
చందంపేట: నల్గొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగుమ్ము గ్రామంలో ఓ పత్తిరైతు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన యాదయ్య(40) అనే రైతు తనకున్న 3 ఎకరాల పొలంలో పత్తి పంట వేశాడు. వర్షాభావంతో పంట ఎండిపోవడంతో అప్పుల బాధ ఎక్కువైంది. దీంతో మనస్థాపం చెందిన యాదయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు
Advertisement
Advertisement