పత్తి రైతు ఆత్మహత్య
Published Sat, Jan 2 2016 10:34 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
చందుర్తి: అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పత్తి పంట దిగుబడినివ్వక పోవడంతో.. తెచ్చిన అప్పులు తీర్చే దారి కానరాక పత్తి రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్యాల దేవయ్య(55) పత్తి పంట సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెరిగిపోయిన అప్పులు తీర్చే దారి కనపడక పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement