జయశంకర్‌జిల్లా: అప్పుల బాధ తాళలేక ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని గిద్దెముత్తారం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పంచిక శంకర్(30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పంట దిగుబడి సరిగ్గా రాకపోవడం.. చేసిన అప్పులు తీర్చే దారికానరాక తన పత్తి చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.