రంగారెడ్డి జిల్లా ధరూరు మండలం కారెల్లి గ్రామంలో అప్పుల బాధకు తాళలేక యాదయ్య(28) అనే రైతు శనివారం వేకువజామున పురుగుల మందు తాగి
అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య
Published Sat, Mar 12 2016 12:11 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
ధరూరు: రంగారెడ్డి జిల్లా ధరూరు మండలం కారెల్లి గ్రామంలో అప్పుల బాధకు తాళలేక యాదయ్య(28) అనే రైతు శనివారం వేకువజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న రెండెకరాల పొలంలో రూ. 2 లక్షలు అప్పుచేసి పంట పెట్టగా వర్షాభావంతో పంటలు ఎండిపోవడంతో అప్పు తీర్చే మార్గంలేక కలత చెంది పురుగుల మందు తాగాడని కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Advertisement
Advertisement