యువరైతు ఆత్మహత్య
Published Mon, Sep 18 2017 1:35 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
వరంగల్ అర్బన్: అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలంలోని మొలకలగూడెం గ్రామానికి చెందిన యువరైతు గుండెకరి మల్లజి(32) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్నేళ్లు పంట దిగుబడి లేకపోవడంతో తెచ్చిన అప్పులు పెరిగిపోయి వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement