అనుమానం పెనుభూతమై.. | EX-sarpanch murdered in marriguda | Sakshi
Sakshi News home page

అనుమానం పెనుభూతమై..

Published Thu, Oct 31 2013 1:52 AM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM

EX-sarpanch murdered in marriguda

మర్రిగూడ, న్యూస్‌లైన్:  అనుమానం పెనుభూతమైంది .. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో  ఓ వ్యక్తి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని దారుణంగా హతమార్చాడు. ఈఘటన మర్రిగూడ మండలం అంతంపేట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కట్టెల యాదయ్య (38) ఉదయం తన మోటార్‌సైకిల్‌పై బీసీ కాలనీకి వెళ్లాడు. కాలనీకి చెందిన గుర్రాల సోమమ్మ ఇంటిముందు బైక్‌ను ఆపి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన గొడ్డటి రాములు గొడ్డలితో వెనుకనుంచి యాదయ్యపై దాడి చేశాడు. ఒక్కసారిగా ఎంజరుగుతుందో అని తెలుసుకునేలోపే యాదయ్య మెడపై గొడ్డలితో వేటు వేశాడు. దీంతో అతడు కిందపడడం తో పలుమార్లు విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో యాదయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాతే రాము లు అక్కడి నుంచి పరారయ్యాడు.
 మూడు మాసాల క్రితమే..
 మాజీ సర్పంచ్ యాదయ్య, బీసీ కా లనీకి చెందిన రాములు మధ్య ఉన్న తగాదాలు మూడు మాసాల క్రితమే బయటపడినట్టు తెలిసింది. గతంలో యాదయ్య సర్పంచ్‌గా పోటీచేసినప్పుడు రాములు పూర్తి మద్దతు ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాలకు మంచి సఖ్యత ఉంది. దీంతో యాదయ్య తరచు రాములు ఇంటికి  వచ్చిపోతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే యాదయ్య తన భార్య తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం రాములుకు కలి గింది. దీంతో అతడు యాదయ్యను ఇకపై బీసీ కాలనీకి రావొద్దని పలుమార్లు హెచ్చరించినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. రాములు మాటలను యాదయ్య పెడచెవిన పెటక బీసీ కాలనీకి వచ్చిపోతున్న నేపథ్యంలోనే పథకం ప్రకారం హత్య చేసినట్టు తెలుస్తోంది.
 వీధిన పడిన  కుటుంబం
 మాజీ సర్పంచ్ యాదయ్య దారుణ హత్యకు గురవడంతో ఆయన కుటుం బం వీధిన పడింది. ఈయనకు భా ర్య, ఇద్దరు చిన్న వయస్సు కలిగిన కుమారులు ఉన్నారు. యాదయ్య ప్రస్తుతం కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈయన సర్పంచ్ పదవీ కాలం అయిపోయినప్పటి నుంచి పదేళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు నెలల కిత్రం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానంలో పోటీ చేసి ఓడిపోయాడు.
 ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
 కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యాద య్య దారుణ హత్యకు గురయ్యాడనే విషయాన్ని తెలుసుకుని దేవరకొండ డీఎస్పీ సోమశేఖర్, నాంపల్లి సీఐ శివరాంరెడ్డి, మర్రిగూడ, గుర్రంపోడ్, చింతపల్లి, నాంపల్లి మండలాల ఎస్‌ఐలు శంకర్‌రెడ్డి, గౌరినాయుడు, ధనుంజయ్‌గౌడ్, దీపన్నలు ఘటన స్థలానికి వచ్చారు. హత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తీయమని మృతుడి బంధువులు తేల్చిచెప్పారు. నింది తుడు రాములును శిక్షించాలని డిమా ండ్ చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని న్యాయం చేస్తామని డీఎస్పీ హామీమేరకు వారు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా  పోలీసులు  గ్రామంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement