Marriguda
-
Munugode Bypoll Results: సీఎం కేసీఆర్ సారు గ్రామంలో కారు జోరు
మర్రిగూడ/చండూరు: మునుగోడు ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ ఇన్చార్జిగా వ్యవహరించిన మర్రిగూడ మండలం లెంకలపల్లి ఎంపీటీసీ పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థికి 711 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇక్కడ సహ ఇన్చార్జిగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి వ్యవహరించారు. ఈ ఎంపీటీసీ పరిధిలో లెంకలపల్లి, సరంపేట గ్రామాల్లోని మూడు బూత్‌లలో 4,009 మంది ఓటర్లు ఉండగా 2,793 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్కు 1,610, బీజేపీకీ 899, కాంగ్రెస్‌కు 95, బీఎస్పీకి 34, మిగతావి ఇతరులకు పోలయ్యాయి. కేటీఆర్ ఇన్చార్జిగా ఉన్న గట్టుప్పల్‌లో 47 ఓట్ల ఆధిక్యం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గట్టుప్పల్ ఎంపీటీసీ–1కు ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆయన పరిధిలో 3,360 మంది ఓటర్లు ఉండగా 3097 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్కు 1359 ఓట్లు, బీజేపీకి 1312 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్కు 47 ఓట్ల ఆధిక్యం లభించింది. మంత్రి కేటీఆర్ తరపున పూర్తిగా సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆగయ్య ప్రచార బాధ్యతలు నిర్వహించారు. మర్రిగూడ మండల కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఇక్కడ మూడు బూత్‌లలో 2,785 మంది ఓటర్లు ఉండగా 2,522 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్కు 1,389, బీజేపీకి 792, కాంగ్రెస్‌కు 174, బీఎస్పీకి 37 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ బీజేపీపై టీఆర్ఎస్కు 597 ఓట్ల ఆధిక్యం లభించింది. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
టీఆర్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యాన్నినవ్వుల పాలు చేస్తున్నాయి: భట్టి
మర్రిగూడ: రాష్ట్రంలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రజాస్వామ్యా న్ని నవ్వుల పాలు చేస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ సంపదను టీఆర్ఎస్, బీజేపీలు సాధ్యమైనంతవరకు దోపిడీ చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని గద్దల్లా చీల్చుకుతింటున్నారని మండిపడ్డారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఆసరాగా చేసుకుని ప్రలోభాలకు గురిచేసి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలను, ఇతర పార్టీల నాయకులను కొనడం టీఆర్ఎస్, బీజేపీలకు కొత్తేమీకాదని చెప్పారు. మునుగోడులో బీజేపీ లేదా టీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రజలకు బతుకుదెరువు కరువవుతుందన్నారు. రెండు దశాబ్దాల కాలం పాటు సేవే లక్ష్యంగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడటం నియోజకవర్గ అభివృద్ధికి శుభసూచకమన్నారు. అనంతరం శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి మాట్లాడుతూ..టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించకపోతే సంక్షేమ పథకాలు, పింఛన్లు బంద్ చేస్తామని టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై హైకోర్టు, సీబీఐతో విచారణ చేయించకుండా నిలిపివేయాలని ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. -
Bandi Sanjay: కథ.. స్క్రీన్ ప్లే.. డైరెక్షన్ కేసీఆరే.. ఓటమి భయంతోనే ఈ స్కెచ్
మర్రిగూడ: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే పేరిట జరిగిన డ్రామా వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేల నెత్తిపై రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా కొనేందుకు ఎవరూ సిద్ధంగా లేరని, వాళ్లను కొనాల్సిన ఖర్మ బీజేపీకి కూడా లేదని సంజయ్ అన్నారు. మునుగోడులో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుస్తుందని తేలిందని, కొడుకు, అల్లుడు సహా అంతా ఇక్కడే తిష్టవేసినా లాభం లేకపోవడంతో కేసీఆర్ ఈ కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. భవిష్యత్తులో పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకోవడానికి కూడా ఈ స్కెచ్ వేశారన్నారు. బుధవారం రాత్రి నల్లగొండ జిల్లా మర్రిగూడ తిరగండ్లపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటమి తప్పదని తెలియడంతో బీజేపీని బదనాం చేసేందుకు రెండు టీవీ ఛానళ్లతో కలిసి కేసీఆర్ ఇలాంటి నీచమైన డ్రామాకు తెరదీశారని అన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఈ వ్యవహారానికి సంబంధించి ఫామ్‌హౌస్‌తో పాటు హోటల్, ప్రగతి భవన్‌లోని గత నాలుగు రోజుల సీసీ కెమెరా ఫుటేజీలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఈ వ్యవహారంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయమై తనతోపాటు బీజేపీ నేతలంతా యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ డ్రామాలో పాత్ర లేదని కేసీఆర్... భార్యాపిల్లలతో కలిసి యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. టైమ్, డేట్ ఫిక్స్ చేస్తే తామంతా అక్కడికి వస్తామన్నారు. డ్రామాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర స్వామిజీలను కేసులో ఇరికిస్తారా? హిందూ ధర్మ మంటే అంత చులకనా అని సంజయ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి చేసిన కుట్ర ఇదని, అక్కడికి స్వామిజీలను పిలిపించుకుని ఈ స్టోరీ ప్లాన్ చేశారని ఆరోపించారు. అదంతా దక్కన్ కిచెన్ హోటల్లో జరిగిందంటున్నారు కదా.. ఆ హోటల్‌కు సంబంధించిన గత 4 రోజుల కెమెరా ఫుటేజీని పూర్తిగా విడుదల చేసే దమ్ముందా? అన్ని ప్రశ్నించారు. అలాగే ప్రగతి భవన్ సీసీ కెమెరా ఫుటేజీలన్నీ విడుదల చేయాలన్నారు. ఈ డ్రామాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉందని, గతంలోనూ ఓ మంత్రి తనపై హత్యాయత్నం చేసినట్లు డ్రామా చేయించడంలో ఈ పోలీస్ ఆఫీసరే అత్యుత్సాహం చూపారన్నారు. ఈ డ్రామాకు తెరదీసిన టీఆర్ఎస్ను రాజకీయ సమాధి చేయడంతో పాటు దీని వెనుక ఉన్న పోలీసుల అంతు చూస్తామని అన్నారు. వారి కాల్‌లిస్ట్ బయట పెట్టండి పట్టుపడిన స్వామీజీ ఇటీవల పరిగి సమీపంలో పూజలు చేశారని, అక్కడ ఎవరెవరిని కలిశారో బయట పెట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. వాళ్ల ఫామ్‌హౌస్‌కు వాళ్లే వెళ్లడం, వాళ్లే పోలీసులకు ఫోన్ చేయడం, తమను కాపాడాలనడం, 3 గంటలు అక్కడే ఎదురు చూడటం.. ఇదంతా చూస్తుంటే నవ్వొస్తోందన్నారు. కేసీఆర్ చేతిలోనే అధికారం ఉన్నందున దమ్ముంటే ఎమ్మెల్యేలు, స్వామిజీల కాల్ లిస్ట్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రూ. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా బయట పెట్టాలన్నారు. గతంలో బెంగళూరులో బేరసారాలు జరిగినట్లు వార్తలొచ్చాయని, అవన్నీ బయటపెట్టాల్సిందేనన్నారు. ఫామ్‌హౌస్ నుంచి ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌కు ఎలా వెళ్తారని, వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తే నిజాలు తెలుస్తాయని సంజయ్ పేర్కొన్నారు. ఆధారాల్లేకుండా పోలీసులు ఇలాంటి డ్రామాలు చేస్తే ప్రజలు, కార్యకర్తలు ఉరికించి ఉరికించి కొడతారని అన్నారు. -
Munugode Bypoll: చుట్టూ మనవాళ్లే.. జేబులోని నోట్ల కట్ట ఎలా మాయం?
సాక్షి, నల్లగొండ(మర్రిగూడ): మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో దుండగులు చేతివాటం ప్రదర్శించి జేబులు కత్తిరించేస్తున్నారు. ఏకంగా ఒక ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి జేబులోంచి నోట్ల కట్ట కొట్టేశారు. మర్రిగూడ మండలం నామాపురం, కొట్టాల గ్రామంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి సోమవారం కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారం ముగిసిన తర్వాత తన జేబు చూసుకుంటే అందులోని రూ.50 వేల నోట్ల కట్ట కనిపించలేదు. చుట్టూ మనవాళ్లే ఉన్నారు.. జేబులోని నోట్ల కట్ట ఎలా మాయమైందంటూ ఆ అభ్యర్థి నోరెళ్లబెట్టాడు. అనంతరం ఆయన వెంట ఉన్న నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ వాగ్వా దానికి దిగారు. దీంతో మరో నాయకుడు కలుగజేసుకుని పోయిన డబ్బులు ఎలాగూ పోయాయి.. మనమెందుకు తగువులాడుకో వడం.. అంటూ వివాదాన్ని చల్లార్చారు. -
నల్గొండలో చిరుత కలకలం..
సాక్షి, నల్గొండ: జిల్లాలోని మర్రిగూడ మండలం అజలాపురం గ్రామ శివారులో చిరుత కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన చిరుత అడవిపందుల కోసం వేసిన ఉచ్చులో చిక్కుకుంది. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. మత్తు మందు ప్రయోగించి చిరుతను బంధించారు. అనంతరం జూ కి తరలించారు. చిరుత ప్రత్యక్షంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో చిరుత కదలికలపై సమాచారమిచ్చినా అటవీ శాఖ అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు. -
మర్రిగూడలో దారుణం
మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో మంగళవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. భార్యపాలిట భర్తే యముడయ్యాడు. నిద్రపోతున్న భార్య భూతం నర్సమ్మ(40)ను భర్త భూతం యాదయ్య(46) గొడ్డలితో నరికి చంపాడు. భార్యపై అనుమానం పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఘటన అనంతరం భర్త పరారయ్యాడు. వీరికి ఇద్దరు సంతానం. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియాంక హత్య కేసు.. ఊహించని మలుపు
సాక్షి, నల్లగొండ : పద్నాలుగేళ్ల క్రితం జరిగిన మర్రిగుడ మహిళ హత్యకేసు చివరికి ఊహించని మలుపు తిరిగింది. ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి పారిపోయిన తన అక్క కోసం ఓ తమ్ముడు చేసిన ప్రయత్నం చివరికి ఫలించింది. మర్రిగుడకి చెందిన హనుమంతు అనే వ్యక్తి నార్కట్‌పల్లికి చెందిన ప్రియాంకను 2004లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు వివాహం చేసుకున్నట్లు ప్రియాంక ఇంట్లోవారికి తెలియదు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కుటుంబంలో కలహాలు రావడంతో హనుమంతు భార్యా, పిల్లలను హత్య చేసి, మరో మహిళతో వివాహ సంబంధం పెట్టుకున్నట్లు గతంలో వెల్లడైంది. గత నాలుగేళ్లుగా తన అక్క కోసం గాలిస్తున్న ప్రియాంక సోదరుడు ఉపేందర్‌కి ఎట్టకేలకు హనుమంతు అచూకి లభించింది. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు. శుక్రవారం పోలీసుల విచారణలో భార్య, పిల్లల్ని హత్య చేశానని తెలిపాడు. అతని వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు కేసును మరింత లోతుగా విచారించారు. తాజా విచారణలో పిల్లలు క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. బాబు రాంచరణ్‌ను బంధువుల వద్ద ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి హాలియాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నట్లు గుర్తించారు. -
విషాద గాథ.. పాపం ప్రియాంక
సాక్షి, నల్గొండ : చిన్నప్పుడు తన వేలుపట్టి నడిపించిన అక్క.. అమ్మలా లాలించిన అక్క.. అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయింది. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడు ఊహతెలియని ఆ తమ్ముడు.. కాస్త పెద్దయ్యాక అక్క కోసం వెదకడం ప్రారంభించాడు. చివరకు అక్క ఆచూకీ అయితే తెలిసింది కాని.. తట్టుకోలేని వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఏంటా నిజం..? నల్గొండ జిల్లాకు చెందిన లింగమ్మ అలియాస్ ప్రియాంక 12 ఏళ్ల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె సవతి తమ్ముడు ఉపేంద్ర. అక్క ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడు చిన్నవాడు. ఏం జరిగిందో, అక్క ఎక్కడికి వెళ్లిందో తెలియని వయసు. కాని పెద్దయ్యాక అక్క కోసం తెలుసుకోవాలనుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిదేళ్లు ఆమె కోసం వెదికాడు. తెలిసినవాళ్లని, తెలియనివాళ్లని ఆరా తీశాడు. చివరికి ఫేస్బుక్లో బావ హనుమంతు ఫోటో చూసి అతని వివరాలు తెలుసుకున్నాడు. హనుమంతు సొంతూరు మర్రిగూడెం దగ్గర వెంకటపల్లికి వెళ్లాడు. కాని అక్కడికి వెళ్లగానే అతని ఆనందం ఆవిరైపోయింది. కట్టుకున్నోడే కాలయముడై తన అక్కను కిరాతకంగా చంపేశాడని తెలిసి ఆ తమ్ముడి గుండె బద్దలైంది. ప్రాణం తీసిన అనుమానం హైదరాబాద్ ఎల్బీనగర్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న హనుమంతుతో అప్పట్లో ప్రియాంకకు పరిచయం అయ్యింది. ఇంట్లో చెప్పకుండా అతడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రెండేళ్లు ఎల్బీనగర్లో ఉన్నారు. తర్వాత మర్రిగూడెంకు వచ్చేశారు. అప్పుడే ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. భార్యపై అనుమానంతో ఆమెను దారుణంగా హింసించేవాడు. తనకు పుట్టలేదన్న అనుమానంతో 11 రోజుల పసిపాపను చంపేశాడు. ప్రశ్నించిన భార్యకు కూడా హత్య చేసి బావిలో పడేశాడు హనుమంతు. మగపిల్లాడిని తన దగ్గరే పెట్టుకుని కుటుంబంతో సంబంధాలు లేకపోవడంతో ప్రియాంక కనిపించకుండా చనిపోయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఉపేంద్ర రావడంతో నిజాలన్నీ బయటకొచ్చాయి. పోలీసుల దర్యాప్తు ఉపేంద్ర ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు హనుమంతును అరెస్ట్ చేసి విచారించారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా వెంకటపల్లి గ్రామ శివారులోని రామిరెడ్డి బావిలో యువతి దుస్తులను గుర్తించారు. ప్రియాంక ఎముకలను బావి నుండి బయటికి తీశారు. నిర్ధారణ కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కోసం పంపారు. పదేళ్ల క్రితమే హత్య జరిగివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యానంతరం ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన హనుమంతు హతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు. భార్యకు మరొకరితో అక్రమసంబంధం ఉందన్న అనుమానంతోనే హత్య చేసినట్టు నిందితుడు చెప్పాడని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. -
ఉపాధ్యాయలు గైర్హాజరు కావద్దు
మర్రిగూడ : కస్తూరిబా పాఠశాలలో పని చేస్తున్న ఎస్‌ఓతోపాటు ఉపాధ్యాయులంతా తరచు గైర్హాజరు కావద్దని ఆర్వీఎం జిల్లా జీసీడీఓ ఎం.సుశీల అన్నారు. శనివారం మర్రిగూడ కస్తూరాబా పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చడించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంనతం పలు రికార్డులను పరిశీలించి మాట్లాడారు. పాఠశాల ఎస్ఓ పనితీరు బాగాలేక పోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు మంచి బోధన అందించాలన్నారు. ఆమెవెంట ఎంఈఓ ఎం.సుధాకర్ ఎస్ఓ వాసవి, తదితరులు ఉన్నారు. -
పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి
మర్రిగూడ : కస్తూర్భా పాఠశాలలో మౌలిక వసతులు కలిపించకపోవడంతో పాఠశాల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ఎంపీపీ అనంతరాజుగౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల నుంచి∙పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేక విద్యార్థినులు ఆరుబయటికి పోతున్నారన్నారు. పాలు ప్యాకెట్లు కూడా నాసిరకంగా ఉన్నాయన్నారు. మెను ప్రకారం భోజనం అందక విద్యార్థునులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల నిర్వాహణను మెరుగు పర్చాలని కోరారు. ఆయనlవెంట ఎంఈఓ ఎం.సుధాకర్ ఉన్నారు. -
మూడు గంటలకే బడి బంద్
రాంరెడ్డిపల్లి (మర్రిగూడ) : మండలంలోని రాంరెడ్డిపల్లి ప్రాథమికొన్నత పాఠశాల ఉపాధ్యాయలు సమయ పాలన పాటించడం లేదు. 1 నుంచి 7 వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయలు ఉన్నారు. ప్రతి రోజు సాయంత్రం 4.15 గంటలకు పాఠశాలను మూసి వేయాల్సి ఉండగా సోమవారం మాత్రం 3 గంటలకే పాఠశాలకు తాళం చేశారు. ఈ పాఠశాల ఉపాధ్యాయలు సమయ పాలన పాటించడం లేదని స్థానికులు ఆరోపించారు. దీనిపై ఎంఈఓ ఎం.సు«ధాకర్‌ను వివరణ కోరుగా అనుమతి లేకుండా పోయిన ఉపాధ్యాయులపై చర్య తీసుకుంటామని తెలిపారు. -
నిర్భయకేసు నమోదు
మర్రిగూడ: బాలికపై నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై నిర్భయచట్టం కింద కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వట్టిపల్లికి చెందిన మామిడి జగన్ అదే గ్రామానికి చెందిన బాలికను కళాశాలకు వెళ్లి వస్తున్న క్రమంలో 2014నుంచి వేధించసాగాడు. దీంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి జగన్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ రమణారెడ్డి బుధవారం తెలిపారు. -
డిజిటల్ తరగతులు ప్రారంభం
అంతంపేట: మండలంలోని అంతంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బోధన సరళతరం చేయడానికి ఉపా«ధ్యాయులు బుధవారం డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు. ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వర కు విద్యార్థుల కోసం రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) వారు అవసరమైనా సాంకేతిక పరికరాలను పంపిణీ చేశారు. ఈ తరగతులను సర్పంచ్ రాచమళ్ల నరేందర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆ పాఠశాల హెచ్ఎం సురేష్‌బాబు, రవీందర్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా : ఒకరు మృతి
మర్రిగూడ : నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాభక్షిపల్లి వద్ద ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం సాయంత్రం హైదరాబాద్ వైపు నుంచి ఓ ఆటో వెళ్తుండగా...మరో వాహనం అడ్డు వచ్చేసరికి ఆటో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న రమావత్ ఖేరి (55) అనే మహిళ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. జాను, దాలి, దత్తు అనే వారికి తీవ్ర గాయాలు కావడంతో మర్రిగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని నల్లగొండకు రిఫర్ చేశారు. -
అనుమానం పెనుభూతమై..
మర్రిగూడ, న్యూస్‌లైన్: అనుమానం పెనుభూతమైంది .. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని దారుణంగా హతమార్చాడు. ఈఘటన మర్రిగూడ మండలం అంతంపేట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కట్టెల యాదయ్య (38) ఉదయం తన మోటార్‌సైకిల్‌పై బీసీ కాలనీకి వెళ్లాడు. కాలనీకి చెందిన గుర్రాల సోమమ్మ ఇంటిముందు బైక్‌ను ఆపి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన గొడ్డటి రాములు గొడ్డలితో వెనుకనుంచి యాదయ్యపై దాడి చేశాడు. ఒక్కసారిగా ఎంజరుగుతుందో అని తెలుసుకునేలోపే యాదయ్య మెడపై గొడ్డలితో వేటు వేశాడు. దీంతో అతడు కిందపడడం తో పలుమార్లు విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో యాదయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాతే రాము లు అక్కడి నుంచి పరారయ్యాడు. మూడు మాసాల క్రితమే.. మాజీ సర్పంచ్ యాదయ్య, బీసీ కా లనీకి చెందిన రాములు మధ్య ఉన్న తగాదాలు మూడు మాసాల క్రితమే బయటపడినట్టు తెలిసింది. గతంలో యాదయ్య సర్పంచ్‌గా పోటీచేసినప్పుడు రాములు పూర్తి మద్దతు ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాలకు మంచి సఖ్యత ఉంది. దీంతో యాదయ్య తరచు రాములు ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే యాదయ్య తన భార్య తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం రాములుకు కలి గింది. దీంతో అతడు యాదయ్యను ఇకపై బీసీ కాలనీకి రావొద్దని పలుమార్లు హెచ్చరించినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. రాములు మాటలను యాదయ్య పెడచెవిన పెటక బీసీ కాలనీకి వచ్చిపోతున్న నేపథ్యంలోనే పథకం ప్రకారం హత్య చేసినట్టు తెలుస్తోంది. వీధిన పడిన కుటుంబం మాజీ సర్పంచ్ యాదయ్య దారుణ హత్యకు గురవడంతో ఆయన కుటుం బం వీధిన పడింది. ఈయనకు భా ర్య, ఇద్దరు చిన్న వయస్సు కలిగిన కుమారులు ఉన్నారు. యాదయ్య ప్రస్తుతం కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈయన సర్పంచ్ పదవీ కాలం అయిపోయినప్పటి నుంచి పదేళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు నెలల కిత్రం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానంలో పోటీ చేసి ఓడిపోయాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యాద య్య దారుణ హత్యకు గురయ్యాడనే విషయాన్ని తెలుసుకుని దేవరకొండ డీఎస్పీ సోమశేఖర్, నాంపల్లి సీఐ శివరాంరెడ్డి, మర్రిగూడ, గుర్రంపోడ్, చింతపల్లి, నాంపల్లి మండలాల ఎస్ఐలు శంకర్‌రెడ్డి, గౌరినాయుడు, ధనుంజయ్‌గౌడ్, దీపన్నలు ఘటన స్థలానికి వచ్చారు. హత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తీయమని మృతుడి బంధువులు తేల్చిచెప్పారు. నింది తుడు రాములును శిక్షించాలని డిమా ండ్ చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని న్యాయం చేస్తామని డీఎస్పీ హామీమేరకు వారు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గ్రామంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
గ్రామాలను అభివృద్ధి చేయాలి
మర్రిగూడ, న్యూస్‌లైన్ :‘మన కోసం మనం’ కార్యక్రమం ద్వార గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు. సోమవారం మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన కోసం మనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు ప్రవేశ పేట్టిన మనకోసం మనం కార్యక్రమం ద్వారా సాధించుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధన ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు, గ్రామ సర్పంచ్‌లు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మార్పు తీసుకొచ్చిన ముగ్గురు సర్పంచ్‌లకు నగదు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉండేలా చూసి ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలని కోరారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగ వారికి 856 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారని తెలిపారు. లింగ వివక్షను రూపు మాపేందుకు కృషి చేయాలని కోరారు. డ్వామ పీడీ కోటేశ్వర్రావు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి గానూ ఉపాధిహామీ పథకం ద్వారా రూ. 9100లను అందజేస్తున్నట్లు తెలిపారు. ఆనతరం సాక్షరభారత్ ఆధ్వర్యంలో ప్రచురించిన పుస్తకాలను పంపిణీ చేశారు. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో మర్రిగూడ మండల ప్రత్యేకాధికారి పావులూరి హనుమంతరావు, ఎంపీడీఓ బి.ఉష, తహసీల్దార్ డి.గోవర్దన్, ఎంఈఓ టి.తిరుపతిరెడ్డి, సీనియర్ పబ్లిక్ హెల్త్ అఫీసర్ ఎస్.దాస్‌నాయక్, ఎస్ఐ కె.శంకర్‌రెడ్డి, ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ త్వరలో పూర్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మర్రిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. మన తెలంగాణను మనం సాధించుకున్నామని, ఇక అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సి ఉందన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేన్నమనేని రవీందర్రావు, వజ్రమ్మ, రమావత్ భీమానాయక్, సర్పంచ్‌లు పాశం సురేందర్‌రెడ్డి, పాముల యాదయ్య, రాచమళ్ల నరేందర్‌రెడ్డి, నాయకులు ఏర్పుల యాదయ్య, చెరుకు లింగం తదితరులు పాల్గొన్నారు.