నల్గొండలో చిరుత కలకలం.. | Leopard Hulchul In Nalgonda | Sakshi
Sakshi News home page

నల్గొండలో చిరుత కలకలం..

Published Tue, Jan 14 2020 10:39 AM | Last Updated on Tue, Jan 14 2020 4:29 PM

Leopard Hulchul In Nalgonda - Sakshi

సాక్షి, నల్గొండ: జిల్లాలోని మర్రిగూడ మండలం అజలాపురం గ్రామ శివారులో చిరుత కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన చిరుత అడవిపందుల కోసం వేసిన ఉచ్చులో చిక్కుకుంది. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. మత్తు మందు ప్రయోగించి చిరుతను బంధించారు. అనంతరం జూ కి తరలించారు. చిరుత ప్రత్యక్షంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో చిరుత కదలికలపై సమాచారమిచ్చినా అటవీ శాఖ అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement