సాక్షి, నల్గొండ జిల్లా: నల్లొండలో బీఆర్ఎస్(BRS Party) రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు నల్గొండ(Nalgonda)లో కేటీఆర్(KTR) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే పోలీసులు మాత్రం ధర్నాకు నో చెప్పారు. పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి నిరాకరణపై బీఆర్‌ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.
ధర్నా కారణంగా క్లాక్ టవర్ సెంటర్‌లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని.. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందంటూ అనుమతి నిరాకరించారు. సంక్రాంతి సెలవులు ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతుందని పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీఆర్‌ఎస్ రైతు మహాధర్నా తలపెట్టిన సంగతి తెలిసిందే. పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. కానీ పోలీసులు.. ధర్నాకు అనుమతి నిరాకరించడంతో బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు
హామీలను అమలు చేయాలని అడగడం తప్పా?
రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమే ఇదంటూ ధ్వజమెత్తారు. కేటీఆర్ వస్తున్నారంటే రేవంత్ ప్రభుత్వం భయపడుతోంది. రేవంత్ ఇచ్చిన హామీల అమలును నిలదీయొద్దా?. హామీలను అమలు చేయాలని అడగడం తప్పా?’’ అంటూ లింగయ్య ప్రశ్నించారు.
ఇదీ చదవండి: కేసీఆర్, హరీశ్, ఈటలకు సమన్లు?
Comments
Please login to add a commentAdd a comment