మర్రిగూడ/చండూరు: మునుగోడు ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ ఇన్‌చార్జిగా వ్యవహరించిన మర్రిగూడ మండలం లెంకలపల్లి ఎంపీటీసీ పరిధిలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి 711 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇక్కడ సహ ఇన్‌చార్జిగా ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి వ్యవహరించారు. ఈ ఎంపీటీసీ పరిధిలో లెంకలపల్లి, సరంపేట గ్రామాల్లోని మూడు బూత్‌లలో 4,009 మంది ఓటర్లు ఉండగా 2,793 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్‌కు 1,610, బీజేపీకీ 899, కాంగ్రెస్‌కు 95, బీఎస్పీకి 34, మిగతావి ఇతరులకు పోలయ్యాయి.
కేటీఆర్ ఇన్‌చార్జిగా ఉన్న గట్టుప్పల్‌లో 47 ఓట్ల ఆధిక్యం
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గట్టుప్పల్ ఎంపీటీసీ–1కు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఆయన పరిధిలో 3,360 మంది ఓటర్లు ఉండగా 3097 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌కు 1359 ఓట్లు, బీజేపీకి 1312 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌కు 47 ఓట్ల ఆధిక్యం లభించింది. మంత్రి కేటీఆర్ తరపున పూర్తిగా సిరిసిల్ల జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆగయ్య ప్రచార బాధ్యతలు నిర్వహించారు. మర్రిగూడ మండల కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు.
ఇక్కడ మూడు బూత్‌లలో 2,785 మంది ఓటర్లు ఉండగా 2,522 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్‌కు 1,389, బీజేపీకి 792, కాంగ్రెస్‌కు 174, బీఎస్పీకి 37 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ బీజేపీపై టీఆర్‌ఎస్‌కు 597 ఓట్ల ఆధిక్యం లభించింది.
చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment