మూడు గంటలకే బడి బంద్
మూడు గంటలకే బడి బంద్
Published Mon, Aug 29 2016 11:17 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
రాంరెడ్డిపల్లి (మర్రిగూడ) : మండలంలోని రాంరెడ్డిపల్లి ప్రాథమికొన్నత పాఠశాల ఉపాధ్యాయలు సమయ పాలన పాటించడం లేదు. 1 నుంచి 7 వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయలు ఉన్నారు. ప్రతి రోజు సాయంత్రం 4.15 గంటలకు పాఠశాలను మూసి వేయాల్సి ఉండగా సోమవారం మాత్రం 3 గంటలకే పాఠశాలకు తాళం చేశారు. ఈ పాఠశాల ఉపాధ్యాయలు సమయ పాలన పాటించడం లేదని స్థానికులు ఆరోపించారు. దీనిపై ఎంఈఓ ఎం.సు«ధాకర్‌ను వివరణ కోరుగా అనుమతి లేకుండా పోయిన ఉపాధ్యాయులపై చర్య తీసుకుంటామని తెలిపారు.
Advertisement
Advertisement