
సాక్షి, నల్లగొండ(మర్రిగూడ): మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో దుండగులు చేతివాటం ప్రదర్శించి జేబులు కత్తిరించేస్తున్నారు. ఏకంగా ఒక ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి జేబులోంచి నోట్ల కట్ట కొట్టేశారు. మర్రిగూడ మండలం నామాపురం, కొట్టాల గ్రామంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి సోమవారం కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు.
ప్రచారం ముగిసిన తర్వాత తన జేబు చూసుకుంటే అందులోని రూ.50 వేల నోట్ల కట్ట కనిపించలేదు. చుట్టూ మనవాళ్లే ఉన్నారు.. జేబులోని నోట్ల కట్ట ఎలా మాయమైందంటూ ఆ అభ్యర్థి నోరెళ్లబెట్టాడు. అనంతరం ఆయన వెంట ఉన్న నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ వాగ్వా దానికి దిగారు. దీంతో మరో నాయకుడు కలుగజేసుకుని పోయిన డబ్బులు ఎలాగూ పోయాయి.. మనమెందుకు తగువులాడుకో వడం.. అంటూ వివాదాన్ని చల్లార్చారు.
Comments
Please login to add a commentAdd a comment