డిజిటల్‌ తరగతులు ప్రారంభం | started the digital classes | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ తరగతులు ప్రారంభం

Published Wed, Aug 17 2016 10:26 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

డిజిటల్‌ తరగతులు ప్రారంభం

డిజిటల్‌ తరగతులు ప్రారంభం

అంతంపేట: మండలంలోని అంతంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బోధన సరళతరం చేయడానికి ఉపా«ధ్యాయులు బుధవారం డిజిటల్‌ తరగతి గదులను ప్రారంభించారు. ఈ పాఠశాలలో  6 నుంచి 10వ తరగతి వర కు  విద్యార్థుల కోసం రాజీవ్‌ మాధ్యమిక శిక్షా అభియాన్‌(ఆర్‌ఎంఎస్‌ఏ) వారు అవసరమైనా సాంకేతిక పరికరాలను పంపిణీ చేశారు. ఈ తరగతులను సర్పంచ్‌ రాచమళ్ల నరేందర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆ పాఠశాల హెచ్‌ఎం సురేష్‌బాబు, రవీందర్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement