వాహ్‌.. వ్యాక్స్‌ మినియేచర్‌ | Digital Wax Artist Naresh Ravulapalli Interview | Sakshi
Sakshi News home page

వాహ్‌.. వ్యాక్స్‌ మినియేచర్‌

Published Tue, Dec 10 2024 7:02 AM | Last Updated on Tue, Dec 10 2024 7:03 AM

Digital Wax Artist Naresh Ravulapalli Interview

సెలిబ్రిటీలను అబ్బురపరుస్తున్న ఆర్టిస్ట్‌

పలువురు ఔత్సాహికులకు బొమ్మలు గీస్తూ..

డిజిటల్‌ వ్యాక్స్‌తో కొత్త తరహా పోట్రెయిట్స్‌

సోషల్‌మీడియాలో ఆర్టిస్ట్‌ నరేష్‌కి గుర్తింపు  

ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు.. తనలోని ప్రతిభకు పదునుపెట్టి చిన్నప్పుడు హాబీగా వేస్తున్న ఆర్ట్‌ని కొంగొత్త రీతిలో చూపెడుతూ తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. ఆర్ట్‌లో రాణించడానికి శిక్షణ లేకపోయినా తన సృజనాత్మకతను జోడించి ప్రత్యేక డిజైన్స్‌ చేస్తూ సెలిబ్రిటీస్‌ని సైతం ఆకట్టుకుంటున్నాడు. ఆయనే నగరానికి చెందిన డిజిటల్‌ వ్యాక్స్‌ ఆర్టిస్ట్‌ నరేష్‌ రావులపల్లి.. తన ఆర్ట్‌ విషయాలను సాక్షితో పంచుకున్నారు.. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..  

నాకు అసలు ఆర్టిస్ట్‌ అవ్వాలనే ఆలోచనే లేదు.. ఏదైనా నచి్చన బొమ్మ కనబడితే వాటిని అలాగే వచ్చేలా గీసేవాడిని. ఆటోలు, బస్సులు, చెట్లు, జంతువులు, పక్షులు ఇలా ఏది కనబడితే వాటిని పేపర్‌ మీద పెట్టేవాడిని. నేను కేపీహెచ్‌బీలో ఉంటాను. స్కూలింగ్‌ సమయంలో పెయింటింగ్‌లో బహుమతులు వచ్చేవి. నా బొమ్మలు చూసి అందరూ మెచ్చుకునేవారు. కానీ తనలోని ప్రవృత్తి అయిన ఆర్ట్‌ని అలాగే అప్పుడప్పుడూ పదును పెడుతూ సివిల్‌ ఇంజినీరింగ్‌ చేసి జాబ్‌ చేయడం మొదలుపెట్టాను.

 సోషల్‌మీడియాతోనే గుర్తింపు.. 
నేను చేసిన డిజిటల్‌ వ్యాక్స్‌ ఆర్ట్‌ బొమ్మలను ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ ద్వారా పోస్ట్‌ చేసేవాడిని. అంతేకాకుండా తెలిసిన వారు కూడా నా ఆర్ట్‌ గురించి చెప్పేవారు. అలా ఆర్డర్స్‌ వచ్చేవి.. నా ఆర్ట్స్‌కి డబ్బుతోపాటు వినియోగదారుల ఆదరణ మరింత సంతోషాన్నిచ్చేది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు, ఎన్‌టీఆర్‌ కొమరం భీమ్‌ గెటప్స్‌ని చిన్నపిల్లలుగా నడిపించే రాజమౌళిగా ఆర్ట్‌ గీశాను. అప్పటికీ చిత్ర ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ కాకపోవడంతో నా ఆర్ట్‌కి సోషల్‌మీడియా చాలా హైప్‌ వచి్చంది. చిత్ర అఫీషియల్‌ టీం ఆ పెయింటింగ్‌ని తమ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇది చాలా గర్వంగా అనిపించింది. ఆ ఇన్‌స్పిరేషన్‌లో కొత్త కాన్సెప్ట్స్‌ని చేయడం మొదలుపెట్టాను.

డిజిటల్‌ ఆర్ట్స్‌.. 
సోషల్‌ మీడియా, డిజిటలైజేషన్‌ సరికొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో డిజిటల్‌ ఆర్ట్స్‌నే చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది. అందరిలా కాకుండా కొత్తగా ట్రై చేద్దామని ఏడాది కష్టపడి డిజిటల్‌ వ్యాక్స్‌ ఆర్ట్‌ను నేర్చుకున్నాను. నా స్పేహితుడు మినియేచర్‌ (చిన్నచిన్న బొమ్మలు) కొనడానికి షాప్‌కి తీసుకెళ్ళాడు. చిన్నచిన్న బొమ్మలే ఐదువేల, పదివేలు, ఇంకా ఎక్కువ ధర ఉండటం చూసి షాక్‌ అయ్యాను. అప్పుడే నాలో కొత్త ఆలోచన మొదలైంది. మినియేచర్‌ బొమ్మల్లా కార్టూన్‌ ఫార్మాట్‌లో ఫినిషింగ్‌తో డిజిటల్‌ వ్యాక్స్‌ పెయింటింగ్స్‌ వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచి్చంది. వెంటనే ఆచరణలో పెట్టాను.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement