
ఓ పట్టాన అంతుచిక్కని కొన్ని రకాల వ్యాధులు వైద్యులకు భలే గమ్మత్తైన సవాళ్లని విసురుతుంటాయి. ఒక్కోసారి అదెలా సాధ్యం అని వైద్యులకే చెమటలు పట్టించేస్తాయి. అచ్చం అలాంటి వైద్య పరిస్థితితోనే పోరాడుతోంది ఈ చిన్నారి. వైద్యపరంగా ఆమె ఓ అద్భుతంగా మారింది. ప్రతి వ్యక్తి మనుగడకు, ఆరోగ్యానికి ప్రధానమైన మూడు ప్రాథమిక అవసరాలు లేకుండానే బతికేస్తుంది ఆమె. మరీ ఆ చిన్నారి ఎలాంటి వైద్యపరిస్థితితో బాధపడుతోందంటే..
యూకేకి చెందిన ఒలివియా పార్న్స్‌వర్త్ అనే అమ్మాయి అరుదైన జన్యుపరమైన సమస్యతో పోరాడుతోంది. ఆ ప్రత్యేకమైన పరిస్థితి కారణంగా వైజ్ఞానికంగా అద్భతమైన అమ్మాయిగా మారిందామె. ప్రపంచంలో ప్రతి మానవుడికి కీలమైన మూడు ప్రాథమిక అవసరాలు లేకుండానే జీవించగలదామె. సింపుల్‌గా చెప్పాలంటే ఆమె ఆ మూడు సవాళ్లను ఒకేసారి అధిగమించగల అసాధారణ అమ్మాయి. అంతెందుకు వైద్యులు కూడా ఆమెను ఓ ఆద్బుతంగా పరిగణించారు.
ఏంటా వైద్యపరిస్థితి అంటే..
ఒలివియాకి నొప్పి, ఆకలి, నిద్ర అనేవి ఉండవట. ఇది మనిషిలో ఉండే ఆరవ క్రోమోజోమ్‌లోని జన్యుపరమైన అసాధారణత ఫలితంగా ఆమెకు ఇలాంటి పరిస్థితని వైద్యలు భావిస్తున్నారు. ఒకరకంగా ఇది వరంలా కనిపించినా ఆమెకు ఈ పరిస్థితి ఆందోళనకరమైనదే అనే ఒలివియా తల్లి ఆవేదనగా చెప్పారు. ఈ మూడింటి ఫీలింగ్స్ ఆమెకు తెలియదు కాబట్టి ఏ క్షణంలో తనను తాను ఎలా గాయపరుచుకుంటుందో అనే భయపడుతూ బతకాల్సి వస్తోందంటూ కన్నీటి పర్యాంతమైంది ఒలివియా తల్లి.
ఇక ఆమెకు ఆకలి ఉండదు కాబట్టి ఆమె పోషకాహార లోపంతో బాధపడకుండా మంచి ఆహారాన్ని ఇచ్చేలా పర్యవేక్షించక తప్పదని చెబుతోంది. అంతేగాదు ఒలివియాకు ఏడేళ్ల వయసులో జరిగిన ప్రమాదం గుర్తించేసుకుంటూ..నాడు తామంతా ఒలివియా పరిస్థితి చూసి కంగుతిన్నామని చెప్పింది. ఆమె చిన్నతనంలో ఓ కారు ఆమెను ఢీకొట్టి చాలాదూరం ఈడ్చుకుని వెళ్లిపోయిందని నాటి ఘటనను వివరించారు.
ఒళ్లంతా నెత్తురోడుతున్న...
ఆ ఆకస్మిక ఘటనకు మా కుటుంబం అంతా షాక్‌లో ఉండిపోయింది. కొద్దిపాటి మెరుపు వేగంలో తేరుకుని ఒలివియాను రక్షిద్దాం అనుకునేలోగా ..ఒలివియా ఏమి కానట్లుగా తనంతాట తానే లేచి తమ వద్దకు రావడంతో హుతాసులైపోయాం అంటూ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారామె. ఒంటినిండా గాయలైనా ఏం కానట్లు ఒలివియా ప్రవర్తించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేనంటోంది తల్లి.
"ఒలివియాకి నిద్ర కూడా ఓ సవాలు. ఎందుకంటే మందులు లేకుండా సహజంగా నిద్రపోలేదు. మనం గనుక మందులు వేయకపోతే అలా మూడు రోజుల వరకు మేల్కొనే ఉంటుందట. ఆ నిద్రలేమిని నిర్వహించేలే కఠినమైన నిద్ర సహాయాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు". ఒలివియా తల్లి. ఆ అమ్మాయి పరిస్థితిని ఆస్పత్రి వారు బయోనిక్‌గా అబివర్ణించారు.
ఈ అరుదైన కేసు జీవశాస్త్రం సంక్లిష్టతలు, జన్యుఉత్పరివర్తనాల ప్రభావంపై అంతర్‌దృష్టిని అందిస్తోందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఆ అమ్మాయి కేసు తమ వైద్యానికే అంతపట్టని చిక్కుప్రశ్నలా ఉందన్నారు. ఒలివియా పరిస్థితిని ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాటిలో ఒకటిగా పేర్కొన్నారు. నిజంగా ఆ అమ్మాయి పరిస్థితి వైద్య నిపుణులకేకాదు సాధారణ ప్రజలకు కూడా ఆశ్చర్యం కలిగించేలా ఉంది కదూ..!.
(చదవండి: కిడ్నీలు పదిలమేనా..? మదుమేహం లేకపోయినా వస్తుందా..?)
Comments
Please login to add a commentAdd a comment