Girl Swept Out Sea While Playing Friends in UK - Sakshi
Sakshi News home page

అంతా క్షణాల్లో జరిగిపోయింది.. సముద్రంలోకి జారి పడిన యువతి, చివరికి

Published Thu, Aug 10 2023 1:32 PM | Last Updated on Thu, Aug 10 2023 3:06 PM

Girl Swept Out Sea While Playing Friends In UK - Sakshi

ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే బయట ప్రాంతాలకు వెళ్లి జాగ్రత్తగా ఉండాలని అంటుంటారు. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్న ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇటీవల ఓ యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడింది. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టంట వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో కొందరు పీర్ స్లిప్‌వేపై ఆడుకుంటూ ఉంటారు. సముద్ర అలలు వస్తూ పోతూ ఉండగా వారు దాన్ని ఆనందిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి చోట ఆటలే కాదు అజాగ్రతగా ఉన్నా ప్రమాదమే అని తెలియక వాళ్లు అక్కడ గంతులెస్తుంటారు.  అకస్మాత్తుగా, ఊహించని విధంగా ఒక బలమైన కెరటం అందులోని ఓ యువతిని తాకింది. దీంతో ఆమె తన బ్యాలెన్స్ కోల్పోయి సముద్రంలోకి వెళ్లిపోయింది. ఒడ్డుకు వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కెరటాల ధాటికి యువతి చేరుకోలేకపోతుంది.

చివరికి ఆమెను కాపాడేందుకు సముద్రంలో ఎగసిపడుతున్న కెరటాలకు ఎదురెళ్లి ఓ వ్యక్తి బాలికను రక్షించగలిగాడు. ఈ ప్రమాదం నుంచి బయటక పడిన యువతికి స్వల్ప గాయలయ్యాయి. నార్త్ డెవాన్ కౌన్సిల్ అత్యవసర హెచ్చరికతో పాటు ట్విట్టర్‌లో ఈ వీడియోని షేర్‌ చేసింది. సముద్రం తీరం వద్ద అధిక ఆటుపోట్లు ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలని ప్రజలను కోరింది. "సముద్రంలోని అలలు పరిస్థితులు బట్టి మారుతుంటాయ్‌.. కొన్ని సార్లు ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయి,. కాబట్టి దయచేసి తీరం వెంబడి జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement