భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) పుదుచ్చేరిలోని తన వినియోగదారులకు ప్రత్యేక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. తన యూజర్లకు డిజిటల్, వినోద సేవలను మరింత చేరువ చేసేందుకు మూడు కొత్త సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపింది.
మొబైల్ కోసం ఇంట్రానెట్ టీవీ (బీఐ టీవీ)
ఓటీటీప్లే సహకారంతో బీఎస్ఎన్ఎల్ ప్రీమియం కంటెంట్‌తో సహా 300 లైవ్ టీవీ ఛానళ్లను మొబైల్ వినియోగదారులకు ఉచితంగా అందిస్తుంది. ఈ సర్వీసు స్థిరంగా స్ట్రీమింగ్ అయ్యేందుకు, ఎలాంటి అవాంతరాలు కలుగకుండా ఉండేందుకు బీఎస్ఎన్ఎల్ మొబైల్ ఇంట్రానెట్‌ను ఉపయోగిస్తుంది.
నేషనల్ వై-ఫై రోమింగ్
బీఎస్ఎన్ఎల్ మనడిపట్టు గ్రామంలో వై-ఫై రోమింగ్‌ను ప్రారంభించింది. ఈ గ్రామం భారతదేశంలో రెండో పూర్తి వై-ఫై వినియోగిస్తున్న గ్రామంగా ప్రసిద్ధి. బీఎస్ఎన్ఎల్ ఎఫ్‌టీటీహెచ్ చందాదారులు దేశవ్యాప్తంగా ఏదైనా బీఎస్ఎన్ఎల్ వై-ఫై హాట్‌స్పాట్ లేదా ఎఫ్‌టీటీహెచ్ కనెక్షన్ నుంచి ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..
ఫైబర్ ఆధారిత ఇంట్రానెట్ టీవీ (ఐఎఫ్ టీవీ)
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ఐఎఫ్ టీవీ సర్వీస్‌ను పుదుచ్చేరిలో అందిస్తుంది. ఎఫ్‌టీటీహెచ్ చందాదారులకు 500కి పైగా లైవ్ టెలివిజన్ ఛానళ్లను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ ఛానళ్లు నిరంతరంగా, హై క్వాలిటీలో స్ట్రీమింగ్ అయ్యేలా సంస్థ చర్యలు తీసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment