బెజ్జూర్, న్యూస్‌లైన్ : అక్రమాలకు పాల్పడిన ఉపాధ్యాయులపై పంచ్ పడింది. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పాఠశాల నిధులు స్వాహా’ కథనంపై ఆర్వీఎం పీవో యాదయ్య స్పందించారు. బెజ్జూర్ మండలంలోని పర్దాన్‌గూడ, బారెగూడ, తొర్రంగూడ, అందుగూలగూడ గిరిజన పాఠశాలలకు చెందిన నలుగురు ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఎంఈవో సోమయ్యకు శనివారం ఆదేశాలు అందాయి. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రొసిడింగ్ నంబర్ ఎ2/2616/2/201314 ఆర్డర్‌ను ఎంఈవోకు పంపించారు.
దీంతో బారెగూడ ఉపాధ్యాయుడు తుకారాం, పర్దాన్‌గూడ ఉపాధ్యాయుడు లక్ష్మణ్, తొర్రంగూడ ఉపాధ్యాయుడు ధర్మయ్య, అందులగూడ ఉపాధ్యాయుడు గోపాల్ నుంచి డబ్బులు రికవరీ చేయడమే కాకుండా వేతనాలు నిలిపివేయాలని అందులో ఆదేశాలు జారీ చేశారు. నలుగు రు ఉపాధ్యాయులపై రెండ్రోజుల్లో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామ ని ఎంఈవో సోమయ్య తెలిపారు. తొర్రంగూడ పాఠశాల ఉపాధ్యాయు ని నుంచి రూ.7 లక్షల 73 వేలు, అందులగూడ నుంచి రూ.3 లక్షల 36 వేలు, పర్దాన్‌గూడ నుంచి రూ.2 లక్షల 38 వేల 750, బారెగూడ ఉపాధ్యాయుని నుంచి రూ.2 లక్షల 86 వేల 500 రికవరీ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు చెప్పారు. కాగా.. పర్దాన్‌గూడ పాఠశాల ఉపాధ్యాయు డు లక్ష్మణ్ ఇప్పటికే రూ.2.38 లక్షల డీడీ అందించినట్లు సమాచారం.
నలుగురు ఉపాధ్యాయుుులపై క్రిమినల్ కేసులు
Published Sun, Dec 15 2013 3:44 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement