టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే | congress MLA Yadaiah joins into TRS | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Published Sun, Nov 16 2014 6:53 PM | Last Updated on Mon, Mar 18 2019 8:57 PM

congress MLA Yadaiah joins into TRS

హైదరాబాద్: కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కోటి ఆశలున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఒక పద్ధతి ప్రకారం ఆ కలలను నెరవేర్చుకుందామని చెప్పారు. ఆదివారం చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్య కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. చేవెళ్ల ఎమ్మెల్యే కోరిన కోర్కెలన్నీ త్వరలో నెరవేరుస్తానని అన్నారు. 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేస్తామని తెలిపారు.

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ప్రజలందరూ అండగా నిలవాలని కేసీఆర్ కోరారు. 3 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఒక్క నిమిషం  కూడద కరెంట్ పోకుండా చూస్తానని అన్నారు. ప్రతి ఇంటికి తాగునీటి నల్లా అందిస్తామని, దళిత రైతులకు దళితులకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతర కులాలకు 80 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేవిధంగా కృషిచేస్తామని కేసీఆర్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement