కుల బహిష్కరణపై ఆవేదన చెందిన ఇద్దరు యువకులు సెల్ టవరెక్కి నిరసన తెలిపారు
వలిగొండ(యాదాద్రి భువనగిరి): కుల బహిష్కరణపై ఆవేదన చెందిన ఇద్దరు యువకులు సెల్ టవరెక్కి నిరసన తెలిపారు. వలిగొండ మండలం దుప్పలి గ్రామంలో అరూర్ యాదయ్య, సండ్ర యాదయ్య అనే వారు కుల పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారు.
దీంతో కులపెద్దలు వారిపై కుల బహిష్కరణ శిక్ష విధించారు. దీనిపై బాధితులు తహశీల్దారుకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం కనిపించకపోవటంతో శుక్రవారం ఉదయం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కారు. తమకు న్యాయం జరిగితేనే కిందికి దిగుతామంటూ అక్కడే కూర్చున‍్నారు.