
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని రామకుప్పం మండలంలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన బుధవారం కలకలం రేగింది. కాగా మంగళవారం తన సోదరుడు చనిపోవడంతో ఒక వర్గం పెద్దలు స్మశానంలోకి అనుమతించకపోవడంతో మనస్తాపం చెంది సెల్ టవర్ ఎక్కినట్లు సమాచారం. ఈ క్రమంలో శ్మశాన వాటికలపై కూడా కుల రాజకీయం చేస్తున్నారని అతడు ఆరోపించాడు. కాగా హిందూ స్మశాన వాటికను కాస్త కుల స్మశాన వాటికగా బోర్టు మార్చి ఇతరులను అనుమతించకుండ అడ్డుకుంటున్నారని సదరు యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు.