ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులు
సాక్షి, చిత్తూరు : చిత్తూరు ఆర్టీసీ డిపోలో బ్రీత్ ఎనలైజర్ మిషన్‌కు మత్తెక్కిందని, దాన్ని వెంటనే తొలగించాలని కార్మికులు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం డ్యూటీకి వెళ్లిన కార్మికులు బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షలు చేస్తే 100, 200, 230 దాటడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. మద్యం తాగని వారికి కూడా తప్పుడు సంకేతాలు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపో గేటు ఎదుట ఆందోళనకు దిగారు. ఇంతలో అక్కడికి చేరుకున్న గ్యారేజీ ఇన్‌చార్జితో వాగ్వాదానికి దిగారు.
కార్మికులు మాట్లాడుతూ బ్రీత్ ఎనలైజర్ మిషన్లు పనిచేయడం లేదని డిపో అధికారులకు ఇదివరకే ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. గతంలో మిషన్ ఇచ్చిన తప్పుడు సంకేతాల కారణంగా ఆరుగురు కార్మికులు సస్పెన్షన్‌కు గురయ్యారన్నారు. మళ్లీ అదే సమస్య పునరావృతమవుతోందన్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, లేకపోతే తీవ్ర పరిణా మాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీటీఎం రాము అక్కడికి చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని సర్ది చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment