అర్ధరాత్రి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సమక్షంలో మాట్లాడుతున్న వీసీ దామోదర్ నాయుడు
చిత్తూరు ,యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ వ్యవసాయ కళాశాల ఆవరణలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమ న్యాయపరమైన సమస్యలపై కళాశాలలో విద్యార్థులు పదిరోజులుగా ఆందో ళన చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారులు వీరి ఆందోళనను పట్టించుకోకపోగా కక్షసాధింపు చర్యకు దిగారు. బుధవారం వసతి గృహాలు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసుల సాయంతో ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. విద్యార్థులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి భోజనం చేయకుండా వసతి గృహ ఆవరణలో వారు ఆందోళనకు దిగారు. తమ సమస్యను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే తక్షణమే స్పందించి విద్యార్థులతో కలసి ఆందోళనలో పాల్గొన్నారు.
సాయంత్రం 4 నుంచి ఏడీఆర్ చాంబర్ ఎదుటబైఠాయించారు. తిరుపతి సమావేశానికి వచ్చిన వీసీ దామోదరనాయుడు ఏడీచాంబర్‌లో వుండడంతో విద్యార్థులు దిగ్బంధించారు. అర్దరాత్రి గడచినా ఆందోళన కొనసాగింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ వీసీ దామోదరం నాయుడు వైఖరిని ఖండించారు. ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. విద్యార్థుల పోరాటంలో న్యాయం వుందన్నారు. కనీసం బయటకు వచ్చి మాట్లాడకపోవడం నిర్లక్ష్య ధోరణి, అహంకారానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు దామినేటి కేశవులు, మూలంబాబు, విద్యార్థి విభాగం నాయకులు ఓబుల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
డిమాండ్‌లు ఇవి
♦ కళాశాల సమయాన్ని మార్చాలి.
♦ వ్యవసాయశాఖలో ఉద్యోగాలను ఐసిఆర్ గుర్తింపులేని సంస్థల్లో చదివినవారికి ఇవ్వవచ్చుననే ప్రభుత్వం ఉత్తర్వులు రద్దు చేయాలి
♦ మరిన్ని కళాశాలలకు అనుమతించవద్దు
♦ ఐసిఆర్ గుర్తింపులేని కళాశాలను రద్దు చేయాలి
వీసీ చర్చలు..
రాత్రి 11 గంటల సమయంలో వీసీ బయటకు వచ్చి ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. తరువాత విద్యార్థులతో మాట్లాడారు. తన పరిధిలోని సమస్యలను తక్షణం పరిష్క రిస్తామన్నారు. విధానపరమైనవి ప్రభుత్వానికి నివేది స్తామన్నారు. హాస్టళ్లను తెరిపించి విద్యుత్, నీటి సదుపా యాల పునరుద్ధరణకు ఆదేశించారు. తమ సమస్యల పరిష్కా రానికి అర్ధరాత్రి వరకూ ఉండి చొరవ చూపిన ఎమ్మెల్యేకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు దామినేటి కేశవులు, మూలంబాబు, విద్యార్థి విభాగం నాయకులు ఓబుల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment