SV University
-
యూనివర్సిటీలపై రౌడీయిజం.. ఏయూ వీసీకి బెదిరింపు కాల్
-
136 రోజుల జేడీ సోదరుని పాలన..నేటితో
సాక్షి, తిరుపతి : ఎస్వీయూ వీసీగా యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన ప్రొఫెసర్ వీవీఎన్ రాజేంద్రప్రసాద్ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 3న ఎస్వీయూ 18వ వీసీగా నియమితులైన ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ కేవలం 136 రోజులు మాత్రమే పనిచేశారు. ఈయన తన నాలుగు నెలల పాలనలో సొంత నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యారు. గత ప్రభుత్వంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఆర్కే అనురాధ, దూరవిద్యా విభాగానికి చెందిన మాజీ డైరెక్టర్ వి.రవి నాయుడు ఆదేశాలకు అనుగుణంగా పనిచేసినట్లు విమర్శలున్నాయి. రెక్టార్‌గా పనిచేసిన ప్రొఫెసర్ జీ.జానకి రామయ్యతో రాజీనామా చేయించడం మినహా ఇతర కీలక నిర్ణయాలు ఏమీ లేవు. ఈ నిర్ణయంకూడా వారి సూచనలకు అనుగుణంగానే తీసుకున్నట్లు క్యాంపస్‌లో ప్రచారం ఉంది. నియామకమే తప్పు ఎస్వీ యూనివర్సిటీ వీసీ నియామకానికి గత యేడాది ఆగస్టులో నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఈ పోస్టుకు ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ దరఖాస్తు చేయలేదు. జనవరిలో నిర్వహించిన సెర్చ్ కమిటీ సమావేశానికి వారం ముందు ఈయనను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటికపుడు దరఖాస్తు తెప్పించుకున్నారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి రెండేళ్లపాటు ఇబ్బందులకు గురిచేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీ నారాయణ రుణం తీర్చుకొనేందుకు... ప్రభుత్వం ఆయన సోదరుడైన ప్రొఫెసర్ వీవీఎన్ రాజేంద్రప్రసాద్‌కు వీసీ పదవి కట్టబెట్టింది. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ సహకారం కూడా ఈయన నియామకంలో పాత్ర ఉంది. నియామకంపై కేసులు యూజీసీ నిబంధనల ప్రకారం వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్నత విద్యామండలి ప్రధాన కార్యదర్శి సభ్యుడుగా ఉండరాదు. విద్యారంగ నిపుణుడే సభ్యుడిగా ఉండాలి. ఎస్వీయూ సెర్చ్ కమిటీలో ఉన్నత విద్యామండలి ప్రధాన కార్యదర్శిని సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం గత యేడాది డిసెంబర్లో జీఓ జారీ చేసింది. ఈ జీఓను వ్యతిరేకిస్తూ ఎస్వీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ పి.మునిరత్నం రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఫిబ్రవరి 4న తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే ఈ కేసులో తీర్పును ముందే ఊహించిన ప్రభుత్వం ఫిబ్రవరి 3న అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 4వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అయితే ముందు రోజే విధుల్లో చేరినట్లు అప్పటి అధికారుల సహకారంతో తప్పుడు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. అనంతరం ఎస్వీయూ వీసీగా రాజేంద్రప్రసాద్‌ను తొలగించాలని కోరుతూ ప్రొఫెసర్ మునిరత్నం రెడ్డి కో వారెంటో దాఖలు చేశారు. వీసీ నియామకానికి సంబంధించిన రెండు కేసుల్లో ఈ నెల 24న తుది తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ కేసులో ఈయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17న విద్యాశాఖ మంత్రిని కలిసి తన రాజీనామా విషయంపై చర్చించారు. అమరావతి నుంచి మంగళవారం తిరిగి వచ్చారు. బుధవారం సన్నిహితులతో చర్చించిన అనంతరం తన రాజీనామా లేఖను గవర్నర్, ఉన్నత విద్యామండలికి పంపారు. ఈ రాజీనామా ఆమోదం పొందడం లాంఛనమే. ముందే చెప్పిన సాక్షి ఎస్వీయూ వీసీగా ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ నియామకం, నిబంధనల ఉల్లంఘన, హైకోర్టులో కేసులు తదితర అంశాలపై సాక్షి పలు కథనాలు ప్రచురించింది. ఈ నెల 18న ఎస్వీయూ వీసీపై వేటుకు రంగం సిద్ధం అన్న శీర్షికన కథనం ప్రచురతమైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. -
ఎమ్మెల్యే చొరవతో అగ్రి విద్యార్థులకు ఊరట
చిత్తూరు ,యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ వ్యవసాయ కళాశాల ఆవరణలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమ న్యాయపరమైన సమస్యలపై కళాశాలలో విద్యార్థులు పదిరోజులుగా ఆందో ళన చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారులు వీరి ఆందోళనను పట్టించుకోకపోగా కక్షసాధింపు చర్యకు దిగారు. బుధవారం వసతి గృహాలు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసుల సాయంతో ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. విద్యార్థులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి భోజనం చేయకుండా వసతి గృహ ఆవరణలో వారు ఆందోళనకు దిగారు. తమ సమస్యను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే తక్షణమే స్పందించి విద్యార్థులతో కలసి ఆందోళనలో పాల్గొన్నారు. సాయంత్రం 4 నుంచి ఏడీఆర్ చాంబర్ ఎదుటబైఠాయించారు. తిరుపతి సమావేశానికి వచ్చిన వీసీ దామోదరనాయుడు ఏడీచాంబర్లో వుండడంతో విద్యార్థులు దిగ్బంధించారు. అర్దరాత్రి గడచినా ఆందోళన కొనసాగింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ వీసీ దామోదరం నాయుడు వైఖరిని ఖండించారు. ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. విద్యార్థుల పోరాటంలో న్యాయం వుందన్నారు. కనీసం బయటకు వచ్చి మాట్లాడకపోవడం నిర్లక్ష్య ధోరణి, అహంకారానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు దామినేటి కేశవులు, మూలంబాబు, విద్యార్థి విభాగం నాయకులు ఓబుల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. డిమాండ్లు ఇవి ♦ కళాశాల సమయాన్ని మార్చాలి. ♦ వ్యవసాయశాఖలో ఉద్యోగాలను ఐసిఆర్ గుర్తింపులేని సంస్థల్లో చదివినవారికి ఇవ్వవచ్చుననే ప్రభుత్వం ఉత్తర్వులు రద్దు చేయాలి ♦ మరిన్ని కళాశాలలకు అనుమతించవద్దు ♦ ఐసిఆర్ గుర్తింపులేని కళాశాలను రద్దు చేయాలి వీసీ చర్చలు.. రాత్రి 11 గంటల సమయంలో వీసీ బయటకు వచ్చి ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. తరువాత విద్యార్థులతో మాట్లాడారు. తన పరిధిలోని సమస్యలను తక్షణం పరిష్క రిస్తామన్నారు. విధానపరమైనవి ప్రభుత్వానికి నివేది స్తామన్నారు. హాస్టళ్లను తెరిపించి విద్యుత్, నీటి సదుపా యాల పునరుద్ధరణకు ఆదేశించారు. తమ సమస్యల పరిష్కా రానికి అర్ధరాత్రి వరకూ ఉండి చొరవ చూపిన ఎమ్మెల్యేకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు దామినేటి కేశవులు, మూలంబాబు, విద్యార్థి విభాగం నాయకులు ఓబుల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వార్తలకు ప్రాణం వాస్తవాలు
జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి యూనివర్సిటీ క్యాంపస్: జర్నలిస్టులు వార్తలు రాసే ముందు నిజాలను నిర్ధారించుకోవాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సూచించారు. ఎస్వీ యూనివర్సిటీలో శనివారం జర్నలిస్టుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఏపీయూడబ్ల్యూజే, మెఫి సంస్థలు సంయుక్తంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక్కో పత్రిక ఒక్కో పంథా అనుసరిస్తోందని, వాస్తవాలు తెలుసుకోవాలంటే నాలుగైదు పత్రికలు చదవాల్సి వస్తోందన్నారు. తమ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కృషి చేస్తామని చెప్పారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ ఏ వృత్తి వారికైనా శిక్షణ, క్రమశిక్షణ అవసరమన్నారు. జర్నలిస్టులకు ఉద్యోగభద్రత, కనీస వేతనాల అమలుకు తనవంతు కృషిచేస్తామన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ మాట్లాడుతూ జర్నలిస్టులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మెఫి అధ్యక్షుడు, మన తెలంగాణ పత్రిక సంపాదకుడు కె.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు లోకజ్ఞానం, అక్షరజ్ఞానం, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమన్నారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ జర్నలిస్టులు కొత్త విషయాలను నేర్చుకోకపోతే వెనుకబడిపోతారన్నారు. ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు సోమసుందర్ మాట్లాడుతూ జర్నలిజం రంగంలో రోజురోజుకు మార్పులు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు. మెఫి ట్రస్టీ పోగ్రాం కోఆర్డినేటర్ వై.నరేంద్రరెడ్డి, మెఫి ట్రస్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మురళీమోహన్, కార్యదర్శి మన్నెం చంద్రశేఖర్‌నాయుడు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, కార్యదర్శి గిరిబాబు పాల్గొన్నారు.