ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అసలు ఆ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటి? ప్రాజెక్ట్ వెనుక దాగున్న మిస్టరీ ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానాలను త్వరలోనే స్క్రీన్‌పై చూపిస్తామంటున్నారు దర్శకుడు మహేశ్‌రెడ్డి. చైతన్య, దివీ ప్రసన్న జంటగా ఆయన దర్శకత్వంలో ఫిల్మ్ ఎన్ రీల్స్ బ్యానర్‌పై ‘ప్రాజెక్ట్ సి 420’ వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం రూపొందుతోంది. రాబిన్ కె మార్క్స్ స్వరకర్త.
ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ‘‘ఎనభై శాతం షూటింగ్ పూరై్తంది. ఈ నెల ఎండింగ్‌కి షూటింగ్ కంప్లీట్ చేస్తాం. ఆస్ట్రేలియా, చైనాకి చెందిన నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. 80 శాతం మంది ఆస్ట్రేలియన్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్నారు’’ అన్నారు మహేశ్ రెడ్డి. ఈ చిత్రానికి ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్.
Comments
Please login to add a commentAdd a comment