
సినిమాపై బజ్ క్రియేట్ చేయడం, ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రమోషన్స్ చేయడం మామూలు విషయం కాదు. కానీ యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా 'అధర్వ' మీద ముందు నుంచీ ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రమోషన్స్ చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా విడుదల చేయించిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.‘నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించే వరకు ఈ కేసును వదిలిపెట్టను సార్..’అంటూ డైలాగ్ అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి హీరోకి సంబంధించిన యాక్షన్ లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్లు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో యాక్షన్‌లోకి దిగినట్టు కనిపిస్తోంది. ఇందులో హీరో కార్తీక్ రాజు పవర్‌ఫుల్ రోల్‌ను పోషించినట్టు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది.
ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment