
డార్లింగ్ ప్రభాస్ పేరు చెప్పగానే పాన్ ఇండియా సినిమాలు, వేల కోట్ల వసూళ్లు, ఇంటర్నేషనల్ క్రేజ్.. ఇలా చాలా గుర్తొస్తాయి. కానీ ప్రభాస్ పేరు మీద ఓ ఊరు ఉందని, అది కూడా మనకు పక్కనే ఉండే నేపాల్ లో అని మీలో ఎంతమందికి తెలుసు?
రీసెంట్ టైంలో తెలుగు కుర్రాళ్లు చాలామంది యూట్యూబ్ వీడియోలు, మోటో వ్లాగింగ్ చేస్తున్నారు. అలా ఓ తెలుగు యువకుడు.. నేపాల్ లో పర్యటిస్తున్నాడు. అక్కడ అనుకోకుండా ప్రభాస్ పేరుతో ఉన్న ఓ ఊరి బోర్డ్ కనిపించింది. ఇంకేం వెంటనే ఓ వీడియో తీసి పోస్ట్ చేశాడు. ఇప్పుడది వైరల్ అయిపోయింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)
అయితే ఈ ఊరికి మొదటి నుంచి ప్రభాస్ పేరు ఉందని తెలుస్తోంది. ఏదేమైనా డార్లింగ్ హీరో ఫ్యాన్స్ మాత్రం తన అభిమాన హీరో పేరుపై ఏకంగా నేపాల్ లో ఊరు ఉందని తెగ మురిసిపోతున్నారు.
ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. త్వరలో సందీప్ రెడ్డి వంగా తీయబోయే 'స్పిరిట్' చేస్తాడు. దీనిపై అంచనాలు గట్టిగానే ఉన్నాయండోయ్.
(ఇదీ చదవండి: 38 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్.. నటుడు గోవిందా విడాకులు!)
Comments
Please login to add a commentAdd a comment