రామాయణం ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం 'ఆదిపురుష్'. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కానీ నేపాల్‌లో మాత్రం ఈ సినిమా విడుదలపై అభ్యంతరం వ్యక్తం అయింది. ఆదిపురుష్ సినిమాలో సీతా దేవి భారతదేశపు కుమార్తె అని డైలాగ్ చెబుతూ ఓ సన్నివేశం ఉంటుంది. దీనిని నేపాల్ సెన్సార్ బోర్డు తప్పుబట్టింది. సీతా దేవి నేపాల్‌లో జన్మించిందని వారి నమ్మకం. దీంతో అక్కడ సినిమా రిలీజ్ కాలేదు. ఖాట్మండులోని కొన్ని థియేటర్లలో ఆదిపురుష్ సినిమాను బ్యాన్ కూడా చేశారు.
(ఇదీ చదవండి: Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్)
ఆ డైలాగ్‌ను తొలగించాల్సిందిగా మూవీ మేకర్స్‌ను వారు కోరారు. దీంతో వివాదానికి కారణమైన డైలాగ్స్‌ను మేకర్స్ తొలగించారు. అనంతరం నేపాల్‌లో మూవీ విడుదలకు లైన్ క్లియర్ అయింది. కానీ మార్నింగ్ షోలు ఆగిపోయాయి. మరి కొన్ని గంటల్లో అక్కడ మెదటి షో పడనుంది. సీతాదేవి నేపాల్ కుమార్తెగా వారు భావిస్తారు కాబట్టి అక్కడ మొదటి నుంచి ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే అక్కడ టికెట్లు కూడా భారీగా అమ్ముడుపోయాయి.
(ఇదీ చదవండి: Adipurush: ఎవరీ ఓం రౌత్.. ప్రభాస్‌కు ఎలా పరిచయం?)
Comments
Please login to add a commentAdd a comment