
ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’లోని డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారత్‌లోనే కాకుండా నేపాల్‌లో కూడా వివాదం చెలరేగింది. సీతాదేవి నేపాల్‌లో జన్మిస్తే.. 'ఆదిపురుష్'లో మాత్రం భారత్‌లో పుట్టినట్టు చూపించారని మేకర్స్‌పై అక్కడి రాజకీయ నేతలు మండిపడుతున్నారు. ఆ సన్నివేశాన్ని తొలగించమని మూడురోజులు గడువు ఇచ్చినా మేకర్స్ ఇప్పటికీ తొలగించలేదని ఫైర్ అవుతున్నారు.
(ఇదీ చదవండి: Rakesh Master Death: నేను చనిపోతే వాళ్లు చేసేది ఇదే)
దీంతో కాఠ్‌మండూ మేయర్ బలెన్ షా సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి (జూన్ 19) ఆదిపురుష్‌తో పాటు భారత్‌కు చెందిన ఏ సినిమాను అక్కడ ప్రదర్శించబడదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పటికే అక్కడ ప్రదర్శించబడుతున్న బాలీవుడ్ సినిమాలను థియేటర్ల నుంచి తీసేసి.. వాటి స్థానంలో హాలీవుడ్,నేపాలీ సినిమాలను ప్రదర్శించాలని ఆదేశించారు. నేపాల్ ప్రజల స్వేచ్ఛ, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవడం పౌరుల బాధ్యతని ఆయన తెలిపారు. కాఠ్‌మండూ మెట్రోపాలిటన్ సిటీతో పాటు పోఖారా పరిధిలోని థియేటర్లలో నేటి నుంచి ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
— Balen Shah (@ShahBalen) June 18, 2023
(ఇదీ చదవండి: షూటింగ్‌కు ముందే హీరోతో లిప్‌లాక్ చేసిన హీరోయిన్)