ప్రభాస్ బర్త్‌ డే.. ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ | Prabhas Mr Perfect will be re released in the theatres on October 22 | Sakshi
Sakshi News home page

Prabhas Birthday: ప్రభాస్ బర్త్‌ డే స్పెషల్.. థియేటర్లలో ఆ సినిమా చూసేయండి

Published Wed, Oct 16 2024 6:02 PM | Last Updated on Wed, Oct 16 2024 6:58 PM

Prabhas Mr Perfect will be re released in the theatres on October 22

టాలీవుడ్‌లో ఇటీవల ఎక్కువగా రీ రిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్‌ హీరో బర్త్ డే రోజు వస్తే చాలు హిట్ సినిమాలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. గతంలో మహేశ్‌బాబుతో పాటు పలువురు హీరోల సినిమాలు బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేశాయి. ఇకపోతే ఈనెల రెబల్ స్టార్‌ ప్రభాస్‌ బర్త్‌ డే రానుంది. ఈనెల 23న ఆయన పుట్టిన రోజు జరుపుకోనున్నారు.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం మిస్టర్ ఫర్‌ఫెక్ట్ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 22న థియేటర్లలో డార్లింగ్ ప్రభాస్ సినిమా సందడి చేయనుంది. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్విటర్ ద్వారా వెల్లడించింది. 2011లో వచ్చిన మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ మరోసారి బిగ్‌ స్క్రీన్‌పై అలరించనుంది.

కాగా.. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. కె దశరధ్ దర్శకత్వం వహించిన మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో రావు రమేష్, మురళీ మోహన్, నాసర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న ది రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement