
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్, విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ. అత్యంత భారీ బడ్జెట్‌తో అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య గురువారం రిలీజైంది. ఉదయం నుంచే ప్రపంచవ్యాప్తంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ సందడి మొదలైంది. మొదటి రోజే కల్కి సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
అయితే కల్కి సినిమాకు తెరెకెక్కించేందుకు దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడ్డారు. ఇప్పటికే ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డామని.. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని మేకర్స్ విజ్ఞప్తి చేశారు. అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ కోసం తాను కష్టపడ్డాడో అది చూస్తేనే అర్థమవుతోంది.
తాజాగా తన అరిగిపోయిన చెప్పులను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇది ఒక సుదీర్ఘమైన రోడ్డు ప్రయాణం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. కాగా.. కల్కి చిత్రంలో అగ్రతారలైన కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశాపటానీ లాంటి స్టార్స్ నటించారు. రాజమౌళి, విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో మెరిశారు.
Comments
Please login to add a commentAdd a comment