'ఆ థియేటర్‌తో ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు'.. గుర్తు చేసుకున్న కల్కి డైరెక్టర్‌ | Kalki 2898 AD Director Nag Ashwin Post On Old Sathyam Theatre In Ameerpet Hyderabad | Sakshi
Sakshi News home page

Nag Ashwin: ‍ అమీర్‌పేట్‌లోని థియేటర్‌ను గుర్తు చేసుకున్న కల్కి డైరెక్టర్

Dec 26 2024 8:59 PM | Updated on Dec 27 2024 3:31 PM

Kalki 2898 AD Director Nag Ashwin Post On Old Theatre In Hyderabad

కల్కి మూవీతో సూపర్ హిట్‌ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం కల్కి పార్ట్-2 పనులతో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్.

అయితే తాజాగా హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ థియేటర్‌ను గుర్తు చేసుకున్నారు. అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్లో నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయన్నారు.  తెలుగు సినిమా చరిత్రలో సత్యం థియేటర్ ఒక భాగమన్నారు. ఆ థియేటర్‌లో గీతోపదేశంలోని కుడ్యచిత్రం అంతర్భాగమని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అయితే మల్టీప్లెక్స్‌గా మార్చాక ఆ ఆ కుడ్యచిత్రాన్ని భద్రపరచలేదని ఆవేదన చెందాను.. కానీ మళ్లీ ఆ ఫోటోను చూడడం ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. ఆ చిత్రాలను అలాగే భద్రపరచిన నిర్మాత సునీల్ నారంగ్‌కు ధన్యవాదాలు తెలిపారు.  సత్యం థియేటర్ మళ్లీ సత్యంగానే మారిందని ఇన్‌స్టాలో నాగ్ అశ్విన్‌ పోస్ట్ చేశారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement