Atharva
-
మా వాళ్లని హీరోల్లా చూపించారు
‘‘పోలీస్ విభాగంలో క్లూస్ టీమ్ ఎంత ప్రముఖమైనదో ‘అథర్వ’లో చూపించారు. మా వాళ్లని హీరోల్లా చూపించారు. ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ అడిషనల్ డైరెక్టర్ డా. అనితా ఎవాంజెలిన్. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. క్లూస్, ఫోరెన్సిక్ విభాగంలోని వారికి ‘అథర్వ’ ప్రత్యేక ప్రదర్శన వేశారు. ‘‘మేం నిజంగానే క్రైమ్ సీన్లను చూస్తుంటాం కాబట్టి ఆ జానర్ సినిమాలు చూడం. కానీ ‘అథర్వ’ అద్భుతంగా అనిపించింది’’ అన్నారు హైదరాబాద్ సిటీ పోలీస్, క్లూస్ జాయింట్ డైరెక్టర్ డా. వెంకన్న. -
కోలీవుడ్‌లో సంచలనం.. నలుగురు స్టార్ హీరోలకు షాక్!
తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నలుగురు స్టార్ హీరోలకు షాకిచ్చింది. నిర్మాతలకు సహకరించలేదనే ఆరోపణలతో రెడ్ కార్డ్ ఇవ్వాలని నిర్ణయించింది. హీరోలు ధనుశ్, శింబు, విశాల్, అథర్వకు తమిళ నిర్మాతల సంఘం నిషేధం విధించింది. ఇకపై వీరు ఏ సినిమాల్లోను నటించకుండా రెడ్ కార్డ్ ఇవ్వనున్నారు. (ఇది చదవండి: మాట నిలబెట్టుకున్న విజయ్.. రూ. కోటి పంపిణీకి లిస్ట్ రెడీ!) నిషేధానికి కారణాలివే! నిర్మాత మైఖేల్ రాయప్పన్‌తో ఏర్పడిన వివాదాలతోనే హీరో శింబుకు రెడ్ కార్డు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ వివాదంపై ఇప్పటికే ఎన్నోసార్లు సంప్రదించినా ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రొడ్యూసర్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో నిధులను విశాల్ దుర్వినియోగం చేశారని ఆరోపణలతో రెడ్ కార్డు ఇవ్వనున్నారు. తెనందాల్ నిర్మాణ సంస్థలో ధనుష్ చేసిన సినిమా 80 శాతం షూట్ పూర్తయ్యాక.. ఆ తర్వాత సహకరించకపోవడంతో నిర్మాతకు నష్టం జరిగినట్లు తెలిసింది. అందుకే విశాల్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. మదియలకన్ నిర్మాణ సంస్థతో అథర్వ ఓ చిత్రానికి ఓకే చేశారని.. అయితే షూటింగ్ సమయంలో సహకరించడం లేదనే ఆరోపణలతో అథర్వకు రెడ్ కార్డు ఇవ్వనున్నట్లు సమాచారం. వీరితో పాటు నిర్మాతలకు సహకరించని మరికొందరు నటీనటులకు రెడ్ కార్డ్ ఇవ్వాలని నిర్మాతల సంఘం కొన్ని నెలల క్రితమే నిర్ణయించింది. ఇక ఈ జాబితాలో ధనుష్, శింబు, విశాల్, అథర్వతో పాటు ఎస్జే సూర్య, విజయ్ సేతుపతి, అమలా పాల్, వడివేలు, ఊర్వశి, సోనియా అగర్వాల్ సహా 14 మంది నటీనటులు ఉన్నట్లు సమాచారం. (ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో కుమార్తె.. డేట్ ఫిక్స్! ) మరోవైపు తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రధాన సంఘాలైన దక్షిణ భారత నటీనటుల సంఘం, తమిళ చిత్ర నిర్మాతల సంఘం మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నటీనటుల కాల్షీట్స్, కొత్త ఒప్పందాలపై నిర్మాతల నుంచి కొన్ని ఫిర్యాదులు అందాయి. అదే విధంగా నటీనటుల వైపు నుంచి కొన్ని సమస్యలు ప్రస్తావించారు. ఈ భేటీలో నిర్మాతలకు నష్టం కలిగేలా వ్యవహరించినందుకు నలుగురు హీరోలపై చర్యలకు దిగింది. అయితే నలుగురు స్టార్ హీరోలకు రెడ్ కార్డ్‌లు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. -
అమలా పాల్ ఒక చెత్త హీరోయిన్ అంటూ అథర్వ కామెంట్
అథర్వ మురళీ తమిళ చిత్ర పరిశ్రమలో ఆయన యంగ్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రముఖ తమిళ హీరో మురళి కుమారుడే అథర్వ అనే సంగతి తెలిసందే. 2010లో 'బాణకాతాడి' ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2013లో కోలీవుడ్‌లో విడుదలైన 'పరదేశి'కి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆపై 2019లో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'గద్దలకొండ గణేష్' సినిమాతో తెలుగు సినీరంగంలోకి అథర్వ ప్రవేశించాడు. తాజాగ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో కొత్త వెబ్ సిరీస్ 'మధకం' స్ట్రీమింగ్ ప్రమోషన్‌కు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో అథర్వ మాట్లాడుతూ, తనతో నటించిన హీరోయిన్లలలో అమలా పాల్ చెత్త హీరోయిన్ అని ఇలా చెప్పాడు. (ఇదీ చదవండి: రీ- రిలీజ్ సినిమాలకు ఎందుకంత క్రేజ్..?) 'నా రెండో సినిమా 'ముహుదుముత్ ఉన్ కర్పనై'లో మేమిద్దరం కలిసి నటించాం. షూటింగ్ ప్రారంభం అయ్యాక మొదటి పది రోజుల్లో తనతో ఒక చిన్న వివాదం జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత ఇద్దరి మధ్య ఈ గొడవ మళ్లీ సెట్ అయింది. కానీ ఆమె ఒక చెత్త హీరోయిన్ అనే విషయాన్ని నేరుగా అమలా పాల్కే చెప్పాను' అని అథర్వ తెలిపాడు. దీంతో ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతున్నాయి. -
ఆకట్టుకుంటున్న ‘అధర్వ’ ఫస్ట్ లుక్.. ఆ ఒక్క డైలాగ్ చాలు..!
సినిమాపై బజ్ క్రియేట్ చేయడం, ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రమోషన్స్ చేయడం మామూలు విషయం కాదు. కానీ యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా 'అధర్వ' మీద ముందు నుంచీ ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రమోషన్స్ చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా విడుదల చేయించిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.‘నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించే వరకు ఈ కేసును వదిలిపెట్టను సార్..’అంటూ డైలాగ్ అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి హీరోకి సంబంధించిన యాక్షన్ లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్లు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో హీరో యాక్షన్‌లోకి దిగినట్టు కనిపిస్తోంది. ఇందులో హీరో కార్తీక్ రాజు పవర్ఫుల్ రోల్‌ను పోషించినట్టు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. -
రజనీ కాంత్ చేతులమీదుగా ధోని 'అధర్వ' తొలికాపీ విడుదల
MS Dhoni Atharva First Copy Released By Rajinikanth: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎంఎస్ ధోని: అన్‌టోల్డ్ స్టోరీ'. ఈ సినిమా ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంఎస్ ధోని పాత్రలో దివంగత హీరో సుశాంత్ సింగ్ అద్భుతమైన నటనను కనబర్చాడు. ప్రస్తుతం ధోని ప్రధాన పాత్రలో రూపొందిన గ్రాఫిక్ నవల 'అధర్వ: ది ఆరిజన్'. ఈ గ్రాఫిక్ నవల ఫస్ట్ లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ ధోని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ అధర్వ గ్రాఫిక్ నవల తొలికాపీని తమిళ సూపర్‌స్టార్ రజనీ కాంత్ గురువారం చెన్నైలోని తన నివాసంలో లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ తొలికాపీని రజనీ కాంత్ విడుదల చేయడంపై ధోని సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే బుక్ పబ్లిషర్స్, రచయిత రమేశ్ తమిళమణి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ పుస్తకం ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 1499తో అందుబాటులో ఉందని.. కావాల్సిన వారు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. రజనీ కాంత్ తమ కష్టాన్ని గుర్తించడంతో మరింత ఉత్సాహం పెరిగిందన్నారు. -
అక్టోబర్‌లో రానున్న అధర్వ ‘బూమరాంగ్’
తమిళంలో ప్రతిభావంతులైన యువ కథానాయకుల్లో అధర్వ మురళి ఒకరు. అనువాద చిత్రం ‘అంజలి సీబీఐ’ (తమిళంలో ‘ఇమైక నోడిగల్’)తో తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. నయనతారకు తమ్ముడిగా ప్రారంభ సన్నివేశాల్లో లవర్ బాయ్‌గా, పతాక సన్నివేశాలు వచ్చేసరికి యాక్షన్ హీరోగా రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లో ప్రేక్షకులందర్నీ మెప్పించారు. రీసెంట్గా వరుణ్‌తేజ్ ‘గద్దలకొండ గణేష్’లో దర్శకుడు కావాలనుకునే యువకుడిగా అధర్వ మురళి అద్భుతంగా నటించారు. త్వరలో మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అధర్వ మురళి కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘బూమరాంగ్’. మేఘా ఆకాష్, ఇందూజ రవిచంద్రన్ కథానాయికలు. ఆర్. కణ్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సీహెచ్ సతీష్‌కుమార్ తెలుగులో విడుదల చేస్తుస్తున్నారు. త్వరలో పాటల్ని, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత సీహెచ్ సతీష్‌కుమార్ మాట్లాడుతూ ‘కమర్షియల్ హంగులతో పాటు ప్రేక్షకులు కోరుకునే కొత్త కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఓ సన్నివేశం తర్వాత మరో సన్నివేశం... నెక్ట్స్ ఏం జరుగుతుందనేలా దర్శకుడు చక్కటి స్ర్కీన్ ప్లే రాశారు. అధర్వ మురళి అద్భుతంగా నటించారు. ‘అందాల రాక్షసి’, ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘అర్జున్‌రెడ్డి’, ‘హుషారు’ చిత్రాల్లో పాటలతో తెలుగు ప్రేక్షకులను వీనులవిందైన స్వరాలను అందించిన రధన్, ఈ చిత్రానికి హిట్ ఆల్బమ్ ఇచ్చారు. త్వరలో పాటల్ని, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు. -
గోదారిలో పాట
గ్యాంగ్‌స్టర్ గోదావరికి వెళ్లి పాటలు పాడుతున్నాడు. వరుణ్‌తేజ్, అథర్వ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే, మృణాళిని కథానాయికలుగా నటిస్తున్నారు. గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ గోదావరి పరిసర ప్రాంతాల్లో జరుగుతోందని తెలిసింది. ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ వహిస్తున్నారు. ‘‘గోదావరి జిల్లాలో కాదు.. అచ్చంగా.. గోదారిలో షూటింగ్ నా ఎన్నో ఏళ్ల కల..’’ అని హరీశ్ శంకర్ పేర్కొన్నారు. తమిళ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కు ‘వాల్మీకి’ తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 20న విడుదల చేయాలనుకుంటున్నారు. -
అంజలి.. చాలా పవర్ఫుల్
నయనతార లీడ్ రోల్లో తెరకెక్కిన చిత్రం ‘ఇమైక్క నొడిగల్’. అథర్వ, రాశీఖన్నా కీలక పాత్రల్లో నటించగా, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా నటించారు. నయనతార భర్త విక్రమాదిత్యగా అతిథి పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఆర్. అజయ్‌జ్ఞానముత్తు దర్శకత్వంలో క్యామియో ఫిల్మ్స్ పతాకంపై సీజే జయకుమార్ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది తమిళంలో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్‌పై సీహెచ్ రాంబాబు, ఆచంట గోపీనాథ్‌లు ‘అంజలి సీబీఐ ఆఫీసర్’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. పవర్ఫుల్ సీబీఐ ఆఫీసర్‌గా నయనతార టైటిల్ రోల్లో చాలా బాగా నటించారు. ప్రస్తుతం అనువాదకార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 22న ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. రమేష్ తిలక్, దేవన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, కెమెరా: ఆర్.డి. రాజశేఖర్. -
హన్సిక @ 100
తమిళసినిమా: హన్సిక @100 అనగానే మీరు ఆశ్చర్య పడతారని తెలుసు. తను 100 చిత్రంలో నటిస్తోందా? ఆమె నటించిన చిత్రం నూరు రోజులు ఆడిందా? లాంటి పలు సందేహాలు రావచ్చు. అయితే అవేవి నిజం కాదు. హన్సిక క్రేజీ కథానాయికే. విజయ్, సూర్య, ధనుష్,శింబు వంటి స్టార్ హీరోలతో నటించి సక్సెస్‌లు అందుకుంది. అలాంటి నటి ఆ మధ్య శివకార్తికేయన్‌తో నటించడానికి ఓకే చెప్పగానే ఆ హీరో అదృష్టం అనే ప్రచారం జరిగింది. ఆయన సరసన నటించిన తొలి క్రేజీ హీరోయిన్ హన్సికనే. అంత స్టార్ ఇమేజ్ను హన్సిక సంపాదించుకున్నారు.ఆ ముద్దుగుమ్మ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి మంచి మార్కెట్‌ను అందుకుంది. ఇంకా చెప్పాలంటే ఈ బ్యూటీ ఖాతాలో విజయాల సంఖ్యే ఎక్కువ. అయితే ఇప్పుడు ఈ అమ్మడికి కాస్త క్రేజ్ తగ్గిందని చెప్పక తప్పదు. కారణాలేమైనా అవకాశాలు పలచబడ్డాయి. చాలా గ్యాప్ తరువాత అధర్వకు జంటగా ఒక తమిళ సినిమాలో నటిస్తోంది. దీనికి శ్యామ్ అంటాన్ దర్శకుడు. ఈయన ఇంతకు ముందు జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా డార్లింగ్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఇటీవలే షూటింగ్‌ను ప్రారంభించుకున్న ఈ చిత్రంలో అధర్వ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నటి హన్సిక నటిస్తోంది. దీనికి 100 అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో అధర్వ పోలీస్ పాత్రలో నటిస్తుండడంతో పోలీస్‌స్టేషన్ ఫోన్ నంబర్ 100 కావడంతో అదే పేరును చిత్రానికి నిర్ణయించినట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఈ 100 చిత్రంలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని, ఈ చిత్రంతో కోలీవుడ్‌లో మరో రౌండ్ కొట్టడం ఖాయం అనే నమ్మకాన్ని నటి హన్సిక వ్యక్తం చేస్తోంది. -
అధర్వ కోసం రూ.కోటి సెట్
తమిళసినిమా: సినిమాకు గ్లామర్‌తో పాటు భారీతనం చాలా అవసరం. అదే విధంగా కొత్తదనం కూడా ఉండాలి. అందుకే యువ నటుడు అధర్వ చిత్రంలోని ఒక్క పాట కోసమే కోటి రూపాయల ఖర్చుతో బ్రహ్మాండమైన సెట్‌ను వేశారు. నటుడు అధర్వ నటిస్తున్న తాజా చిత్రం బూమరాంగ్. టైటిల్లోనే కొత్తదనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చిత్రం కూడా జనరంజకంగా ఉంటుందంటున్నారు ఈ చిత్ర దర్శక నిర్మాత ఆర్.కన్నన్. అవును ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజాగా మసాలా పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం బూమరాంగ్. ఇందులో అధర్వకు జంటగా నటి మేఘాఆకాశ్, ఉపన్పటేల్ నటిస్తున్నారు. ఇందులో ఒక పాట కోసం కళాదర్శకుడు శివ రూ. కోటి వ్యయంతో బ్రహ్మాండమైన సెట్‌ను రూపొందించారట. దీని గురించి దర్శక నిర్మాత ఆర్. కన్నన్ తెలుపుతూ సమాజానికి అవసరం అయిన ఒక ముఖ్యమైన, చాలా బలమైన అంశం గురించి చెప్పే భారీ యాక్షన్ కథా చిత్రంగా బూమరాంగ్ ఉంటుందన్నారు. ఈ చిత్రంలో దేశం గురించి ఒక పాట చోటు ఉంటుందన్నారు. ఈ పాట కోసం ఒక బ్రహ్మాండమైన భారీ సెట్‌ను వేసినట్లు తెలిపారు. సంగీతదర్శకుడు రతన్, గీతరచయిత వివేక్‌ల పాట అద్భుతంగా రావాలన్న తన కలను అర్థం చేసుకుని తాను ఊహించిన దానికంటే బెటర్ పాటను అందించారని అన్నారు. మేయాదమాన్ చిత్రం ఫేమ్ ఇందుజా తమ చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని తెలిపారు. ఈ పాత్రను ఎవరు పాషించాలన్న చర్చ జరిగినప్పుడు చిత్ర యూనిట్ అంతా ఏకగ్రీవంగా ఇందుజా పేరునే చెప్పారన్నారు. చిత్ర షూటింగ్ ప్రణాళిక బద్దంగా చాలా వేగంగా జరుగుతోందని ఆర్.కన్నన్ చెప్పారు. -
అధర్వతో మరోసారి
అధర్వతో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం నటి శ్రీదివ్య తలుపు తట్టింది. కాట్టుమల్లి చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన టాలీవుడ్ బ్యూటీ శ్రీదివ్య తొలి చిత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. శ్రీదివ్యకు మాత్రం వరుత్తపడాద వాలిభర్‌సంఘం చిత్రంతో అదృష్టం తేనెతుట్టెలా పట్టింది. శివకార్తికేయన్‌తో జత కట్టిన ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో శివకార్తికేయన్‌తో పాటు శ్రీదివ్య కేరీర్ సరసరా అంటూ పైకి ఎగిరింది. శ్రీదివ్య తదుపరి నటిం చిన జీవా, కాకీసటై్ట, ఈటీ, కాష్మోరా వంటి చిత్రాలు మం చి విజయాలను సాధించడంతో తను లక్కీ నాయకిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ మధ్య నటించిన బెంగుళూర్ డేస్ చిత్రం కాస్త నిరాశ పరచిందనే చెప్పాలి. అదే విధంగా కాష్మోరా చిత్రం విజయం నయనతార ఖాతాలో పడిపోయింది. ఏదేమైనా ఇక శ్రీదివ్య చేతిలో ఒకే ఒక్క చిత్రం ఉంది. జీవాకు జంటగా సంగిలి బుంగిలి కదవై తెర చిత్రంలో నటిస్తున్న శ్రీదివ్యను కోలీవుడ్ పక్కన పెట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. ఆమె కూడా తెలుగు చిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా యువ నటుడు అధర్వకు జంటగా నటించే అవకాశం వరించింది. వీరిద్దరూ కలిసి ఒత్తక్కు ఒత్త అనే చిత్రంలో నటించనున్నారు. ఇంతకు ముందు అధర్వకు జంటగా నటించిన ఈటీ మంచి విజయాన్ని సాధించిందన్నది గమనార్హం. కాగా ఒత్తక్కు ఒత్త చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక అధర్వ తాజాగా తాను సొంతంగా నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్న చమ బోధ ఆగాదు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. -
అమ్మాయిలా చాటింగ్.. ఉన్మాదిలా కత్తిపోట్లు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఫేస్ బుక్ లో ఒక అమ్మాయిగా పరిచయం చేసుకొని దగ్గరై నిజం తెలిసిన తర్వాత ఆ అమ్మాయి నిరాకరించడంతో ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. దారుణంగా పొడిచి హతమార్చాడు. అడ్డొచ్చిన ఆమె తల్లిపై కూడా దాడి చేశాడు. ఆ యువతి అక్కడికక్కడే చనిపోగా తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గీతా నగర్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమిత్ యాదవ్ అనే 24 ఏళ్ల యువకుడు ఫేస్ బుక్ లో ఓ నకిలీ ఖాతా క్రియేట్ చేసుకున్నాడు. ఆ ఖాతాలో తనను ఒక అమ్మాయిగా పరిచయం చేసుకున్నాడు. పేరు అధర్వగా పేర్కొన్నాడు. అనంతరం ప్రియా రావత్(17) అనే అమ్మాయితో అమ్మాయిగానే పరిచయం పెంచుకున్నాడు. చివరకు ప్రియాకు ఈ విషయం తెలిసి ముఖం చాటేసింది. అతడితో చాట్ చేయడం మానేసింది. దీంతో ఆ యువకుడు ఆమెను కలిసేందుకు వస్తానంటే నిరాకరించింది. దీంతో నేరుగా ఇంటికి వెళ్లిన అతడు తనతో మాట్లాడాలని బ్రతిమిలాడాడు. అయితే, తనకు అబద్ధం చెప్పి మోసం చేశావని, మాట్లాడటం, చాట్ చేయడం కుదరదని తెగేసి చెప్పింది. దీంతో ఒక్కసారిగా ఉన్మాదిలా మారి కత్తి పోట్లు పొడిచాడు. ఆమె తల్లిపై కూడా కత్తితో దాడి చేసి పారిపోయే క్రమంలో రెండో అంతస్తు నుంచి దూకి కాళ్లు విరగ్గొట్టుకుని పోలీసుల చేతికి చిక్కాడు. -
అధర్వతో ఇద్దరు ముద్దుగుమ్మల రొమాన్స్
ఈ మధ్య ఇద్దరు హీరోయిన్ల చిత్రాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పవచ్చు. అది కమర్షియల్ చిత్రం అయినా క్లాసికల్ చిత్రం అయినా, హారర్ చిత్రం అయినా, టైమ్ మిషన్ చిత్రం అయినా కావచ్చు. ఇప్పటి వరకూ సింగిల్ హీరోయిన్‌తో సరిపుచ్చుకుంటూ వచ్చిన యువ నటుడు అధర్వ తాజాగా ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తుండడం విశేషం. దివంగత సీనియర్ నటుడు మురళి వారసుడిగా బానాకాత్తాడి చిత్రంలో కథానాయకుడిగా పరిచయం అయిన అధర్వకు ఆ చిత్రం ఆశించిన రిజల్ట్‌ను ఇవ్వకపోయినా వరుసగా అవకాశాలు రాబట్టుకుంటున్నారు. అలాంటి సమయంలో బాలా దర్శకత్వంలో నటించిన పరదేశీ చిత్రం నటుడిగా అధర్వకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత కాస్త వెనకబడినా ఇటీ వల ఈటీ, కణిదన్ చిత్రాలు ఆయనకు మంచి విజయాలను అందించాయి. ప్రస్తుతం రుక్మిణి వండి వరుదు చిత్రాన్ని పూర్తి చేసిన అధర్వ తాజాగా చాలా మంది కథానాయకుల మాదిరిగానే సొంత చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చమ బోద ఆగదా అనే చిత్రాన్ని నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇద్దరు నాయికలు ఉండే ఇందులో ప్రముక నటీమణుల్ని నటింపజేయాలని మొదట భావించినా, బడ్జెట్ ఎగిరి కూర్చోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ఉత్తరాది భామలు అనైక, మిష్టిలను ఎంపిక చేశారు. వీరిలో అనైక దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చిత్రం సత్య-2 ద్వారా పరిచయం అయ్యిందన్నది గమనార్హం. తమిళంలోనూ వసంతబాలన్ దర్శకత్వం వహించిన కావయతలైవన్ చిత్రంలో నటించింది.ఆ తరువాత కోలీవుడ్‌లో కనిపించకుండా పోయిన అనైక ఇప్పుడు అధర్వ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనుందన్న మాట. మరో హీరోయిన్ మిష్టి హిందీలో సుభాష్‌ఘాయ్ దర్శకత్వం వహించిన కాంచీ చిత్రం ద్వారా పరిచయమైంది.అయితే తమిళంలో ఆమెకిదే తొలి చిత్రం అవుతుంది. ఇకపోతే అధర్వ తొలి చిత్రం బానాకాత్తాడి చిత్రానికి దర్శకత్వం వహించిన బద్రి ఈ చమ బోద ఆగదా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే చిత్ర షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది కమర్షియల్ అంశాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. ఇందులో అధర్వకు జంటగా మిష్టి నటిస్తుండగా ఎవరూ నటించడానికి సాహసించని ఒక బోల్డ్ పాత్రలో అనైక నటిస్తోందని తెలిపారు. ఆ పాత్రకు సంబంధించి ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదన్నారు.అయితే ఇద్దరు హీరోయిన్లకు చిత్రంలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. -
గ్రాఫిక్ నవలలో...
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 2016లో ‘అథర్వ’గా అలరించనున్నారు. అయితే ఆయన కనపడేది వెండితెరపై కాదు. పుస్తక రూపంలో. చెన్నైకు చెందిన విర్జూ స్టూడియోస్ ఈ గ్రాఫిక్ నవలకు శ్రీకారం చుట్టింది. ఈ గ్రాఫిక్ నవలలో అథర్వాగా షారుక్ పుస్తక ప్రియులను అలరించనున్నారు. డైనోసార్స్ జీవించిన కాలం ముందు జరిగిన కథకు అక్షర రూపమే ఈ నవల. దీన్ని చదివే పాఠకుల ఊహకు ఏమాత్రం తగ్గకుండా ఆనాటి పాత్రలను కళ్లకు కట్టేలా త్రీడీ టెక్నాలజీ పరిజ్ఞానంతో కథలోని ముఖ్యఘట్టాలను రూపొందించనున్నామని నవలా రచయిత రమేష్ థమ్మిలని చెప్పారు. విశేషం ఏంటంటే.. ఈ నవలకు సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ టీజర్‌ను చూసిన షారుక్ అభిమానులు దీన్ని సినిమాగా తీయాలని కోరుతున్నారట. కానీ, తెరరూపం ఇవ్వడ అంత సులువు కాదనీ, చాలా సమయం పడుతుందని, దాని గురించి ఇప్పుడిప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుందని రమేష్ థమ్మిలని పేర్కొన్నారు ‘‘ ఈ నవల గురించి షారుక్‌ఖాన్‌ను సంప్రదించాం. ఆయన మా కష్టాన్ని నమ్మి ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడానికి వెంటనే అంగీకరించారు’’ అని ఆయన తెలిపారు. ఈ బుక్ డిజైన ర్ రమేష్ ఆచార్య మాట్లాడుతూ -‘‘ఈ నవల స్మార్ట్ టీవీలు, ఇ-బుక్ ఫార్మట్లలో వచ్చే ఏడాది నుంచి అందుబాటులో ఉంటుంది’’ అని చెప్పారు. -
అధర్వకు జంటగా శ్రీ దివ్య
టాలీవుడ్ యువ హీరోయిన్ శ్రీ దివ్యకు కోలీవుడ్‌లో క్రేజ్ పెరుగుతోంది. ఒకటి తరువాత మరొకటి అంటూ వరుసగా చిత్రాలు చేసుకుపోతోంది. ప్రతిభ ప్రాతిపదిక అన్నది ఈ చిన్నదాని విషయంలో నిజం అయ్యింది. తొలి చిత్రం వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రం సక్సెస్ కావడం శ్రీదివ్యకు బాగా ఉపయోగపడింది. ఈ చిత్రంలో పక్కింటి అమ్మాయి అన్న ఇమేజ్ సంపాదించుకున్న ఈ సుందరికి తమిళ చిత్ర పరిశ్రమలో ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం సంగీత దర్శకుడు హీరోగా పరిచయం అవుతున్న పెన్సిల్ చిత్రంలో నటిస్తున్న శ్రీ దివ్యకు తాజాగా అధర్వతో రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది. వీరిద్దరూ కలసి నటించనున్న చిత్రానికి ‘ఈ తి’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. నవ దర్శకుడు రవి అరసు మెగా ఫోన్ పడుతున్న ఈ చిత్రం ఈ నెలలోనే సెట్‌పైకి రానుంది. ఈ చిత్రాన్ని మైఖేల్ రాయప్పన్, వెట్రిమారన్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రంతో పాటు శ్రీదివ్య కాట్టుమల్లి, సుశీంద్రన్ దర్శకత్వంలో విష్ణు సరసన నటించనుంది.