
గ్రాఫిక్ నవలలో...
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ 2016లో ‘అథర్వ’గా అలరించనున్నారు. అయితే ఆయన కనపడేది వెండితెరపై కాదు.
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ 2016లో ‘అథర్వ’గా అలరించనున్నారు. అయితే ఆయన కనపడేది వెండితెరపై కాదు. పుస్తక రూపంలో. చెన్నైకు చెందిన విర్జూ స్టూడియోస్ ఈ గ్రాఫిక్ నవలకు శ్రీకారం చుట్టింది. ఈ గ్రాఫిక్ నవలలో అథర్వాగా షారుక్ పుస్తక ప్రియులను అలరించనున్నారు. డైనోసార్స్ జీవించిన కాలం ముందు జరిగిన కథకు అక్షర రూపమే ఈ నవల. దీన్ని చదివే పాఠకుల ఊహకు ఏమాత్రం తగ్గకుండా ఆనాటి పాత్రలను కళ్లకు కట్టేలా త్రీడీ టెక్నాలజీ పరిజ్ఞానంతో కథలోని ముఖ్యఘట్టాలను రూపొందించనున్నామని నవలా రచయిత రమేష్ థమ్మిలని చెప్పారు. విశేషం ఏంటంటే.. ఈ నవలకు సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు.
ఈ టీజర్‌ను చూసిన షారుక్ అభిమానులు దీన్ని సినిమాగా తీయాలని కోరుతున్నారట. కానీ, తెరరూపం ఇవ్వడ అంత సులువు కాదనీ, చాలా సమయం పడుతుందని, దాని గురించి ఇప్పుడిప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుందని రమేష్ థమ్మిలని పేర్కొన్నారు ‘‘ ఈ నవల గురించి షారుక్‌ఖాన్‌ను సంప్రదించాం. ఆయన మా కష్టాన్ని నమ్మి ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడానికి వెంటనే అంగీకరించారు’’ అని ఆయన తెలిపారు. ఈ బుక్ డిజైన ర్ రమేష్ ఆచార్య మాట్లాడుతూ -‘‘ఈ నవల స్మార్ట్ టీవీలు, ఇ-బుక్ ఫార్మట్‌లలో వచ్చే ఏడాది నుంచి అందుబాటులో ఉంటుంది’’ అని చెప్పారు.