గోదారిలో పాట | varun tej valmiki released on september 20 | Sakshi
Sakshi News home page

గోదారిలో పాట

Published Fri, Aug 30 2019 1:50 AM | Last Updated on Fri, Aug 30 2019 1:50 AM

varun tej valmiki released on september 20 - Sakshi

వరుణ్‌తేజ్

గ్యాంగ్‌స్టర్‌ గోదావరికి వెళ్లి పాటలు పాడుతున్నాడు. వరుణ్‌తేజ్, అథర్వ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే, మృణాళిని కథానాయికలుగా నటిస్తున్నారు. గోపీ ఆచంట, రామ్‌ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో వరుణ్‌ తేజ్‌ కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ గోదావరి పరిసర ప్రాంతాల్లో జరుగుతోందని తెలిసింది.

ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ వహిస్తున్నారు. ‘‘గోదావరి జిల్లాలో కాదు.. అచ్చంగా.. గోదారిలో షూటింగ్‌ నా ఎన్నో ఏళ్ల కల..’’ అని హరీశ్‌ శంకర్‌ పేర్కొన్నారు. తమిళ హిట్‌ చిత్రం ‘జిగర్తాండ’కు ‘వాల్మీకి’ తెలుగు రీమేక్‌. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 20న విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement