గద్దలకొండ గణేశ్‌ | Varun Tej is Valmiki becomes Gaddalakonda Ganesh | Sakshi
Sakshi News home page

గద్దలకొండ గణేశ్‌

Published Fri, Sep 20 2019 1:01 AM | Last Updated on Fri, Sep 20 2019 1:01 AM

Varun Tej is Valmiki becomes Gaddalakonda Ganesh - Sakshi

వరుణ్‌ తేజ్‌

వరుణ్‌ తేజ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్మీకి’. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై గోపీ ఆచంట, రామ్‌ ఆచంట నిర్మించారు. పూజా హెగ్డే, అథర్వ మురళి ముఖ్య పాత్రల్లో నటించారు. నేడు ఈ చిత్రం విడుదల కానుంది.  ఈ సినిమా టైటిల్‌ (వాల్మీకి) మార్చమంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటీషన్‌ వేసింది. దాంతో చిత్రబృందానికి హైకోర్ట్‌ నోటీసులు పంపింది. నోటీసులకు వివరణ ఇచ్చిన చిత్రబృందం, టైటిల్‌ను మారుస్తామని హైకోర్టుకి తెలియజేసింది. ‘వాల్మీకి’ టైటిల్‌ను ‘గద్దలకొండ గణేశ్‌’గా మారుస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలో గద్దలకొండ గణేశ్‌ పాత్రలో వరుణ్‌ తేజ్‌ నటించారు. తమిళ ‘జిగర్తండా’ సినిమాకు ఇది రీమేక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement