భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఫేస్ బుక్ లో ఒక అమ్మాయిగా పరిచయం చేసుకొని దగ్గరై నిజం తెలిసిన తర్వాత ఆ అమ్మాయి నిరాకరించడంతో ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. దారుణంగా పొడిచి హతమార్చాడు. అడ్డొచ్చిన ఆమె తల్లిపై కూడా దాడి చేశాడు. ఆ యువతి అక్కడికక్కడే చనిపోగా తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గీతా నగర్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమిత్ యాదవ్ అనే 24 ఏళ్ల యువకుడు ఫేస్ బుక్ లో ఓ నకిలీ ఖాతా క్రియేట్ చేసుకున్నాడు.
ఆ ఖాతాలో తనను ఒక అమ్మాయిగా పరిచయం చేసుకున్నాడు. పేరు అధర్వగా పేర్కొన్నాడు. అనంతరం ప్రియా రావత్(17) అనే అమ్మాయితో అమ్మాయిగానే పరిచయం పెంచుకున్నాడు. చివరకు ప్రియాకు ఈ విషయం తెలిసి ముఖం చాటేసింది. అతడితో చాట్ చేయడం మానేసింది. దీంతో ఆ యువకుడు ఆమెను కలిసేందుకు వస్తానంటే నిరాకరించింది. దీంతో నేరుగా ఇంటికి వెళ్లిన అతడు తనతో మాట్లాడాలని బ్రతిమిలాడాడు. అయితే, తనకు అబద్ధం చెప్పి మోసం చేశావని, మాట్లాడటం, చాట్ చేయడం కుదరదని తెగేసి చెప్పింది. దీంతో ఒక్కసారిగా ఉన్మాదిలా మారి కత్తి పోట్లు పొడిచాడు. ఆమె తల్లిపై కూడా కత్తితో దాడి చేసి పారిపోయే క్రమంలో రెండో అంతస్తు నుంచి దూకి కాళ్లు విరగ్గొట్టుకుని పోలీసుల చేతికి చిక్కాడు.
అమ్మాయిలా చాటింగ్.. ఉన్మాదిలా కత్తిపోట్లు
Published Wed, Sep 28 2016 8:32 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
Advertisement
Advertisement