MS Dhoni Atharva First Copy Released By Rajinikanth: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎంఎస్ ధోని: అన్‌టోల్డ్ స్టోరీ'. ఈ సినిమా ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంఎస్ ధోని పాత్రలో దివంగత హీరో సుశాంత్ సింగ్ అద్భుతమైన నటనను కనబర్చాడు. ప్రస్తుతం ధోని ప్రధాన పాత్రలో రూపొందిన గ్రాఫిక్ నవల 'అధర్వ: ది ఆరిజన్'. ఈ గ్రాఫిక్ నవల ఫస్ట్ లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ ధోని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ అధర్వ గ్రాఫిక్ నవల తొలికాపీని తమిళ సూపర్‌స్టార్ రజనీ కాంత్ గురువారం చెన్నైలోని తన నివాసంలో లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ తొలికాపీని రజనీ కాంత్ విడుదల చేయడంపై ధోని సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే బుక్ పబ్లిషర్స్, రచయిత రమేశ్ తమిళమణి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ పుస్తకం ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 1499తో అందుబాటులో ఉందని.. కావాల్సిన వారు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. రజనీ కాంత్ తమ కష్టాన్ని గుర్తించడంతో మరింత ఉత్సాహం పెరిగిందన్నారు.
Atharva: రజనీ కాంత్ చేతులమీదుగా ధోని 'అధర్వ' తొలికాపీ విడుదల
Published Sat, Feb 26 2022 8:33 AM | Last Updated on Sat, Feb 26 2022 8:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment