
అథర్వ మురళీ తమిళ చిత్ర పరిశ్రమలో ఆయన యంగ్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రముఖ తమిళ హీరో మురళి కుమారుడే అథర్వ అనే సంగతి తెలిసందే. 2010లో 'బాణకాతాడి' ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2013లో కోలీవుడ్‌లో విడుదలైన 'పరదేశి'కి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆపై 2019లో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'గద్దలకొండ గణేష్' సినిమాతో తెలుగు సినీరంగంలోకి అథర్వ ప్రవేశించాడు.
తాజాగ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో కొత్త వెబ్ సిరీస్ 'మధకం' స్ట్రీమింగ్ ప్రమోషన్‌కు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో అథర్వ మాట్లాడుతూ, తనతో నటించిన హీరోయిన్లలలో అమలా పాల్ చెత్త హీరోయిన్ అని ఇలా చెప్పాడు.
(ఇదీ చదవండి: రీ- రిలీజ్ సినిమాలకు ఎందుకంత క్రేజ్..?)
'నా రెండో సినిమా 'ముహుదుముత్ ఉన్ కర్పనై'లో మేమిద్దరం కలిసి నటించాం. షూటింగ్ ప్రారంభం అయ్యాక మొదటి పది రోజుల్లో తనతో ఒక చిన్న వివాదం జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత ఇద్దరి మధ్య ఈ గొడవ మళ్లీ సెట్ అయింది. కానీ ఆమె ఒక చెత్త హీరోయిన్ అనే విషయాన్ని నేరుగా అమలా పాల్‌కే చెప్పాను' అని అథర్వ తెలిపాడు. దీంతో ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment