అధర్వతో మరోసారి | sridivya teamup with adharva | Sakshi
Sakshi News home page

అధర్వతో మరోసారి

Published Sun, Apr 9 2017 2:24 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

అధర్వతో మరోసారి

అధర్వతో మరోసారి

అధర్వతో మరోసారి రొమాన్స్‌ చేసే అవకాశం నటి శ్రీదివ్య తలుపు తట్టింది. కాట్టుమల్లి చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన టాలీవుడ్‌ బ్యూటీ శ్రీదివ్య తొలి చిత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. శ్రీదివ్యకు మాత్రం వరుత్తపడాద వాలిభర్‌సంఘం చిత్రంతో అదృష్టం తేనెతుట్టెలా పట్టింది. శివకార్తికేయన్‌తో జత కట్టిన ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో శివకార్తికేయన్‌తో పాటు శ్రీదివ్య కేరీర్‌ సరసరా అంటూ పైకి ఎగిరింది. శ్రీదివ్య తదుపరి నటిం చిన జీవా, కాకీసటై్ట, ఈటీ, కాష్మోరా వంటి చిత్రాలు మం చి విజయాలను సాధించడంతో తను లక్కీ నాయకిగా పేరు తెచ్చుకున్నారు.

అయితే ఈ మధ్య నటించిన బెంగుళూర్‌ డేస్‌ చిత్రం కాస్త నిరాశ పరచిందనే చెప్పాలి. అదే విధంగా కాష్మోరా చిత్రం విజయం నయనతార ఖాతాలో పడిపోయింది. ఏదేమైనా ఇక శ్రీదివ్య చేతిలో ఒకే ఒక్క చిత్రం ఉంది. జీవాకు జంటగా సంగిలి బుంగిలి కదవై తెర చిత్రంలో నటిస్తున్న శ్రీదివ్యను కోలీవుడ్‌ పక్కన పెట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. ఆమె కూడా తెలుగు చిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా యువ నటుడు అధర్వకు జంటగా నటించే అవకాశం వరించింది.

వీరిద్దరూ కలిసి ఒత్తక్కు ఒత్త అనే చిత్రంలో నటించనున్నారు. ఇంతకు ముందు అధర్వకు జంటగా నటించిన ఈటీ మంచి విజయాన్ని సాధించిందన్నది గమనార్హం. కాగా ఒత్తక్కు ఒత్త చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక అధర్వ తాజాగా తాను సొంతంగా నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్న చమ బోధ ఆగాదు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement