Sridivya
-
అధర్వతో మరోసారి
అధర్వతో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం నటి శ్రీదివ్య తలుపు తట్టింది. కాట్టుమల్లి చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన టాలీవుడ్ బ్యూటీ శ్రీదివ్య తొలి చిత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. శ్రీదివ్యకు మాత్రం వరుత్తపడాద వాలిభర్‌సంఘం చిత్రంతో అదృష్టం తేనెతుట్టెలా పట్టింది. శివకార్తికేయన్‌తో జత కట్టిన ఆ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో శివకార్తికేయన్‌తో పాటు శ్రీదివ్య కేరీర్ సరసరా అంటూ పైకి ఎగిరింది. శ్రీదివ్య తదుపరి నటిం చిన జీవా, కాకీసటై్ట, ఈటీ, కాష్మోరా వంటి చిత్రాలు మం చి విజయాలను సాధించడంతో తను లక్కీ నాయకిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ మధ్య నటించిన బెంగుళూర్ డేస్ చిత్రం కాస్త నిరాశ పరచిందనే చెప్పాలి. అదే విధంగా కాష్మోరా చిత్రం విజయం నయనతార ఖాతాలో పడిపోయింది. ఏదేమైనా ఇక శ్రీదివ్య చేతిలో ఒకే ఒక్క చిత్రం ఉంది. జీవాకు జంటగా సంగిలి బుంగిలి కదవై తెర చిత్రంలో నటిస్తున్న శ్రీదివ్యను కోలీవుడ్ పక్కన పెట్టేసిందనే ప్రచారం జరుగుతోంది. ఆమె కూడా తెలుగు చిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా యువ నటుడు అధర్వకు జంటగా నటించే అవకాశం వరించింది. వీరిద్దరూ కలిసి ఒత్తక్కు ఒత్త అనే చిత్రంలో నటించనున్నారు. ఇంతకు ముందు అధర్వకు జంటగా నటించిన ఈటీ మంచి విజయాన్ని సాధించిందన్నది గమనార్హం. కాగా ఒత్తక్కు ఒత్త చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక అధర్వ తాజాగా తాను సొంతంగా నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్న చమ బోధ ఆగాదు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. -
నా చిత్రంలో కొందరు హీరోలు నటించనన్నారు
నా చిత్రంలో నటించడానికి కొందరు హీరోలు అంగీకరించలేదని దర్శకుడు సుశీంద్రన్ అన్నారు. ఆయన తాజా చిత్రం మావీరన్ కిట్టు. విష్ణువిశాల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీదివ్య హీరోరుున్‌గా నటించారు. నటుడు పార్తీబన్ ముఖ్య పాత్రను పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ మొదటి వారంలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుశీంద్రన్ మాట్లాడుతూ ఇది మూడేళ్ల క్రితం తయారు చేసుకున్న కథ అని తెలిపారు. ఈ కథను నటుడు పార్తీబన్‌కు చెప్పగా తానీ చిత్రంలో తప్పకుండా నటిస్తానని అన్నారన్నారు. అరుుతే పలువురు నటులు ఇందుకు నిరాకరించారని అన్నారు. అందుకు వారు చెప్పిన కారణం ఇందులో పార్తీబన్ పాత్రకు అధిక ప్రాధాన్యత ఉందని, ఆ పాత్రను తగ్గించమని కోరినట్టు తెలిపారు. అందుకు తాను అంగీకరించలేదని చెప్పారు. ఆ తరువాత నటుడు విష్ణు విశాల్ నటించడానికి ముందు కొచ్చారని తెలిపారు. ఇది 1980లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం అని తెలిపారు. ఐఏఎస్ అధికారి కావాలని ఆశ పడిన ఓ యువకుడు ఎరుర్కొనే సమస్యల ఇతివృత్తమే మావీరన్ కిట్టు చిత్రం అని తెలిపారు. ఓల్డ్ పీరియడ్ కథా చిత్రం కావడంతో లొకేషన్స, డస్రు తదిరత విషయాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. చిత్రంలో చివరి అరగంట ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందన్నారు. కమర్షియల్ గానూ విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని సుశీంద్రన్ వ్యక్తం చేశారు. -
ప్రేక్షకులు అన్నీ గమనిస్తారు!
ఈ కాలం సినీ అభిమానులు సినిమాల్లోని అన్ని విషయాలనూ క్షుణ్ణంగా గమనిస్తున్నారని దర్శక, నటుడు పార్తిబన్ వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణకు దేశంలో చాలా విషయాలున్నా ఇటీవల ఈ మధ్య విడుదలైన తొడరి చిత్రంలోని ఒక సన్నివేశంలో 150 కిలోమీటర్ల వేగంతో రైలు పయనిస్తున్నా అందులోని నటి కీర్తీసురేశ్ ఓణీ కొంచెం కూడా కదలలేదంటూ ప్రేక్షకులు పరిహాసం చేసిన విషయం వాట్సాప్‌లో హల్ చల్ చేసిందన్నారు. అదే విధంగా దర్శక నటుడు ప్రభుదేవా హీరోయిన్‌కు డా న్‌సలో శిక్షణ ఇవ్వడానికి రెండు రోజులు, దాని పర్ఫెక్షన్కు ఎనిమిది రోజులు పడుతుందని ఇటీవల పేర్కొన్నారన్నారు. అలా పర్ఫెక్షన్కు ప్రాముఖ్యత నిచ్చే దర్శకుడు సుశీంద్రన్ అని పేర్కొన్నారు. నటి శ్రీదివ్య మంచి నటి అని, ఆమెను మావీరన్ కిట్టు చిత్రంలోని ఒక ఏడ్చే సన్నివేశం కోసం గ్లిజరిన్ వేసుకోమని చెప్పడంతో ఆ సన్నివేశంలో తన ముఖం కనిపించదని తెలిసినా సన్నివేశం బాగా రావాలని మారు మాట చెప్పకుండా గ్లిజరిన్‌తో నటించారని అన్నారు. ఇక నటుడు విష్ణువిశాల్ సహా మావీరన్ కిట్టు చిత్రంలోని అందరూ చాలా చక్కగా నటించారని అన్నారు. విష్ణువిశాల్, శ్రీదివ్య జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో నల్లుసామి పిక్చర్స్, ఏషియన్ సినీ కంబైన్స సంస్థల అధినేతలు ఐస్వేర్.చంద్రస్వామి, డీఎన్.తాయ్ శరవణన్, రాజీవన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం మావీరన్ కిట్టు.డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం స్థానిక సత్యం థియేటర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శక నటుడు పార్తిబన్ పై విధంగా వ్యాఖ్యానించారు. విష్ణువిశాల్, శ్రీదివ్య, దర్శకుడు సుశీంద్రన్, డి.ఇమాన్, చిత్ర నిర్మాతలతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు. -
బాహుబలిలా శ్రమించాం
దర్శకుడు రాజమౌళి బాహుబలి చిత్రంతో బెంచ్ మార్క్ పెట్టారని కాష్మోరా చిత్ర దర్శకుడు గోకుల్ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు రౌద్రం, ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజా చిత్రం కాష్మోరా. యువ నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన ఇందులో నయనతార, శ్రీదివ్య నాయకిలుగా నటించారు. ఈ చిత్రాన్ని డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మించారు. సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోకుల్, కథానాయకుడు కార్తీ, నిర్మాతల్లో ఒకరైన ఎస్ఆర్.ప్రభు టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిని, బాహుబలి చిత్రాన్ని పదే పదే ప్రస్తావించడం విశేషం.దర్శకుడు మాట్లాడుతూ హిస్టారికల్ అంశాలతో కూడిన పిరియడ్ కథా చిత్రం కాష్మోరా అని తెలిపారు. ఇందులో హిస్టారికల్ సన్నివేశాలు అవసరం అయ్యాయన్నారు. ఈ సన్నివేశాలను రూపొందించడనాకి సిద్ధం అయినప్పుడు బాహుబలి చిత్రం గుర్తు కొచ్చిందన్నారు. ఆ చిత్రంలో గ్రాఫిక్ సన్నివేశాల విషయంలో దర్శకుడు రాజమౌళి బెంచ్‌మార్క్ పెట్టారన్నారు. తాము అంతగా కాకపోయినా కనీసం 30 శాతం అయినా చేయాలని భావించామని తెలిపారు. ఈ చిత్రంలో కార్తీ మూడు విభిన్న పాత్రల్లో నటించారని చెప్పారు. అదే విధంగా నయనతార, శ్రీదివ్య చాలా బాగా నటించారని తెలిపారు. బాహుబలిలా శ్రమించాల్సి వచ్చింది చిత్ర కథానాయకుడు కార్తీ మాట్లాడుతూ కాష్మోరా తన కేరీర్లో చాలా ముఖ్యమైన చిత్రం అని పేర్కొన్నారు. దర్శకుడు గోకుల్ ఈ చిత్రంలోని ఒక పాత్ర గురించి చెప్పినప్పుడే అందులో నటించగలనా అని భయమేసిందన్నారు. కాష్మో రా లాంటి చిత్రం చేయడానికి నిర్మాతలకు సినిమా ప్యాషన్ ఉండాలన్నారు. రెండేళ్ల పాటు చిత్ర యూనిట్ కఠిన శ్రమ కాష్మోరా అని పేర్కొన్నారు. చిత్రంలో హిస్టారికల్ సన్నివేశాలు చోటు చేసుకోవడంతో బాహుబలి చిత్రంలా శ్రమించాల్సివచ్చిందన్నారు. చిత్రాన్ని తమిళం,తెలుగు భాషలలో దీపావళికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చాలా కాలంగా కోరుకుంటున్న మోడరన్ పాత్రను పోషించే అవకాశం కాష్మోరాలో కలిగిందని శ్రీదివ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు సంతోష్నారాయణన్ పాల్గొన్నారు. అయితే షరామామూలుగానే నయనతార పాల్గొనలేదన్నది గమనార్హం. -
అవును... అమ్మ తిట్టింది! - హీరో విశాల్
‘‘ ‘రాయుడు’ మొదటి ఆటను ప్రేక్షకుల మధ్య థియేటర్లో చూశా. వాళ్ల స్పందన చూసి, ‘పందెంకోడి’ చిత్రం అనుభూతి కలిగింది. విశాల్ మంచి పాత్ర ఎంచుకుని న్యాయం చేశాడని అంటున్నారు. తెలుగులో ఇంత మంచి రెస్పాన్ ్స రావడంతో మా అమ్మ నాతో, ‘ఇప్పుడు కూడా తెలుగులో స్ట్రయిట్ చిత్రం చేయకపోతే నీ అంత ఇడియట్ ఉండడు’ అని కోపంగా తిట్టింది. తెలుగులో స్ట్రయిట్ ఫిలిం చేయబోతున్నా. ‘పందెంకోడి’కి సీక్వెల్ చేయాలనే ప్లాన్ ఉంది’’ అని హీరో విశాల్ అన్నారు. విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ సమర్పణలో తమిళంలో తెరకెక్కిన ‘మరుదు’ చిత్రాన్ని జి.హరి ‘రాయుడు’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో హరి మాట్లాడుతూ - ‘‘విశాల్ నాకు రీల్ లైఫ్‌తో పాటు రియల్ లైఫ్‌లోనూ హీరోయే. ఇప్పటికీ రెండువందల థియేటర్లలో విజయవంతంగా మా చిత్రం ప్రదర్శితమవుతోంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అయ్యిందంటే కారణం హరిగారే’’ అని శ్రీదివ్య అన్నారు. -
మార్కెట్లో వార్!
అతను మార్కెట్లో సరుకులు లోడ్ చేసే సాధారణ వ్యక్తి. మార్కెట్‌ను తన గుప్పెట్లో పెట్టుకుని శాసించాలనుకుని ఓ రాజకీయ నాయకుడు ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ ప్రయత్నాలను హీరో ఎలా అడ్డుకున్నాడు? వారిద్దరి మధ్య జరిగే యుద్ధం ఎలా ఉంటుంది? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మరుదు’. విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో ఇటీవల విడుదలై, మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రాన్ని ‘రాయుడు’ పేరుతో హరి వెంకటేశ్వర పిక్చర్స్ అధినేత జి.హరి తెలుగులో ఈ నెల 27న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ- ‘‘తమిళంలో విశాల్ కెరీర్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టడంతో పాటు సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళ వెర్షన్లో మధురై బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. తెలుగుకి అనుగుణంగా అనంతపురం రాప్తాడు గ్రామం నేపథ్యంలో జరిగేలా తీర్చిదిద్దాం. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
మంచి అనిపిస్తే చేసేస్తా!
రాజకీయం కాని పనేమీ కాదు అంటున్నారు ప్రముఖ యువ నటుడు విశాల్. ఈయన వార్తల్లోని వ్యక్తిగా మారి చాలా కాలమైంది. ఒక పక్క నటుడుగా విజయాలను సాధిస్తూనే, మరో పక్క నడిగర్‌సంఘం కార్యదర్శిగా చాలా బాధ్యతలను తన భుజాన వేసుకుని చురుకైన పాత్రను పోషిస్తున్నారు. అంతే కాదు వ్యక్తిగతంగా అవసరమైన వారికి తన వంతు సాయం చేయడంలో ముందుంటున్నారు. ఇక సినిమాల పైరసీపై ఒంటరి పోరాటం చేస్తున్నారు. విశాల్ తాజా చిత్రం మరుదు శుక్రవారం తెరపైకి రానుంది. ఇది కమర్షియల్ అంశాలతో కూడిన పక్కా మాస్ కథా చిత్రం అని తెలుస్తోంది. శ్రీదివ్య కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కొంబన్ చిత్రం ఫేమ్ ముత్తయ్య దర్శకుడు.ఈ చిత్ర విశేషాల గురించి విశాల్‌తో చిట్ చాట్.. ప్ర: మరుదు చిత్రం గురించి క్లుప్తంగా చెప్పండి? జ: మూటలు మోసే ఒక కూలీ ఇతివృత్తం మరుదు. ఆ వృత్తిపై, తన బామ్మపై ప్రేమాభిమానాలే చిత్రం. కుటుంబ విలువలను ఆవిష్కరించే చిత్రం మరుదు. ప్ర: చిత్రం కోసం మూటలు ఎత్తి విసిరేశారట? జ: ఈ చిత్రంలో పాత్ర నాకు చాలా కొత్త. డ్రాయర్ కనిపించే వరకూ లుంగీ పైకి ఎత్తి కట్టి నటించడం కూడా ఇంతకు ముందెప్పుడూ నటించలేదు. చెన్నై లయోలా కళాశాలాలో నటించిన నన్ను దర్శకుడు ముత్తయ్య గ్రామీణ యువకుడిగా మార్చేశారు. నాతో పాటు సూరిని 50 కిలోల బరువైన మూటలను ఎలా సులభంగా విసిరేయవచ్చో నేర్పించారాయన. నాకైతే మెడ నొప్పి పుట్టింది. ప్ర: నటి శ్రీదివ్యతో నటించిన అనుభవం గురించి? జ: ఆ చిత్రంలో శ్రీదివ్య నన్ను కొట్టారు.భయపెట్టారు కూడా. ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్ర: చిత్రంలో మీరు నటుడు రాధారవితో సవాల్ విసిరే డైలాగ్స్ ఉన్నాయట? జ: ముందుగా ఒక విషయం చెప్పాలి. ఈ చిత్రానికి సంభాషణలు రాసింది నేను కాదు దర్శకుడే. నేను రాధారవి ఎలా నటిస్తామని మొదటి రోజు చిత్ర యూనిట్ చాలా టెన్షన్‌గా ఫీలయ్యారు. ఒక రకమైన నిశ్శబ్దం నెలకొంది. అయితే మాకు మాత్రం అలాంటి భావనే లేదు. ఇంకా చెప్పాలంటే ఈ డైలాగ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని రాధారవినే సూచించారు. నిజంగా ఆయనది చాలా పెద్ద మనసు. నడిగర్‌సంఘం నిర్వాకం విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి గానీ వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య ఎలాంటి పగ లేదు. ప్ర: ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రశ్నకు మీ సమాధానం? జ: మనసుకు మంచి అనిపిస్తే దాన్ని ఆలస్యం చేయకుండా చేసేయాలన్నది నా పాలసీ. ఆ విషయంలో భయపడడం జరగదు. నన్ను చూసి 10 మంది సమాజానికి మంచి చేస్తే అది ఆహ్వానించదగ్గ విషయమేగా. ప్ర: రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారా? జ: రాజకీయం కాని పనేమీ కాదు. నా దృష్టిలో అదీ ఒక వృత్తే. ఎంఎల్ఏ, ఎంపీలు తీసుకునే వేతనాలకంటే నేను సినిమా నటుడిగా ఎక్కు వే సంపాదిస్తున్నాను. వాళ్ల కంటే ఎక్కువగానే ఇతరులకు సాయం చేస్తున్నాను. ఏ పార్టీకి సంబంధం లేకుండా సమాజానికి మంచి చేయాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. ప్ర: నటుడు శరత్‌కుమార్‌తో ఎంతగా ఢీకొన్నా ఆయనకు అల్లుడు కానున్నారనే ప్రచారం గురించి? జ: వరలక్ష్మి శరత్‌కుమార్ నాకు చిన్నతనం నుంచే తెలుసు. మేమిద్దరం చాలా కాలంగా స్నేహితులుగా మెలుగుతున్నాం. ఇకపోతే ప్రస్తుతానికి నాకు పెళ్లి ఆలోచన లేదు.నడిగర్‌సంఘానికి నూతన భవనాన్ని కట్టించడమే నా ముందున్న లక్ష్యం. 2018 జనవరి 14వ తేదీన సంఘ భవనానికి ప్రారంభోత్సవం జరగాలి. ఆ తరువాత నా పెళ్లి గురించి స్వయంగా నేనే వెల్లడి స్తాను. -
మహిళ అదృశ్యం
హైదరాబాద్ నగరం కుషాయిగూడలో ఓ మహిళ అదృశ్యమైంది. ఈమేరకు ఆమె తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. హెచ్ బీ కాలనీకి చెందిన శ్రీదివ్య కనిపించ కుండా పోయింది. దీంతో తండ్రి రాములు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సెల్వ దర్శకత్వంలో రెజీనా
చిత్రపరిశ్రమలో ఒక విచిత్రమైన అంశం ఏమిటంటే పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతను అక్షరాలా నిజం చేయబడుతోంది. స్థానిక తారలకు మొదట్లో సొంత గడ్డపై ఆదరణ ఉండదు. పరభాషల్లో పేరు తెచ్చుకున్న తరువాత వారి ప్రతిభ తెలుస్తుంది. ముఖ్యంగా కథానాయికల విషయంలో ఎక్కువగా జరుగుతున్నది ఇదే. ఇటీవల కాలంలో చూస్తే నటి అంజలి, శ్రీదివ్య వంటి తెలుగమ్మాయిలకు తమిళంలో నాయికలుగా గుర్తింపు పొందిన తరువాతే తెలుగు చిత్రాలలో అవకాశాలు పెరిగాయన్నది నిజం. అదే విధంగా తమిళ, మలయాళ నటీమణులు రచ్చ గెలిచి ఇంట గెలుస్తున్నారని చెప్పవచ్చు. ఉదాహరణకు తమిళ నటి రెజీనానే తీసుకుంటే మొదట్లో ఇక్కడ కేడీబిల్లా-కిలాడీరంగా తదితర చిత్రాలలో నటించారు. ఈ తమిళంలో నటించిన చివరి చిత్రం రాజతందిరం. ఆమె నటించిన చిత్రాలు ప్రేక్షకాదరణ పొందినా రెజీనాకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో తను టాలీవుడ్‌పై దృష్టి సారించారు. అక్కడ నాయికగా మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ కోలీవుడ్ కన్ను రెజీనాపై పడింది. రెండు మూడు అవకాశాలు వరిస్తున్నాయి. వాటిలో ఒకటి దర్శకుడు సెల్వరాఘవన్ చిత్రం. కాదల్‌కొండేన్, 7జీ బృందావన్ కాలనీ తదితర చిత్రాలతో వేగంగా దూసుకొచ్చిన ఈ సంచలన దర్శకుడు ఇటీవల వరుస ఫ్లాపులతో కాస్త తడబడ్డారు. తాజాగా ఒక హారర్ కథా చిత్రాన్ని హ్యాండిల్ చేయడానికి సిద్ధం అయ్యారు. ఇందులో కథానాయికగా రెజీనాను ఎంపిక చేసేపనిలో ఉన్నట్లు కోలీవుడ్ సమాచారం. అదే విధంగా ఇందులో హీరోగా దర్శకుడు ఎస్జే.సూర్యను నటింప చేయనున్నట్లు. దీనికి దర్శకుడు గౌతమ్‌మీనన్ నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. -
శ్రీదివ్య చిత్రాలు విడుదల ఎప్పుడో!
లక్కుంటే లక్ష్మి వరిస్తుంది. మరి ముఖం చాటేస్తే? వచ్చేది చిం తే. ప్రస్తుతం నటి శ్రీదివ్య ను అలాంటిదే పట్టింద ట. వరుత్తపడాద వాలిభ ర్ సంఘం చిత్రంతో అనూ హ్య విజయాన్ని తన ఖాతా లో వేసుకుని రాశిగల నటి అ ని ముద్ర వేసుకున్న ఈ అచ్చ తెలుగు అమ్మాయికి ఆ తరువాత విడుదలైన జీవా చిత్రం కూడా హి ట్ అని పించుకోవడం, వరుసగా అ వకాశాలు వచ్చిపడడంతో అమ్మడికి భవిష్యత్ ఉజ్వలంగా కనిపించింది. దీంతో ఒక పెద్ద హీరో చిత్రాన్నికూడా నిరాకరించారనే ప్రచారం జరిగింది. కాగా శ్రీదివ్య నటించిన రెండు చిత్రాల విడుదల ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారడంతో అమ్మడి మనసు బాధపడుతోందట. దీని గురించి శ్రీదివ్య మాట్లాడుతూ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కునార్ సరసన నటించిన పెన్సిల్, అధర్వతో నటించిన ఈటీ చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చే సుకున్నా వాటి విడుదల ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొంది. ఈ రెండు చిత్రాల్లో తనకు బలమైన పాత్రలు లభించాయని చెప్పింది. దీంతో దర్శకుడు చెప్పకపోయినా తాను చాలా హోమ్‌వర్క్ చేసి నటించానని అంది. అలాంటి చిత్రాలు విడుదల కాకపోవడం బాధగా ఉందని పే ర్కొంది. విషయం ఏమిటంటే పెన్సిల్ చిత్రం విడుదల కష్టమే అని జీవీనే ఇటీవల అనడం గమనార్హం. ఇక ఈటీ చిత్ర విషయానికొస్తే అధర్వ నటించిన చండీ వీరన్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఆ తరువాత ఈటీ విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇది శ్రీదివ్యకు కాస్త ఊరటనిచ్చే వార్తే అవుతుందనుకుంటా. -
ప్రేమ.. స్నేహం...
కాలేజీ లైఫ్ అంటే అందరికీ ఇష్టమే. స్నేహం, ప్రేమ కలగలిసిన భావోద్వేగాలతో జీవితం పసందుగా ఉంటుంది. వాటికి తెరరూపాన్నిస్తూ, సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ముఖ్య తారలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘కేరింత’. అడివి సాయికిరణ్ దర్శకుడు. ఈ నెల 12న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ-‘‘ ‘కొత్త బంగారులోకం’ సినిమా తర్వాత కొత్త వాళ్లతో సినిమా చేయాలనుకున్నాం. ఆ టైమ్‌లో సాయికిరణ్ చెప్పిన ఈ కథ నచ్చింది. దీనికి సుమంత్ అశ్విన్ హీరోగా బాగుంటుందనుకున్నాం. ప్రేమ, స్నేహం నేపథ్యంలో అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: విజయ్ చక్రవర్తి. -
ప్రేమ కేరింత
ఆరుగురి యువతీ యువకుల జీవితాల్లో జీవితంలో స్నేహం, ప్రేమ ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కేరింత’. అడవి సాయికిరణ్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ముఖ్య తారలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘చాలా ఫ్రెష్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కించాం. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది’’ అని చెప్పారు. ఈ సినిమాలో పాటలు చాలా బాగా వచ్చాయనీ, రామజోగయ్య శాస్త్రి మంచి సాహిత్యాన్ని అందించారనీ సంగీత దర్శకుడు మిక్కీ జే. మేయర్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కె.చక్రవర్తి, సహనిర్మాతలు: శిరీష్,లక్ష్మణ్. -
'వారధి' మూవీ స్టిల్స్
-
ప్రేమకు వారధి ఎవ రు?
ఇద్దరు యువకులు ఒక అమ్మాయినే ప్రేమించారు. మరి ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది...? చివరికి ఎవరి ప్రేమకు ఎవరు వారధిగా నిలిచారనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘వారధి’. క్రాంతి, శ్రీదివ్య, హేమంత్ ముఖ్యతారలుగా ఇమాజినేషన్స్ పతాకంపై వివేకానంద వర్మ నిర్మించారు. సతీష్ కార్తికేయ దర్శకుడు, ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో క్రాంతి సైకో పాత్ర చేశారు. విజయ్ గొర్తి అందించిన పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సాహిత్యం: చైతన్య వర్మ, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్. -
వారధి మూవీ స్టిల్స్
-
'వారధి' మూవీ ట్రైలర్ లాంచ్..!
-
అతనితో రొమాన్స్ కోసం...
ఇళయదళపతి విజయ్‌తో రొమాన్స్ చేయాలని ఆశగా ఉన్నట్లు యువ నటి శ్రీదివ్య అంటోంది. ఈ అమ్మడు నటించిన రెండు చిత్రాలు వరుత్త పడాద వాలిబర్ సంఘం, జీవా, విడుదలై విజయం సాధించడంతో ఇప్పటి వరకు అపజయం ఎరుగని నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాలు చేతిలో ఉండడంతో బిజీ నటిగా చెలామణి అవుతున్నారు. తొలి చిత్రం వరుత్త పడాద వాలిబర్ సంఘం హీరో శివకార్తికేయన్‌తో మరోసారి జతకట్టిన చిత్రం కాక్కిసట్టై సంక్రాంతికి విడుదలవుతోంది. అంతకంటే ముందు విక్రమ్ ప్రభు సరసన నటించిన వెల్లక్కార దురై చిత్రం క్రిస్మస్కు తెరపైకి రానుంది. దీంతో యమ ఎగ్జైటింగ్‌గా ఉన్న శ్రీ దివ్య వెళ్లక్కార దురై చిత్రంలో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. ఈ చిత్రం తనకు చాలా సంతృప్తి నిచ్చిందని అంది. ప్రస్తుతం జి.వి.ప్రకాష్ కుమార్సరసన పెన్సిల్ చిత్రంలోను, అధర్వతో ఈట్టి, చిత్రంలోను నటిస్తున్నట్లు తెలిపింది. తమిళ చిత్ర పరిశ్రమలో తనకు నచ్చిన హీరో విజయ్ అని చెప్పింది. నటనలో ఆయన వేగం, స్టరుుల్ అంటే చాలా ఇష్టం అని అంది. ఆయన సరసన నటించాలని ఆశగా ఉందని శ్రీదివ్య చెప్పింది. -
అంతా అబద్దం
విజయం ఎంతటి వారిలోనైనా మార్పు తెస్తుంది. అదే విధంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుంటారు. నటి ప్రియా ఆనంద్ ఇందుకు అతీతం కాదంటోంది కోలీవుడ్. ఎదుర్ నీచ్చిల్ చిత్రం ముందు వరకు అవకాశాల కోసం ఈ భామ ఎదురు చూసింది. అయితే ఎదుర్ నీచ్చిల్ విజయంతో అవకాశాలు ప్రియా ఆనంద్‌ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం మూడు చిత్రాలు చేతిలో ఉండడంతో ఈ జాణ తన పారితోషికాన్ని ఏకంగా రూ.50 లక్షలకు పెంచేసిందట. సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటించడానికి రూ.50 లక్షలు డిమాండ్ చేసిందట. అవాక్కైన నిర్మాత ఆమెకు బదులు శ్రీదివ్యను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారని టాక్. ఈ విషయాన్ని ప్రియా ఆనంద్ ఖండించింది. తాను పారితోషికం భారీగా పెంచేశానంటూ అబద్దపు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఇటీవల కథలే వినలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయడానికే ఏడాదికిపైగా పడుతుందని వివరించింది. ఈ చిత్రాలు పూర్తి చేసిన తర్వాతే నూతన అవకాశాలను అంగీకరించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అలాంటిది తానేదో పారితోషికాన్ని భారీగా పెంచాననే ప్రచారం అబద్దమని పేర్కొంది.