అవును... అమ్మ తిట్టింది! - హీరో విశాల్
‘‘ ‘రాయుడు’ మొదటి ఆటను ప్రేక్షకుల మధ్య థియేటర్లో చూశా. వాళ్ల స్పందన చూసి, ‘పందెంకోడి’ చిత్రం అనుభూతి కలిగింది. విశాల్ మంచి పాత్ర ఎంచుకుని న్యాయం చేశాడని అంటున్నారు. తెలుగులో ఇంత మంచి రెస్పాన్ ్స రావడంతో మా అమ్మ నాతో, ‘ఇప్పుడు కూడా తెలుగులో స్ట్రయిట్ చిత్రం చేయకపోతే నీ అంత ఇడియట్ ఉండడు’ అని కోపంగా తిట్టింది. తెలుగులో స్ట్రయిట్ ఫిలిం చేయబోతున్నా. ‘పందెంకోడి’కి సీక్వెల్ చేయాలనే ప్లాన్ ఉంది’’ అని హీరో విశాల్ అన్నారు.
విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ సమర్పణలో తమిళంలో తెరకెక్కిన ‘మరుదు’ చిత్రాన్ని జి.హరి ‘రాయుడు’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో హరి మాట్లాడుతూ - ‘‘విశాల్ నాకు రీల్ లైఫ్‌తో పాటు రియల్ లైఫ్‌లోనూ హీరోయే. ఇప్పటికీ రెండువందల థియేటర్లలో విజయవంతంగా మా చిత్రం ప్రదర్శితమవుతోంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అయ్యిందంటే కారణం హరిగారే’’ అని శ్రీదివ్య అన్నారు.